నిన్నట్నుంచి సురేఖ వాణి వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ కుర్రాడితో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియోల్ని చాలామంది సర్కులేట్ చేస్తున్నారు. వీటిపై సురేఖ వాణి హెచ్చరికలు జారీ చేశారు.
“నా వీడియోలపై సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు రాసుకుంటున్నారు. నేను చాలా మనోవేదనకు గురయ్యాను. వాటిని మీకుగా మీరు డిలీట్ చేస్తే అందరికీ మంచిది. దీనికి సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.”
ఇలా వీడియో రిలీజ్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు సురేఖ వాణి. ఇకపై ఎవరైనా తన అనుమతి లేకుండా తన వీడియోల్ని ఇలా పబ్లిష్ చేస్తే, వాళ్లపై లీగల్‌గా క్రిమినల్ చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
ఈ వీడియో కంటే ముందు ఆమె ఓ పోస్టు పెట్టారు. తన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ అయిందని, వ్యక్తిగత సమాచారం/వీడియోలు లీక్ అయ్యాయని ప్రకటించారు. కొంతమంది తన ప్రైవేట్ కంటెంట్‌ను దురుద్దేశంగా వైరల్ చేస్తున్నారని, ఒకరి వ్యక్తిగత జీవితంలో ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేశారు.
తన ప్రైవేటు వీడియోల్ని సర్కులేట్ చేస్తున్న ఎకౌంట్ల వివరాలు సేకరించానని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ తర్వాత వీడియో కూడా పెట్టి హెచ్చరించారు. ఈ హెచ్చరికలతోనైనా ఆమె ప్రైవేటు వీడియోల వ్యాప్తి ఆగుతుందేమో చూడాలి.

🙂 most channels covered it seems. Merry for public sad for her..