మూవీ రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్

కంటెంట్ పరంగా ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిన అంశాలు పెద్దగా లేకపోయినా, సెకండాఫులో కామెడీని యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణ… డామినేట్ చేయడం వల్ల సినిమా వేగం దెబ్బతింది.

సినిమా: కామ్రేడ్ కళ్యాణ్
రేటింగ్: 2.5/5
బ్యానర్: స్కంద వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్
తారాగణం: శ్రీవిష్ణు, మహిమా నంబియార్, సత్య, సుదర్శన్, రాధికా శరత్‌ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్, శాంతి శ్రీనివాస్, సునయన, బుల్లిరాజు, సాయిచంద్, శత్రు తదితరులు.
రచయితలు: భాను భోగవరపు, నందు సవిరిగాన
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి
దర్శకత్వం: జనకిరామ్ మరెళ్ల
విడుదల తేదీ: అక్టోబర్ 9, 2026

శ్రీవిష్ణు సినిమాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే అంచనా ఉంటుంది. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్‌తో ఈ ఏడాది తన మూడో సినిమాను తీసుకొచ్చారు. సీరియస్ అంశాన్ని కామెడీగా చూపిస్తూ, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందనే అంచనాలను ట్రైలర్ కలిగించింది. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

కథ ఏంటంటే.. కళ్యాణ్ (శ్రీవిష్ణు) తన ఊరిలో ఓ థియేటర్ ని లీజుకి తీసుకుని నడుపుతుంటాడు. ఎప్పటికైనా ఆ థియేటర్ ని సొంతం చేసుకుని తన తండ్రి పేరు పెట్టాలని అతని కోరిక. అతని తల్లి (రాధిక) ఊళ్లో బాలకృష్ణ ఫ్యాన్ గా అల్లరి చేస్తూ, వాళ్లతో వీళ్లతో గొడవ పడుతూ కొడుక్కి తలనొప్పిగా తయారవుతుంది. ఆ ఊరికి కొత్తగా ఓ ఒరియా కుటుంబం (మురలిధర్ గౌడ్- శాంతి శ్రీనివాస్- మహిమా నంబియార్) వస్తుంది. ఆ కుటుంబంలోని కూతురు సితార (మహిమా నంబియార్)ను చూసి కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే, సితార కుటుంబం బిస్వాస్ (ఉపేంద్ర లిమాయే)కు రూ. 5 లక్షలు అప్పు పడిందని తెలుసుకున్న కళ్యాణ్, వాళ్లను ఆ అప్పు నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుంటాడు.

నెల రోజుల్లోనే అప్పు తీర్చేస్తానని మాట ఇస్తాడు. మరి అంత డబ్బు ఎలా సంపాదించాలి? అని ఆలోచించి ఓ ప్లాన్ వేస్తాడు. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే నక్సలైట్ల కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకం ద్వారా డబ్బులు పొందొచ్చని భావిస్తాడు. అందుకోసం తాను కూడా ఓ నక్సలైట్‌లా నటించి పోలీసుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకుంటాడు.

మరి కళ్యాణ్ వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? నిజంగానే నక్సలైట్‌లా నటిస్తూ అడవిలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? అసలు కామ్రేడ్ కళ్యాణ్‌గా మారిన అతని ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? అదే ఈ చిత్ర కథంతా!

కథగా తీసుకుంటే కొత్త పాయింటే. హీరోయిన్ కుటుంబ సమస్యని తీర్చడానికి, లేని మరో సమస్యని మీదేసుకునే కథానాయకుడు.. అది సింగిల్ పాయింట్. అయితే దీనిని నడపడానికి 1994 నాటి నక్సల్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం పెద్ద చాలెంజ్.

ఎందుకంటే నక్సలిజం అనేది భావోద్వేగభరితమైన, హింసతో కూడిన సీరియస్ ఎలిమెంట్. ఆ నేపథ్యంలో కామెడీ నడపడమంటే కత్తి అంచు మీద నడిచినట్టే. అయితే ఆ చాలెంజ్ ని కష్టపడి తీసుకున్నారో, ఇష్టపడే రాసుకున్నారో కానీ రచనాబృందం వరకు కృతకృత్యులయ్యారు.

