వరుస అవకాశాల వెనక అసలు రహస్యం

శ్రీలీలకు ఈ మోడల్ కూడా ఎక్కువ రోజులు వర్కవుట్ కాకపోవచ్చు. పరిశ్రమలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.

తెలుగులో తారాజువ్వలా దూసుకొచ్చింది శ్రీలీల. వరుసపెట్టి సినిమాలు చేసింది. రోజుకు 3 కాల్షీట్లు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇటు మేకర్స్ కూడా ఆమెకు అవకాశాలివ్వడానికి ఎగబడ్డారు.

సాలిడ్ హిట్ పడినట్టయితే, ఆమె హవా అలానే కొనసాగి ఉండేది. మరిన్ని సినిమాలు, చేతినిండా పని దక్కేది. కానీ అలా జరగలేదు. వరుస ఫ్లాపులతో టాలీవుడ్‌లో శ్రీలీల దూకుడుకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆమె పరభాషల వైపు షిప్ట్ అయింది.

ఆశ్చర్యంగా హిందీ, తమిళ్ నుంచి కూడా ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాట అజిత్, రజనీకాంత్ లాంటి స్టార్స్ సినిమాల్లో ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి. ఏంటీ మేజిక్? ఈ అవకాశాల వెనక రహస్యం ఏంటి?

ఇందులో ఎలాంటి రహస్యం లేదు. ఆమె తన పారితోషికాన్ని అమాంతం తగ్గించింది. మొన్నటివరకు తెలుగులో ఆమె రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది. సోషల్ మీడియాలో బాగా నలిగే ఓ నిర్మాత, ఆమె పారితోషికాన్ని అమాంతం 50శాతం పెంచేశాడు.

అయితే ఇప్పుడీ మొత్తంలో సగం రేటుకే ఆమె తమిళ్‌లో సినిమాలు చేస్తోందంట. అందుకే ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా బాలీవుడ్‌లో మాత్రం కాస్త ఎక్కువే పుచ్చుకుంటోందంట శ్రీలీల.

అయితే శ్రీలీలకు ఈ మోడల్ కూడా ఎక్కువ రోజులు వర్కవుట్ కాకపోవచ్చు. పరిశ్రమలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. హిట్ కొట్టిన హీరోయిన్‌కే క్రేజ్. సక్సెస్ లేకపోతే పారితోషికం ఎంత తగ్గించినా ప్రయోజనం ఉండదు.

5 Replies to “వరుస అవకాశాల వెనక అసలు రహస్యం”

  1. Endhuko gani ee ammayi meeda adu-sthuntaru.

    we need to focus on our state,state development etc.

    The only thing GA knows is Accu-sations on ruling party.

    CRY-BABY SYN-DROME.

Comments are closed.