ఒక కేసులో ఆయన్ను జైలుకు పంపారు. అక్కడి నుంచే జెడ్పీటీసీ సభ్యత్వానికి నామినేషన్ వేశారు. ఇవాళ్టి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనత వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికే దక్కింది. 1997లో జైల్లో నుంచే నామినేషన్ వేసి, ఎంపీగా గెలుపొందిన జార్జిఫెర్నాండేజ్ ఉదంతాన్ని వైసీపీ నేత విజయం గుర్తు చేస్తోంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి స్వగ్రామం. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక, ఆయనపై కేసు పెట్టి నెలల తరబడి నెల్లూరు జైల్లో ఉంచారు. బెయిల్‌పై బయటికొచ్చాక, మళ్లీ టీడీపీ నేతలు వెంటాడారు.
నెలక్రితం ఆయన భూములపై వివాదానికి సంబంధించి చిల్లకూరులో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ గొడవ సృష్టించేందుకు కొంత మంది టీడీపీ రౌడీమూకలు వెళ్లారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే కామిరెడ్డిపై అక్రమంగా హత్యకేసు నమోదు చేసి జైలుకు పంపినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో వుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరపున ఆయన నామినేషన్ వేశారు. ఆయన తరపు కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. ఇవాళ్టి కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి ఎస్.చైతన్యకృష్ణారెడ్డిపై సత్యనారాయణరెడ్డి 1700 మెజార్టీతో గెలుపొంది శభాష్ అనిపించుకున్నారు.
అసెంబ్లీ రౌడీ సినిమాలో ఇదే రీతిలో జైల్లో నుంచి చట్టసభకు ఎన్నిక కావడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా సత్యనారాయణరెడ్డి గెలుపు కూడా సినిమాను తలపించేలా వుందనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

ja*** గాడికన్నా వీడే బెటర్, ఆ క్రిమినల్ వెధవ జైల్ లో ఉన్నప్పుడు తల్లీ షెల్లీ దిక్కు అన్నాడు బైటకి వచ్చి వాళ్ళనే కోర్ట్ కి లాగాడు శుంఠ, ఇంకెప్పుడైనా అక్కా షెల్లెమ్మలు అన్నాడంట ముడ్డి మీద తంతారు ప్రజలు !!
ja*** గాడికన్నా వీడే బెటర్, ఆ *క్రిమినల్ వెధవ జైల్ లో ఉన్నప్పుడు తల్లీ షెల్లీ దిక్కు అన్నాడు బైటకి వచ్చి వాళ్ళనే కోర్ట్ కి లాగాడు శుంఠ, ఇంకెప్పుడైనా అక్కా షెల్లెమ్మలు అన్నాడంట ము*డ్డి మీద *తంతారు ప్రజలు !!
ja*** గాడికన్నా వీడే బెటర్, ఆ *క్రిమినల్ వెధవ జైల్ లో ఉన్నప్పుడు తల్లీ*షెల్లీ దిక్కు అన్నాడు బైటకి వచ్చి వాళ్ళనే *కోర్ట్ కి లాగాడు శుంఠ, ఇంకెప్పుడైనా అక్కాషెల్లెమ్మలు అన్నాడంటే ము*డ్డి మీద *తంతారు ప్రజలు !!
ja*** గాడికన్నా వీడే బెటర్, ఆ *క్రిమినల్ వెధవ *జైల్ లో ఉన్నప్పుడు తల్లీ*షెల్లీ దిక్కు అన్నాడు బైటకి వచ్చి వాళ్ళనే *కోర్ట్ కి లాగాడు శుంఠ, ఇంకెప్పుడైనా అక్కాషెల్లెమ్మలు అన్నాడంటే ము*డ్డి మీద *తంతారు ప్రజలు !!