కూటమికి అధికార బరువు.. యాంటీ ఇంకెంబెన్సీ పెంచుతుందా ?

ఎపుడైనా ఎక్కడైనా అతి ఉంటే అది ఇబ్బందికరమే. అందుకే పెద్దలు అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు.

ఎపుడైనా ఎక్కడైనా అతి ఉంటే అది ఇబ్బందికరమే. అందుకే పెద్దలు అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. నిండుగా నీళ్ళు గ్లాస్ లో ఉంటే ఒలికిపోతుంది. లేదా గ్లాస్ జారిపోతుంది. సగం దాటి ఉంటే సులువుగా పట్టుకోవచ్చు. తాగేందుకు ఈజీ అవుతుంది. ఇక ప్రజాస్వామ్య సూత్రం కూడా అలాగే నిర్మించబడింది.

రెండు చక్రాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి అధికార పక్షం అయితే రెండు ప్రతిపక్షం. బండికి రెండు చక్రాలు సమానంగా ఉన్నప్పుడే సాఫీగా సాగుతుంది. ఒకటి ఎత్తు అయితే ఆ బండి కదలక ఇబ్బంది పడుతుంది. ఈ సూత్రం ఇందులో సూక్ష్మం బాగా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి గత తరాల రాజకీయం చక్కగా పండింది.

ఉమ్మడి ఏపీలో తీసుకుంటే కాంగ్రెస్ తిరుగులేని పార్టీగా ఉండేది. కానీ వామపక్షాలు కూడా బలంగా ఉంటూ విపక్ష పాత్ర పోషించాయి. అప్పట్లో వై నాట్ అన్న మాటే లేదు. వారినీ గెలవనీయాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్న పెద్దరికమైన విధానం ఉండేది.

తలుపులు మూసేసుకున్నట్లే :

విపక్షం లేని రాజకీయం అంటే కిటికీలు తలుపులు లేని ఇంటిని నిర్మించుకున్నట్లే. బయట ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. లోపల నుంచి ఆలోచిస్తే అంతా బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక అధికారం మత్తు ఎటూ ఉంటుంది.

తాము చేసినవి అన్నీ కరెక్ట్ గానే తోస్తాయి. ఈ మత్తు దిగేందుకే మధ్యలో ఉప ఎన్నికలు అనీ స్థానిక ఎన్నికలు అని వస్తూంటాయి. అపుడు ప్రజల నాడిని పట్టుకుని ఒకవేళ సీట్లు తగ్గినా ఓట్లు తగ్గినా సమీక్ష నిజాయతీగా చేసుకునే చాన్స్ ఉంటుంది. కానీ గత కొన్ని దశాబ్దలా నుంచి చూస్తే రాజకీయం పూర్తిగా మారిపోయింది.

అన్నీ తమకే దక్కాలని అంతటా తామే ఏలాలని ఒక రాజకీయ అత్యాశ మొదలైంది. దాని వల్ల అధికారం తోడు కావడం వల్ల సీట్లూ ఓట్లూ దండీగా రావచ్చేమో కానీ తరువాత ఎన్నికల్లో మాత్రం పరాజయం కచ్చితంగా పలకరిస్తుంది అన్నది కూడా తేలిపోయిన సత్యం అంటున్నారు.

వార్డు నుంచి పార్లమెంట్ దాకా :

ఇప్పుడు ఏపీలో చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ కూటమి బరిలోకి దిగింది. అలాగే మునిసిపల్ పోరులో ఫలితాలు సాధించింది. వైసీపీ ఎక్కడా లేకుండా పోయింది. పరిషత్తు ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేస్తోంది.

ఇక పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పేరుకు పార్టీ ముద్ర లేదు కానీ అక్కడ రాజకీయ వాసనలు ఎక్కువగానే ఉంటాయి. ఇక గెలిచిన వారు అంతా తమవారే అన్న అతి పెద్ద కండువా ఎపుడూ సిద్ధంగానే ఉంటుంది. దాంతో పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా కూటమి వారే ఉంటారు.

ఇది క్యాడర్ కి పొత్తు పార్టీలకు అధికారంలో వాటా ఇవ్వడం వరకూ బాగానే ఉన్నా జనాలకు మాత్రం కూటమే కనిపిస్తుంది. దాంతో వారు సమస్యల పరిష్కారం కోసం ఆ వైపే చూస్తారు.