సాంకేతిక అంశాలు చూస్తే ఓపెనింగ్ లో వచ్చే నక్సలిజం పాట, ఆ తర్వాత ఒరియా పిల్ల ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఓకే. అయితే సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే వినోదాన్ని పంచడంలో కొంత తడబడింది. కొన్ని చోట్ల కథనం కూడా అంత లోతుగా అనిపించదు. సినిమా నిడివి సుమారు 145 నిమిషాలే అయినా, ముఖ్యంగా సెకండాఫ్‌లో కామెడీ కంటే సీరియస్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమా చాలా ఎక్కువ నిడివి ఉన్నట్టుగా అనిపిస్తుంది.

నందు, భాను రాసిన డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా సెటైరికల్ డైలాగులు బాగా పేలాయి. కొన్ని డైలాగులు, సన్నివేశాలు చూస్తుంటే ఆచార్య, పెద్ది, ది ప్యారడైజ్ సినిమా లు గుర్తొస్తాయి. సత్య కామెడీ, శ్రీవిష్ణు నటన, డైలాగులు, కామెడీతో పాటు ఓ సందేశాన్ని చెప్పాలనుకున్న విధానం సినిమాకు ప్రధాన బలాలు.

చిన్నపాటి వింటేజ్ నాస్టాల్జియా ఫీల్ తో మొదలుపెట్టి, క్రమంగా సినిమాని లైటర్ గా నడుపుతూ అలనాటి అల్లరి నరేష్ కామెడీ సినిమాల టైమింగ్ ని పోలినట్టుగా సాగింది కథనమంతా. అక్కడక్కడా డైలాగ్ పంచులు, నవ్వించే మొమెంట్స్ తో ఇంటర్వెల్ వరకు బాగానే సాగిపోయింది.

అయితే, అక్కడక్కడా వచ్చే ఈ కామెడీ సీన్లు సెకండాఫ్‌లో ఉన్న లోపాలను కప్పిపుచ్చలేకపోయాయి.

సినిమా సెకండాఫ్‌లోకి వెళ్లాక, నక్సలైట్ సిద్ధాంతాలను, ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని బ్యాలెన్స్ చేయడానికి శ్రీవిష్ణు ప్రయత్నించే ఎపిసోడ్ చాలా సేపు సాగుతూ సాగదీసినట్టుగా అనిపిస్తుంది.

ముఖ్యంగా ఉపేంద్ర లిమాయే ట్రాక్‌లో ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యింది. సడన్‌గా ఎంట్రీ ఇచ్చే శ్రీకాంత్ అయ్యంగర్, వెన్నెల కిషోర్ పాత్రలు, మంత్రి కిడ్నాప్ ఎపిసోడ్.. ఇవన్నీ కలిసి సినిమా చూస్తున్నప్పుడు కలిగే మూడ్ ను సైడ్ ట్రాక్ పట్టించాయి.

ఓ దశకు వచ్చాక సినిమా రిపీటెడ్‌గా అనిపిస్తుంది. కథను ముందుకు తీసుకెళ్లేలా కొత్త సన్నివేశాలు రాసుకోకుండా, రచయితలు మళ్లీ మళ్లీ అవే తరహా కామెడీ సీన్లను నమ్ముకున్నారు. దీంతో కథలో వేగం తగ్గిపోతుంది. కామెడీ కంటే సెంటిమెంట్, ప్రతీకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, చివరికి ఓ సందేశాత్మక ముగింపుతో సినిమా పూర్తవుతుంది.

శ్రీవిష్ణు మరోసారి తనదైన స్టైల్‌లో బాగా చేసాడు. తన కామిక్ టైమింగ్ బాగుంది. పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించాడు. అటు కామెడీని పండిస్తూనే, కథలో ఉన్న నక్సలైట్ సిద్ధాంతాలకు కూడా న్యాయం చేసేలా తన నటనతో మెప్పించాడు.

సత్య ఫస్టాఫ్‌లో బాగానే నవ్వించాడు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన వ్యక్తిగా అతడి పాత్ర బాగా కుదిరింది. తనదైన కామెడీ టైమింగ్‌తో చాలా సన్నివేశాలను నిలబెట్టాడు. ముఖ్యంగా ఇంగ్లీషులో లెటర్ రాసే సీన్ హైలైట్. ఈ సినిమాకు సత్య కామెడీ ప్రధాన బలాల్లో ఒకటిగా నిలుస్తుంది.

మహిమా నంబియార్ పాత్రకు పెద్దగా నటించే అవకాశం లేకపోయినా, తన పరిధి మేరకు బాగానే చేసింది. షైన్ టామ్ చాకో, సాయిచంద్ తమ పాత్రలకు సరిగ్గా సరిపోయారు.

