ఏపీ @బిహార్ !

రాయ‌చోటిలో వైసీపీ కార్యాల‌యానికి నిప్పు పెట్టారు. ఆ కార్యాల‌యం వెలుప‌ల ఉన్న వాహ‌నాల‌కు కూడా మంట పెట్టారు.

చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌లో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయి. ఏ స్థాయిలో అంటే .. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను బిహార్ అరాచ‌కాల‌తో పోల్చుకునేంత‌.

ఇలాంటి దుస్థితిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చూస్తామ‌ని క‌ల‌లో కూడా ఎవ‌రూ ఊహించి వుండ‌రు. ఏవైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని ప్ర‌జానీకం కోరుకుంటారో, దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇవాళ వాటినే క‌ళ్లారా చూస్తూ, తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పుణ్యమా అని టీడీపీ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింద‌ని అనేక మంది విశ్లేష‌కులు అంటున్నారు.

నిత్యం శాంతి జపం, నీతి సూక్తులు వ‌ల్లించే పాల‌కులు… నేటి దుష్ప‌రిణామాల‌పై క‌నీసం నోరెత్తుతున్న పాపాన పోలేదు.

ఒక‌వైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో దారుణాల‌కు ఒడిగ‌డుతూ, మ‌రోవైపు వైసీపీని గొడ్డ‌లి పార్టీ అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శించ‌డం విడ్డూరంగా వుంది.

ఇవాళ ఉద‌యం నుంచి శ్రీకాళ‌హ‌స్తిలో దారుణానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. స‌చివాల‌య ఉద్యోగిపై శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి స‌తీమ‌ణి రిషితారెడ్డి డ్రైవ‌ర్ పే…ద్ద రాయిని విసిరాడు. దీంతో ప్ర‌భుత్వ ఉద్యోగి త‌ల‌కు తీవ్ర గాయ‌మై, కుప్ప‌కూలాడు.

ఇలాంటివి ఈ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు లెక్క‌లేన‌న్ని. ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త కల్పించాల్సిన పోలీసులే, అరాచ‌క శక్తుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌డాన్ని చూస్తే, అస‌లు ఈ రాష్ట్రాన్ని ఎక్క‌డి తీసుకెళ్తున్నార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది.

నామినేష‌న్లు వేయ‌డానికి భ‌ద్ర‌త క‌ల్పించండి మ‌హాప్ర‌భో అని పోలీసుల్ని మ‌హిళ‌లు వేడుకున్న దృశ్యాలు కోకొల్ల‌లు. అబ్బే, పోలీస్ యంత్రాంగానికి మ‌న‌సు క‌ర‌గ‌లేదు.

పాల‌కుల మెప్పు కోసం, స‌మాజాన్ని నిప్పైనా పెడ‌తామని, ఎంత‌టి ముప్పు క‌లిగించ‌డానికి వెనుకాడ‌మ‌నే బ‌రితెగింపు.. బిహార్‌ను కాకుండా, దేన్ని గుర్తు చేస్తుంది.

నిజానికి బిహార్ ఇప్పుడు బావుంది. నితీశ్‌కుమార్ సీఎం అయ్యాక‌, అక్క‌డ శాంతిభ‌ద్ర‌త‌లు బావున్నాయ‌నే మాట వినిపిస్తోంది.

బ‌హుశా రానున్న రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అరాచ‌కాల‌కు ప్ర‌తీకంగా పోల్చి చెప్పుకోడానికి ఎంతో దూరం లేదంటే అతిశ‌యోక్తి కాదు.

ఒక‌ప్పుడు ఎన్నిక‌ల్లో రిగ్గింగ్‌కు పాల్ప‌డ‌డం గురించి విమ‌ర్శిస్తూ మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు ఎన్నిక‌లను ఎదుర్కొనే ఓపిక‌, ధైర్యం కూడా క‌రువ‌య్యాయి. అస‌లు నామినేష‌న్లే వేయ‌నివ్వ‌కూడ‌ని ద‌య‌నీయ ప‌రిస్థితులు రాష్ట్రంలో ఏర్ప‌డ్డాయి.

ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వంద‌లాది మందిని నామినేష‌న్ కేంద్రాల వ‌ద్ద మోహ‌రించి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై య‌థేచ్ఛ‌గా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.

నామినేష‌న్ ప‌త్రాల్ని చింపేస్తున్నారు. వైసీపీ కంచుకోట‌ల్లో కూడా నామినేష‌న్లు వేయ‌నివ్వ‌లేదంటే, ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

పులివెందుల‌లో పోలీసులే టీడీపీ కార్య‌క‌ర్త‌ల పాత్ర పోషించారు. నామినేష‌న్లు వేయ‌కుండా వైసీపీ అభ్య‌ర్థుల్ని పోలీసులే నిలువ‌రించ‌డం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారో పాల‌కులు ఆలోచించుకోవాలి. పైగా గాల్లోకి కాల్పులు, బాష్ప‌వాయువును ప్ర‌యోగించి పోలీసులే ఉద్రిక్త ప‌రిస్థితుల్ని సృష్టించారు.