తీవ్ర అసంతృప్తిగా :

తమ సమస్యలు పరిష్కారం చోట అది మెల్లగా మొదలై తీవ్ర అసంతృప్తిగా మారుతుంది. ఎందుకంటే అన్ని చోట్లా ఒక్కటే కూటమి కనిపిస్తుంది. అధికార పార్టీలే కళ్ల ముందు ఉంటాయి. దాంతో జనాలకు కూడా ఇదేంటి అన్న భావన మొదలైతే అపుడు అది బూమరాంగ్ అయి సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి భారీ మార్పు కోరుకునే దిశగా పరిణామం చెందుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేలలో పలువురు పార్టీ కట్టు తప్పుతున్నారు అని అవినీతి అని అక్రమాలు అని విమర్శలు ఉన్నాయి. ఇపుడు గ్రౌండ్ లెవెల్ దాకా అధికార విస్తరణ మారితే అది వార్డు మెంబర్ దాకా పాకితే అక్కడ నుంచి కూడా ఈ కట్టు దాటి పోయిన వారు హెచ్చు సంఖ్యలో తేలితే అపుడు చెడ్డ పేరు వారికే రాదు, ఏకంగా కూటమికి కూడా అంటుకుంటుంది అని అంటున్నారు.

టాప్ టూ బాటం ఒకేలా :

పై స్థాయిలో ఎంత బాగా పనిచేసినా గ్రౌండ్ లెవెల్ లో కనుక పదవులలో ఉన్న వారు చేసే తప్పులు ఎపుడూ తిప్పలు పెడుతూనే ఉంటాయని అంటున్నారు. ఆ గుడ్ విల్ గుడ్ గవర్నెన్స్ అన్నది టాప్ టూ బాటం ఒకేలా ఉంచాలనుకోవడం కూడా అసాధ్యమైనది.

వైసీపీ 2021లో ఇలాగే అన్ని ఎన్నికలనూ గెలిచేసి జెండా ఎగరేసింది. తీరా అదే లెవెల్ లో అసంతృప్తి కూడా జనంలో పెచ్చుమీరి ఫలితం 2024లో ఫల్టీ కొట్టింది. అందువల్ల పదవులు అందుకోవడం కాదు, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా కూటమి పార్టీలు గమనించి మంచి పాలన క్షేత్ర స్థాయి నుంచి అందించే ప్రయత్నం చేయాలి. లేకపోతే అధికారం బరువు మోయలేని పెను భారమే అవుతుంది అని అంటున్నారు.

21 Replies to “కూటమికి అధికార బరువు.. యాంటీ ఇంకెంబెన్సీ పెంచుతుందా ?”

  1. ఈ నీతులలో కనీసం సగం అన్న చెప్పిన ప్రతి పక్ష హోదా దక్కేదేమో….నీకు ఇచ్చిన పేమెంట్ కి కొంచం విలువ ఉండేది

  2. నీ ఉద్దేశం ఏంటంటే next అన్న 175 గెలిచేసి రికార్డు బ్రేక్ చేస్తాడని. సోది news ఆపి వాస్తవాలు తెలుసుకో.

  3. టీడీపీ కీ సవాలు బలపడకుండా జనసేన ని బలపడేలా చేస్తున్నారు పవన్ కీ వెళ్లిన ఓటు అంత టీడీపీ దే వైస్సార్సీపీ ది  కాదు మనమే దగ్గిర ఉంది జనసేన ని బలంగా చేస్తున్నాం 

  4. ఒకప్పుడు 151 సీట్లు గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించిన ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఇంతటి దయనీయ స్థితికి దిగజార్చిన ఘనత ముమ్మాటికీ జగన మోహన అహంకార రాజకీయానికే దక్కుతుంది. నాయకుడి అహంకారం, చేతకానితనం, BJP తో చీకటి ర0కు,   క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించలేని బేలతనం & సోమరితనం కలిసి పార్టీని ఈరోజు ఉనికి కోసం పాకులాడే దుస్థితికి తెచ్చాయి. ఇప్పటికైనా భ్రమల్లో నుండీ బైటపడి తాను చేసిన  తప్పిదాలను ఆత్మపరిశీలన చేసుకోకపోతే.. రాబోయే రోజుల్లో పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ఒక పార్టీ సర్వనాశనానికి దాని అధినేత చేతకానితనమే ఎలా కారణమవుతుందో చెప్పడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే సజీవ సాక్ష్యం.

