హోంమంత్రి అనిత ఓటు వేసిన చోట వైసీపీ గెలుపు

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఎంపీటీసీ ప‌రిధిలో వైసీపీ అభ్య‌ర్థి గొడుగుల బంగార్రాజు గెలుపొందారు.

హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఎంపీటీసీ ప‌రిధిలో వైసీపీ అభ్య‌ర్థి గొడుగుల బంగార్రాజు గెలుపొందారు.

పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి అనిత ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు కేబినెట్‌లో హోంమంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

అన‌కాప‌ల్లి జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని న‌క్క‌ప‌ల్లి -2 ప‌రిధిలో ఆమె ఓటు హ‌క్కు క‌లిగి ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో భాగంగా ఈ నెల 5న న‌క్క‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లోని 209వ పోలింగ్‌బూత్‌లో క్యూలో నిలిచి మ‌రీ అనిత ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఇవాళ ఓట్ల లెక్కింపులో భాగంగా న‌క్క‌ప‌ల్లి-1, న‌క్క‌ప‌ల్లి-2 ఎంపీటీసీల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ రెండు చోట్ల వైసీపీ అభ్య‌ర్థులు తుమ్మ క‌ల్ప‌న‌, గొడుగుల బంగార్రాజు గెలుపొంద‌డంపై ఆ పార్టీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో, అది కూడా త‌న ప‌రిధిలోని ఎంపీటీసీ ప‌రిధిలో వైసీపీ గెల‌వ‌డం వంగ‌ల‌పూడికి గ‌ట్టి షాక్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆమె పూర్తిగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు.

రాష్ట్రంలో అనేక హింసాయుత సంఘ‌ట‌న‌లు జ‌రిగినా, హోంమంత్రిగా ఇంత వ‌ర‌కూ ఆమె స్పందించిన దాఖ‌లాలు లేవు. ఇప్పుడు వైసీపీ గెలుపుతో అనిత చుట్టూ రాజ‌కీయ చ‌ర్చకు తెర‌లేచింది. ఇంకా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డెక్క‌డ ఏఏ పార్టీలు గెలిచాయో వివ‌రాలు రావాల్సి వుంది.

13 Replies to “హోంమంత్రి అనిత ఓటు వేసిన చోట వైసీపీ గెలుపు”

  1. అదేంది రా గూట్లే…ఎన్నిక జరిగినప్పుడు పచ్చ గుండాలు అని పిచ్చా వాగుడు వాగి…..ఇప్పుడు షాక్ అంటావ్

  2. ప్రజాస్వామ్యం వర్ధిల్లింది అంటావ్ . స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పు. అలాగే ఈవిడ గారి మేకప్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది.

  3. జగన్ తెలివిగా ఓటు వేయకుండా తప్పించుకున్నాడు.. అక్కడ వైసీపీ ఓడిపోయింది… పైగా జగన్ మాజీ ముఖ్యమంత్రి కూడా 😄

  4. మీరు ఇలా రాస్తే, వైసీపీ నాయకుల లెక్కలన్నీ చెప్తారు. అంతే కానీ,  అసలు ఉక్కు పిడికిలి నుంచి ఎలా కొన్ని సీట్లు జారిపోయాయా అనే బాధ ఉంది లోపల.

Comments are closed.