సుదర్శన్, రఘుబాబు కూడా చిన్నవే అయినా తమ పాత్రలను చక్కగా పోషించారు. అయితే ఉపేంద్ర లిమాయే మాత్రం గతంలో చేసిన తరహా పాత్రనే మళ్లీ చేసినట్టుగా అనిపిస్తాడు.. కొద్దిగా విసిగిస్తాడు.

శ్రీవిష్ణు తల్లిగా రాధికా శరత్‌కుమార్, పోలీస్ ఆఫీసర్‌గా బ్రహ్మాజీ తమ పాత్రలకు న్యాయం చేశారు. శత్రు పాత్ర కూడా కథకు బాగానే ఉపయోగపడింది. ఆ పాత్రకు సంబంధించిన అసలు విషయం బయటపడే సన్నివేశం కూడా అర్థవంతంగా ఉంది.

ఇలాంటి కామెడీ సినిమాలకు ముఖ్యంగా సెకండాఫ్ చాలా కీలకం. ఫస్టాఫ్‌లో ఉన్న నవ్వులను సెకండాఫ్‌లో కూడా కొనసాగించడమే కాకుండా, వీలైతే అంతకంటే ఎక్కువ వినోదాన్ని అందించాలి. అంతేగానీ, మధ్యలో సీరియస్ అంశాలు, సెంటిమెంట్‌ను కలిపి కామెడీ ఫ్లోను తగ్గించకూడదు. కామ్రేడ్ కళ్యాణ్ విషయంలో ఇదే ప్రధాన సమస్యగా కనిపిస్తుంది.

కంటెంట్ పరంగా ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిన అంశాలు పెద్దగా లేకపోయినా, సెకండాఫులో కామెడీని యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణ… డామినేట్ చేయడం వల్ల సినిమా వేగం దెబ్బతింది. దీంతో ప్రేక్షకులకు కామెడీ సినిమా చూస్తున్నామన్న అనుభూతి ఆశించిన స్థాయిలో ఉండదు. మొత్తమ్మీద ఈ “కామ్రేడ్ కళ్యాణ్” చూసి “లాల్ సలాం” అని గట్టిగా పై శ్రుతిలో అరవలేం కానీ, అనకుండా మాత్రం ఉండలేం. అందుకే మధ్య స్థాయిలో “లాల్ సలాం”.

బాటం లైన్: లాల్ సలాం

21 Replies to “మూవీ రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్”

    1. గత 10 ఏళ్ల లో నువ్వు థియేటర్ లో చూసిన మూవీస్ ఏమైనా ఉంటే చెప్పు 

  1. ఆ ఆరోగంట్ vd ని లేపే బదులు ఇతన్ని లేపు GA. నైస్ అండ్ టాలెంటెడ్ యాక్టర్.. 

  2. Ila unnaventi nuvvu…anni movies stories, suspense cheppesthe adhi review na? Asalu minimum kooda burraleda? Neeku money isthe okala lekapothe okalavrasthava? Monna nani paradise ki ilane anni main scene lu anni cheppesav…nuvvu chalu tollywood sankanaki povadanki.

  3. ఈ మధ్య వచ్చిన కొన్ని కాకులు, పందులు, కోసుకొని, నరుక్కొనే చిత్రాల కన్నా ఇలాంటివి చాలా మంచివి.

  4. సినిమా లో బాలకృష్ణ ఫాన్ గా -ఆచార్య, పెద్ది మీద సటైర్ లు.. బాగుందన్నా  నిజం గా బాగుంది మూవీ టెంప్లెట్ .

    కమ్మని సటైర్ లు తప్ప అన్నీ వేస్తాడు, పారడైస్, రాజసాబ్.. అదే మేజిక్ ఊఉ.

    1. గజ్జి కి ఏదన్నా వాడండి సర్, లేకపోతే ఎవరో ఒకరు ము’డ్డి’ తంతే చె’డ్డి’ జారి న’డ్డి’ విరుగుతుంది చూసుకోండి !!

    2. గజ్జి కి ఏదన్నా వాడండి సర్, లేకపోతే ఎవరో ఒకరు ము’డ్డి’ తంతే చె’డ్డి’ జారి న’డ్డి’ విరుగుతుంది 

  5. ఇంతకీ కొందరు ‘అలిపిరి ‘ బ్లాస్ట్ కి కారణం అనే ఎఱ్ఱ జండా కామ్రేడ్ లని బాగా చూపించాడా తప్పు కాదని మరి😂? యీ కమ్మని కధ లో.

Comments are closed.