15 వేలు.. రకరకాల కామెంట్లు

నలుగురు గుడ్డి వాళ్లు.. ఏనుగు అన్న కథలా వుంది. అమరావతికి కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల వ్యవహారం. అప్పు అని కొందరు. సాయం అని మరి కొందరు. భాజ‌పా జ‌నాలు కూడా సరిగ్గా…

నలుగురు గుడ్డి వాళ్లు.. ఏనుగు అన్న కథలా వుంది. అమరావతికి కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల వ్యవహారం. అప్పు అని కొందరు. సాయం అని మరి కొందరు. భాజ‌పా జ‌నాలు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. పురంధేశ్వ‌రి వగైరా తమకు తోచినది చెప్పేసారు తప్ప కరెక్ట్ కాదని వారికీ తెలుసు.

చివరికి కేంద్ర మంత్రి సీతారామన్ సైతం ఎలా చెప్పారు అంటే మళ్లీ మరింత అయోమయానికి గురయ్యేలా. ప్రస్తుతానికి అప్పు ఇప్పిస్తున్నాం.. చూద్దాం తరువాత ఏం జ‌రుగుతుందో. తీర్చగలరో, తీర్చలేరో అప్పుడు చూద్దాం అనే టైపులో చెప్పారు.

మొత్తానికి అప్పు అనే క్లారిటీని తెలుగుదేశం హార్డ్ కోర్ మద్దతు పత్రిక కూడా చెప్పింది. అయితే ఇప్పుడు తీర్చక్కరలేదు 30 ఏళ్ల తరువాత తీర్చాలి. పైగా వడ్డీ కారు చౌక అంటూ వివరించింది. అంటే మొత్తానికి రాష్ట్రానికి ఇచ్చిన గ్రాంట్ అంటూ ఏమీ లేదు ఈ బడ్జెట్ లో అని అర్ధం అయింది.

బీహార్ కు దాదాపు 60 వేల కోట్లకు పైగా నిధులు నేరుగా ప్రకటించారు. కానీ మనకు మాత్రం అప్పు ఇప్పించడం తప్ప వేరు లేదు. కానీ ఇదే ఘనం అంటూ మీడియా వేనోళ్ల టముకేసారు. తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడే విమర్శిస్తే అసలు రావాల్సిన అప్పులు ముందు ముందు అస్సలు రావు కదా.

అమరావతికి నిధులు అవసరమా?

అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ రాజ‌ధాని అని మొదట్లో చంద్రబాబు చెప్పారు. అపార్ట్ మెంట్లు, విల్లాలు కట్టడానికి బిల్డర్లు వాడే భూ సేకరణ మోడల్ ను రాజ‌ధానికి వాడారు చంద్రబాబు. అదో గొప్ప విజ‌న్ అన్నారు. సదరు భూములతోనే వనరులు సమీకరించి రాజ‌ధానిని నిర్మిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు వేల కోట్లు కావాలంటున్నారు. అదో చిత్రమైన సంగతి.

ఈ పదిహేను వేల కోట్లతో అమరావతిలో శాశ్వతమైన సెక్రటేరియట్ వగైరా భవనాలు చంద్రబాబు నిర్మిస్తారో లేక వేరే విధంగా వాడతారో చూడాలి.

20 Replies to “15 వేలు.. రకరకాల కామెంట్లు”

  1. అంతేలే GA….. అదే మన GOVT వున్నప్పుడు ఐతే అసలు ఇలాంటి డిస్కషన్స్ యే వుండేవి కాదు….ఇప్పుడు చూడు funds, development అని రకరకాల తలనెప్పులు…..very bad కదా GA…😂😂

  2. Development is happening and your stomach is burning ra GA. Get some eno. loan or not, they are getting money for development. That is all thanks to the fevicol bond created by our God Pawan sir. Thanks kootami and thanks Pawan sir. You are the future CM.

  3. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి

  4. 11 నెంబర్ గురించి కూడా ఒక ఆర్టికల్ వదులు. 15వేల కోట్లు చాలా గొప్ప మాటే, జగన్ ఐదు సంవత్సరాలలో ఏమి తెచ్చాడో రాసి అపుడు చెప్పు ఈ 15వేల కోట్లగురించి

    1. Despite not being in an alliance with the BJP, Jagan Mohan Reddy’s government secured significant funds from the central government. He completed numerous unfinished projects and resolved issues like the Polavaram project, which had been stalled due to Bolli’s failure to submit the necessary bills to the center. This mismanagement was brought to light by Comptroller and Auditor General of India. This highlighted the severe financial mismanagement left by Bolli when he exited power in 2019.

      Check facts don’t post concocted stories which are far from reality.

  5. Criticism boomeranged, This CBN and PK criticized jagan for his wasting money and would make AP into Argentina , Sri Lanka, now both of them zip their mouths and were hibernating, no one knows where they are hiding and don’t know what to do

  6. 15000 కోట్ల గురించి మనకు అర్థం కావాలంటే మన పక్క రాష్ట్రాలు దీని గురించి ఏమి అనుకుంటున్నారో వింటే క్లియర్ గా తెలుస్తుంది !! they are really jealous about special provision for AP & Bihar in the budget, that itself speaks volumes about it !!

      1. ఒరేయ్ రెడ్డిగా , business models లాంటి పెద్ద పెద్ద మాటలు మనకెందుకులే గానీ – you don’t have a clue whatsoever!! ముందు మీ వోడ్ని శవాల గురుంచి వెతకటం ఆపేసి అసెంబ్లీ కి వెళ్లమని !! వెదవ వెళ్లి ఢిల్లీ లో దాక్కున్నాడు , వాడ్ని ముందు బడ్జెట్ మీద కామెంట్ చేసి ఏడవమని చెప్పరా రేయ్ !!

      2. అది అప్పు అని నీకు ఎవరు చెప్పారురా ?? ముందు మీముం-డ-ని బడ్జెట్ మీద కామెంట్ చేసి ఏడ్వమను!!

  7. కాంగ్రెస్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంచవర్ష ప్రణాళిక అంటు ఉండేది..ఇదీ అంతే.. తెదేపా మళ్ళి అధికారం లోకివస్తే రాజధాని మెల్లిగా అవ్వుద్ది..

Comments are closed.