  5. ఒకప్పుడు తిరుగులేని మెజార్టీ సాధించిన ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఇంతటి దయనీయ స్థితికి దిగజార్చిన ఘనత ముమ్మాటికీ జగన మోహన అహంకార రాజకీయానికే దక్కుతుంది. నాయకుడి అహంకారం, అభద్రతా భావం, క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించలేని బేలతనం, సోమరితనం కలిసి పార్టీని ఈరోజు ఉనికి కోసం పాకులాడే దుస్థితికి తెచ్చాయి. ఇప్పటికైనా భ్రమల్లో నుండీ బైటపడి తాను చేసిన చారిత్రాత్మక తప్పిదాలను, పక్కనబెట్టి ఆత్మపరిశీలన చేసుకోకపోతే.. రాబోయే రోజుల్లో పంచాయతీ, జెడ్పీటీసీ సమరాల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ఒక పార్టీ సర్వనాశనానికి దాని అధినేత చేతకానితనమే ఎలా కారణమవుతుందో చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే సజీవ సాక్ష్యం.

  6. 11మోహన “అధికార పూజ”కు పనికిరాని పువ్వు .. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి లాంటి యువకుడిని అల్లుడిగా చేసుకుని పార్టీని అప్పగిస్తే తప్ప అధికారంమీద హోప్స్ పెట్టుకోలేం నీలిఫ్రెండ్స్.. మీరేమంటారు?

  7. పేపంచంలోనే అత్యంత ప్రజాదరణ, అతి నిజాయితీ, అతి మంచితనం, విశ్వసనీయత కలిగిన నాయకుడు

    “ప్యాలెస్ మోహన”..సొంత ఊర్లో shirt మడతేసి నిలబడి, కలబడి కొట్లాడి, నడిరోడ్డు మీద మోకాళ్ళువొంచి వొంగుని పిట్టితే స్టేట్ మొత్తం re-sound వచ్చింది.

    కానీ నాయకుడు మాత్రం ఓటేయ్యకుండా సొంత పిన్నిని ఓడించాడు

    ఇదీ విజయం (నైతిక)అంటే.. 

  8. ఫ్యాన్ పార్టీకి విజయాల కంటే నైతిక విజయాలే విలువైనవి దానికి ఓ రేంజ్ ఉంటది. సో ఇకముందు కూడా నైతిక విజయాల కోసమే మా పోరాటం ఉంటుంది. 

  9. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదు, పథకాలు ఇవ్వడం లేదు.మా  మోహన చేసిన అభివృద్ధి చోరీ చేస్తూ డప్పు కొట్టుకుంటోంది.. అందుకే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది.

    అది ఈ స్థానిక ఎన్నికల్లో కనపడింది.

    So మావోడు జస్ట్ ఇంకోమూడేళ్ళు కళ్ళు& గుద్దా మూసుకుని పడుకున్నా అధికారం ప్యాలెస్ వెతుక్కుంటూ వస్తుంది..2029లో 2.0రప్పా రప్పా గ్యారంటీ అందుకే మేము రప్పా రప్పా ఎలా చేయాలో ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ చేశాం..

    unLimited Seats, last date తర్వాత

    రేట్ 11టైమ్స్ పెరుగుతుంది.

    ఆలసించిన ఆశాభంగం, త్వరగా సీట్లు బుక్ చేసుకోండి..

  10. 2029 లో బహుశా టీడీపీ జనసేన సెపరేట్ గ పోటీ చేయొచ్చు వైసీపీ కనుమరుగు అయిపోతుంది విడిగా పోటీచేసే లాగైతే 25 ఎంపీ లకు మాత్రం కలిపి చేయాలి దానితో కేంద్రం లో ఎవరు వున్నా అదుపులో పెట్టవచ్చు

  11. నీ ఇంట్లో..నీ ఊళ్ళో నీకు ఓట్లు విదిల్చే వాళ్ళే లేరు..ఇక ప్రతి పక్షం ఎక్కడ?

  12. సపిగా జరిగిన ప్రతి చోట వైస్సార్సీపీ గెలిచింది కుప్పంలో 2 జడ్పీటీసీ లో టీడీపీ వెనుకంజ అని వాళ్ళని బయటికి పంపి టీడీపీ డిక్లేర్ చేసుకుంది 

Comments are closed.