ఎస్ఈసీ, కూట‌మి స‌ర్కార్‌కు తీవ్ర ప‌రాభ‌వం

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టి వ‌ర‌కూ నిర్ణ‌యం తీసుకోలేదు. నిర్ణ‌యం తీసుకునేలా ఎన్నిక‌ల సంఘాన్ని నిల‌దీస్తాం.

ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎస్ఈసీ, అలాగే కూట‌మి ప్ర‌భుత్వానికి తీవ్ర ప‌రాభ‌వం.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చేయ‌కూడ‌ని అరాచ‌కాల‌న్నీ చేసి, చివ‌రికి సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ప్ర‌ధానంగా టీడీపీ చావుదెబ్బ తిన్న‌ది. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో టీడీపీ చేసిన అరాచకాలు ప్ర‌జ‌ల్లో ఆ పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీశాయి.

వైసీపీ హ‌యాంలో ఏక‌గ్రీవాల కోసం ఆ పార్టీ కూడా త‌ప్పులు చేసింద‌న‌డంలో ఎలాంటి అనుమానం లేదు.

కానీ ఇవాళ టీడీపీ అరాచ‌కాల‌తో పోలిస్తే, వైఎస్ జ‌గ‌న్ ఇంత‌లా చేయ‌లేద‌న్న మాట ప్ర‌తి ఒక్క‌రి నోట వినిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీతో పాటు ఇత‌ర ప్ర‌తిప‌క్ష, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌కుండా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఇష్టానుసారం దాడుల‌కు పాల్ప‌డ్డారు. వారికి పోలీసులు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికారు.

పులివెందుల‌తో పాటు మ‌రికొన్ని చోట్ల పోలీసులే అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల మాదిరిగా వైసీపీపై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు.

ఈ ప‌రిస్థితుల్లో వైసీపీకి న్యాయ‌పోరాట‌మే ఏకైక దిక్కు అయ్యింది. హైకోర్టులో సానుకూల తీర్పు రాక‌పోయిన‌ప్ప‌టికీ, నిరుత్సాహ ప‌డ‌కుండా సుప్రీంకోర్టును ఆ పార్టీ ఆశ్ర‌యించింది.

టీడీపీతో పాటు అక్క‌డ‌క్క‌డ జ‌న‌సేన దాడుల్ని సుప్రీంకోర్టు దృష్టికి వైసీపీ తీసుకెళ్లింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌, అలాగే కూట‌మి స‌ర్కార్‌కు తీవ్ర అవ‌మానంగా చెబుతున్నారు.

“ఎన్నిక‌ల వ్య‌వ‌హారాల్లో కోర్టుల చేతులు క‌ట్టేసి ఉన్నాయ‌న్న వాద‌న‌తో మేం ఏకీభ‌వించ‌డం లేదు. అయితే రాజ్యాంగ వ్య‌వ‌స్థ ప్ర‌కారం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘ‌మే నిర్ణ‌యం తీసుకోవాల్సి వుంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించుకోవాలి.

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టి వ‌ర‌కూ నిర్ణ‌యం తీసుకోలేదు. నిర్ణ‌యం తీసుకునేలా ఎన్నిక‌ల సంఘాన్ని నిల‌దీస్తాం.

ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త మాపై వుంది. ఒక్క పోలీస్ కంప్లైంట్ రాలేద‌ని ప్ర‌భుత్వం చెబుతుందంటే …ఎంత దారుణ‌మైన ప‌రిస్థితి వుందో మాకు అర్థ‌మ‌వుతోంది.

హింస జ‌రుగుతుంటే, శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో లేక‌పోతే నామినేష‌న్లు వేయ‌డానికి ఎవ‌రొస్తారు? జిల్లా కేంద్రాల్లోనే నామినేష‌న్లు తీసుకునేలా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించాల‌ని ఎస్ఈసీకి చెబుతాం”

టీడీపీ బ‌రితెగింపున‌కు బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదే. ఎస్ఈసీగా తాము నియ‌మించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా ఉండ‌డంతో అరాచ‌కాల‌ను అడ్డుకునే వాళ్లుండ‌ర‌ని పాల‌క పార్టీలు అనుకున్నాయి.

