పులివెందుల‌లో వైసీపీదే ఘ‌న విజ‌యం

మున్సిపాలిటీతో పాటు ఇవాళ నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీకి 55,495 ఓట్లు వ‌చ్చిన‌ట్టు అవినాష్‌రెడ్డి తెలిపారు.

పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీ స‌భ్యుల‌తో నామినేష‌న్లు వేయ‌నివ్వ‌క‌పోవ‌డం, అలాగే ఎన్నిక‌ల్లో దౌర్జ‌న్యాల మొద‌లు.. ప‌రిష‌త్‌లోనూ టీడీపీ ఎన్నెన్నో అరాచ‌కాల‌కు పాల్ప‌డింది.

ఈ అరాచ‌కాల‌కు పోలీస్ యంత్రాంగం త‌న వంతు సాయం చేసింది. ఇన్ని చేసిన‌ప్ప‌టికీ, చివ‌రికి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కంటే వైసీపీకే మెజార్టీ వ‌చ్చిన‌ట్టు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు.

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయ‌న్నారు. వీటిలో రెండింటిలో వైసీపీ, మ‌రో రెండింటిలో టీడీపీ గెలుపొందింద‌న్నారు. కానీ అంతిమ విజ‌యం వైసీపీదే అని ఆయ‌న గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు.

2021లో కుప్పంలో ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌రిగి టీడీపీ ప‌రాజయంపాలైంద‌ని అవినాష్‌రెడ్డి అన్నారు. దాన్ని మ‌న‌సులో పెట్టుకుని చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌చ్చాక అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి, పోలీస్ వ్య‌వ‌స్థ‌ను వాడి, ఎస్ఈసీని త‌ప్పుదోవ ప‌ట్టించి ఎన్నిక‌ల్ని అభాసుపాలు చేశార‌న్నారు.

ఈ ఎన్నిక‌లకు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు జెడ్పీటీసీ ఫ‌లితాల్లో రెండింటిలో త‌మ పార్టీ గెలిచింద‌న్నారు. లింగాల మండ‌లంలో 33 పోలింగ్ కేంద్రాల‌కు గాను దాదాపు 14 చోట్ల రిగ్గింగ్‌కు పాల్ప‌డ్డార‌న్నారు.

వీటిలో 8 వేల నుంచి 9 వేల ఓట్లను గుద్దుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కేవ‌లం 1500 ఓట్ల మెజార్టీతో లింగాల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ గెలిచిందని అవినాష్‌రెడ్డి తెలిపారు.

పులివెందుల మండ‌లంలో ఉండేదే 15 బూత్‌ల‌న్నారు. వీటిలో 8 కేంద్రాల్లో పూర్తిగానూ, ఒక చోట పాక్షికంగా రిగ్గింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. ఆ మండ‌లంలో 1300 పైచిలుకు ఓట్ల‌తో గెలిచార‌న్నారు.

వేముల మండలంలో 38 బూత్‌లు ఉండ‌గా, 6 చోట్ల …ముఖ్యంగా మండ‌ల కేంద్ర‌మైన వేముల‌లో రిగ్గింగ్ చేశార‌న్నారు. ఇక్క‌డ వైసీపీ 1569 ఓట్ల మెజార్టీతో గెలిచింద‌న్నారు.

వేంప‌ల్లెలో పూర్తిస్థాయిలో స్వేచ్ఛ‌గా ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్నారు. ఏ ర‌కంగా ఫ‌లితం వుంటుందో వైసీపీ నిరూపించింద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు ఏ ర‌కంగా వైసీపీ వెంట ఉన్నారో… వేంప‌ల్లె జెడ్పీటీసీ విజ‌యం చెబుతుంద‌న్నారు.

వేంప‌ల్లెలో వైసీపీ 19,192 ఓట్ల ఆధిక్య‌త‌తో వైసీపీ విజ‌యం సాధించింద‌ని అవినాష్ గొప్ప‌గా చెప్పారు. జ‌గ‌న్‌, వైసీపీపై ప్ర‌జాభిమానాన్ని చాటి చెప్పార‌న్నారు.

టీడీపీ ఎన్నెన్నో దారుణాలు చేసినా, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కంటే వైసీపీ 3,873 ఓట్ల మెజార్టీని సాధించింద‌న్నారు. మున్సిపాలిటీతో పాటు ఇవాళ నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీకి 55,495 ఓట్లు వ‌చ్చిన‌ట్టు అవినాష్‌రెడ్డి తెలిపారు.

ఇవే స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌కు క‌లిపితే 51,622 ఓట్లు వ‌చ్చాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇన్ని అరాచ‌కాల త‌ర్వాత కూడా వైసీపీకే ఆధిక్య‌త ల‌భించింద‌ని అవినాష్‌రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది త‌మ కార్య‌క‌ర్త‌ల విజ‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.

12 Replies to “పులివెందుల‌లో వైసీపీదే ఘ‌న విజ‌యం”

  1. కుప్పం లో అన్ని కొట్టమము పోటీ చేసి ఇక్కడ టీడీపీ సాధించలేక పోయంది అది జగన్ బ్రాండ్ ఇప్పుడు కుప్పం కూడా వైస్సార్సీపీ గెలుస్తుంది వచ్చే జనరల్ ఎలక్టియిన్ లో వైస్సార్సీపీ 

  2. ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిగ్గింగ్ చేసిన కూడా వైస్సార్సీపీ గెలుస్తున్నాయి అంటే వచ్చే జనరల్ ఎలక్షన్ లో కూటమి మళ్ళీ సూపర్ సిక్స్ తో పోటీ పడుతుంది 

  3. ఇప్పుడు కూటమి సమస్యాత్మక నియోజక వర్గాలలో మంచి పోలీస్ అధికారులను నియమించాలి సీసీటీవీ కెమెరాలను ఎక్కువగా వాడి నేరస్తులపై నిఘా పెంచాలి నెక్స్ట్ ఎలక్షన్ లలో దౌర్జన్యం గ ఓట్లు వేసుకోకుండా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అప్పుడు 2029 లో కూటమి తేలిగ్గా గెలవగలుగుతుంది

  4. అవును….నాలుగు లోకసభ స్థానాలు గెలిచినా… ప్రధాని గా అంతిమ విజయం మనదే

Comments are closed.