ఫ్లాప్ సినిమా వంద రోజులాడింది

ఈ కాలం, హిట్ సినిమాలే వంద రోజులాడవు. కానీ ఈ ఫ్లాప్ సినిమా వంద రోజులెలా? దీనికి కారణం కృష్ణ ఫ్యానిజం

ఈకాలం సినిమా హిట్టయితే 2 వారాలు. ఫ్లాప్ అయితే మొదటి వారాంతం. ఏ సినిమా స్పాన్ అయినా ఇంతే. కల్ట్ అనిపించుకున్న సినిమా రన్, అటుఇటుగా 3 వారాలంతే.

కానీ శ్రీనివాస మంగాపురం అనే ఫ్లాప్ సినిమా మాత్రం వంద రోజులాడింది. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ కాలం, హిట్ సినిమాలే వంద రోజులాడవు. కానీ ఈ ఫ్లాప్ సినిమా వంద రోజులెలా? దీనికి కారణం కృష్ణ ఫ్యానిజం.

చిలకలూరి పేట.. రామకృష్ణా థియేటర్.. జై కృష్ణ ఘట్టమనేని నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ఈ ఘనత సాధించింది. ఇది సినిమా సాధించిన ఘనత అనేకంటే, కృష్ణ అభిమానులు ఆ కుటుంబానికి అందించిన బహుమానంగా చెప్పుకోవచ్చు.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు నటించిన తొలి సినిమా ఇది. సెంటిమెంట్ గా ఒక్క థియేటర్లోనైనా వంద రోజులు ఆడించాలని కృష్ణ అభిమానులు ఫిక్స్ అయ్యారు. దాని ఫలితమే ఈ రికార్డు.

కృష్ణ నటించిన ఎన్నో సినిమాలు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయి. ఇక మహేష్ నటించిన సినిమాలు కూడా వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు జరుపుతున్నాయి.

ఆ సెంటిమెంట్ ను, ఘనతకు జై కృష్ణకు కూడా కట్టబెట్టేందుకు, ఇలా దగ్గరుండి వంద రోజులు ఆడించారు. రేపు మహేష్ కొడుకు సినిమా వచ్చినా ఇలానే ఆడిస్తారు, అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఈ సినిమా సూపర్ హిట్టని వాళ్లు క్లయిమ్ చేయట్లేదు. వసూళ్లలో రికార్డు సృష్టించిందని కూడా చెప్పట్లేదు. కేవలం కృష్ణపై ఉన్న అభిమానాన్ని వాళ్లు ఇలా చూపించారంతే.

13 Replies to “ఫ్లాప్ సినిమా వంద రోజులాడింది”

  1. కృష్ణ గారికి పేటలో మాత్రమే అభిమానులు ఉన్నారా? మిగతా ఊర్లలో అభిమానులు లేరా? 

  2. OTT లో ఫ్రీ గా చూడ్డానికే ఎవ్వరూ సాహసించట్లేదు.. ఇక ఫ్యాన్స్ అయినా డబ్బులు బొక్కెట్టుకుని థియేటర్ కి వెళ్ళి చూసుంటారు అంటావా?

    ఫ్యాన్స్ పేరుతో కృష్ణ కుటుంబమే థియేటర్ రెంట్లు కట్టి నడిపారా?

    1. నందమూరి తారక రామ రావు  కన్న హీరో కృష్ణ కు fans associations – అభిమానులు చాలా ఎక్కువ.

Comments are closed.