రాయ‌చోటిలో వైసీపీ కార్యాల‌యానికి నిప్పు పెట్టారు. ఆ కార్యాల‌యం వెలుప‌ల ఉన్న వాహ‌నాల‌కు కూడా మంట పెట్టారు.

పుంగనూరులో స్వ‌యంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి త‌న వాళ్ల‌తో నామినేష‌న్లు వేయించ‌డానికి వెళ్లారు. నామినేష‌న్లు స్వీక‌రించ‌డానికి ఎన్నిక‌ల అధికారే స‌సేమిరా అన‌డం ప్ర‌జాస్వామ్య ప‌త‌నానికి ఇంత‌కంటే రుజువు ఏం కావాలి?

ఇక తిరుప‌తిలో వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి వాసుయాద‌వ్ నామినేష‌న్ వేసేందుకు, ఒక యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింది. ఇలా ఒక చోట మాత్ర‌మే కాదు, రాయ‌ల‌సీమ‌, ప‌ల్నాడు ప్రాంతాల్లో య‌థేచ్ఛ‌గా దౌర్జ‌న్యాలు, దాడులు సాగుతున్నాయి.

ఇవాళ్టి నుంచి ప‌రిష‌త్ ఎన్నిక‌ల నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైంది. అవే దారుణాలు పున‌రావృతం అవుతున్నాయి. అడ్డుకోవాల్సిన ఎన్నిక‌ల సంఘం చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది.

రక్ష‌కులే, భక్ష‌కుల‌య్యారు. ఈ దారుణాల్ని చూస్తూ, ప్ర‌తి హృద‌యం మౌనంతో రోదిస్తోంది. ఇలాగైతే ఈ రాష్ట్రాన్ని కాపాడే వారెవ‌ర‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల్లో నీతి, ప్ర‌జాస్వామ్యం వుంటాయి. చేత‌ల్లో మాత్రం అవేవీ క‌నిపించ‌వు.

అయితే ఈ దుస్థితికి, అవాంఛ‌నీయ ప‌రిణామాల‌కు కార‌ణ‌మైన తాము కూడా భ‌విష్య‌త్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌నే స్పృహ పాల‌కుల్లో ఏ మాత్రం ఉన్నా, బ‌హుశా అరాచ‌కాల‌కు దిగి వుండేవారు కాదేమో!

త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు మ‌రెవ‌రినో బ‌లి పెడుతున్నామ‌ని, ఆ వేడిలో చ‌లి కాచుకుంటూ సేద‌దీరుతున్నామ‌ని సంతోషిస్తూ వుండొచ్చు. కానీ ప్ర‌కృతి మ‌రోలా ఆలోచిస్తుంటుంది.

8 Replies to “ఏపీ @బిహార్ !”

  1. మీ కార్యకర్తల్లో కసి రావాలని, ప్రజల్లో వ్యతిరేకత రావాలని ను రోజుకి ఎన్ని ఆర్టికల్స్ రాసినా ఎంత మొత్తుకున్నా అది జరిగే పని కాదు. ఎందుకంటే  మీ కార్యకర్తలకు తెలుసు ఎందుకు ఇలా జరుగుతుందో? ప్రజలకి తెలుసు అక్కడక్కడ తప్ప ఎన్నికలు అన్న హయాంలో కంటే బెటర్ గానే జరుగుతున్నాయని. ను ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా,ఎంత మేటర్ రాసిన వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ స్పేస్.

  2. పులివెందుల పులి, ఇప్పుడు పిల్లి అయిపోయింది.‌ విజయవాడ రౌడీ మూకలతో కలిసి భవిష్యత్ కార్యాచరణకి ఈ సైకో బుర్రకి పదును పెడతాడు. డాటాకు బుర్ర పెడితే.. అదే ఏఐ అన్నట్టు

  3. ఒరేయ్ జానా బెత్తెడు వార్తను బారకు పెంచి చెప్పిందే అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు రా చంపుతావు?

  4. బీహార్ ని మించి చేస్తున్నారు వీరి పాలన చూసి ఇంకా 20 ఇయర్స్ కూటమి ఓటు వెయ్యాలి అంతే భయం పడే రోజులు తెచ్చారు సూపర్ వైస్సార్సీపీ కష్టాడకుండా సీఎం చేస్తున్నారు 

Comments are closed.