టాలీవుడ్ కు మరోసారి పెళ్లి కళ

ఈ ఏడాది టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చింది. ఒకేసారి, ఒకే సీజన్ లో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ ఏడాది టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చింది. ఒకేసారి, ఒకే సీజన్ లో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం వీళ్ల వెడ్డింగ్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా కలర్ ఫుల్ గా మారింది.

మొన్నటికిమొన్న సాయిదుర్గతేజ్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తన స్నేహితురాలు కిరణ్మయితో అతడి నిశ్చితార్థం పూర్తయింది. వచ్చే నెలలో హైదరాబాద్ లోనే పెళ్లి. వచ్చే వారం కార్తీక మాసం మొదలైన వెంటనే, పెళ్లి పనులు కూడా మొదలుపెట్టబోతున్నారు.

సంగీత దర్శకుడు కాలభైరవ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ మ్యూజిక్ డైరక్టర్, ఇప్పుడామె మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. రీసెంట్ గా పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు.

ఓవైపు పెళ్లి పనులు నడుస్తుంటే, మరోవైపు కావ్య కల్యాణ్ రామ్ బ్యాచిలర్ పార్టీలతో బిజీ అయింది. తన క్లోజ్ సర్కిల్ కు ఆమె వరుసగా పార్టీలిస్తోంది. త్వరలోనే కాలభైరవ కూడా తన క్లోజ్ ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వబోతున్నాడు.

ఇక హీరో తేజ సజ్జా కూడా పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే అతడి నిశ్చితార్థం. ఐటీ రంగానికి చెందిన ఓ కుటుంబంతో తేజ సజ్జా కుటుంబం సంబంధం కలుపుకుంది. తన ఎంగేజ్ మెంట్ కు రావాల్సిందిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం కూడా అందించాడు తాజా.

వచ్చేనెలలో ఉదయ్ పూర్ లో తేజ సజ్జా వివాహం జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటుచేశారు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. మొత్తమ్మీద సాయిదుర్గతేజ్, తేజ సజ్జా, కాలభైరవ, కావ్య కల్యాణ్ రామ్.. రోజుల గ్యాప్ లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అటు కోలీవుడ్ కు సంబంధించి అనిరుధ్, ఈనెల 11వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు.

One Reply to “టాలీవుడ్ కు మరోసారి పెళ్లి కళ”

Comments are closed.