అందుకే విచ‌క్ష‌ణ మ‌రిచి ఇష్టానుసారం దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఆ దాడులు కాస్త శ్రుతిమించ‌డంతో వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరింది.

అందుకే సుప్రీంకోర్టు క‌ల‌గజేసుకుంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జోక్యం చేసుకోకూడ‌ద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తూనే, ఆ రాజ్యాంగ వ్య‌వ‌స్థ త‌న విధుల్ని మరిచిపోతే, హ‌క్కుల్ని కాపాడేందుకు స‌మీక్షించొచ్చ‌నే సుప్రీంకోర్టు ఆలోచ‌నను ఎంత‌గా ప్ర‌శంసించినా త‌క్కువే. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్ఈసీ, టీడీపీ షాక్‌కు గుర‌య్యాయి.

రాయ‌ల‌సీమ‌, ప‌ల్నాడుల‌లో మొత్తం 19 చోట్ల వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌డానికే అడ్డంకులు సృష్టించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో త‌ప్ప‌నిస‌రిగా నామినేష‌న్లను పోలీస్ భ‌ద్ర‌త మ‌ధ్యే వేయించాల్సిన అనివార్య ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదే పోలీసుల‌ను అడ్డు పెట్టుకుని నామినేష‌న్లను అడ్డుకున్నారు.

దేవునికైనా దెబ్బే గురువ‌నే సామెత చందాన‌, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల‌తో టీడీపీకి దిక్కుతోచ‌డం లేదు. ఇన్ని రోజులు అస‌లు నామినేష‌న్లు వేయ‌డానికే వైసీపీకి అభ్య‌ర్థులు లేరంటూ ప్ర‌చారం చేసిన మీడియాకు, ఇప్పుడీ ప‌రిణామాలు తీవ్ర షాక్‌.

ఒక్క మాట‌లో చెప్పాలంటే అరాచ‌కాల‌కు పాల్ప‌డిన వారికి, మ‌ద్ద‌తు ఇచ్చిన వారికి సుప్రీం తీర్పు చెంప పెట్టు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

7 Replies to “ఎస్ఈసీ, కూట‌మి స‌ర్కార్‌కు తీవ్ర ప‌రాభ‌వం”

  1. హైవోల్టేజ్ యుద్ధం! కేవలం 72 గంటలు, 3 రోజుల కథ – దాచిన ’11’ ఉత్తర్వులు అక్టోబర్ 14న నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లకు 16 నుంచి 18 వరకు మాత్రమే సమయం, పోలింగ్ 28న. అక్కడి నుంచి కథ సినిమాలా మలుపులు తిరిగింది. 16న “హింస!” అంటూ వైఎస్సార్‌సీపీ గగ్గోలు పెట్టింది. 18న గడువు ముగిసింది. హైకోర్టు ఒక్క రోజు పొడిగింపుకు నో చెప్పింది. 19న పార్టీ ఢిల్లీ చేరి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 21న వెకేషన్ బెంచ్ ముందు అసలు డ్రామా మొదలైంది. ఫస్ట్ హాఫ్: “మా అభ్యర్థులను అడ్డుకున్నారు!” వైకాపా తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ తన ఆయుధాలు బయటికి తీశారు: – 63.57% నామినేషన్లు వెయ్యనివ్వలేదు – కార్లు తగలబడుతున్న వీడియోలు, ఎంపీ సిబ్బందిపై దాడి దృశ్యాలు – చించిపారేసిన నామినేషన్ ఫారాలు – తమపైనే 110 మంది పేర్లు + 600 మంది గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఎఫ్ఐఆర్ – ఫారమే చించేస్తే ఆధారాలు ఎక్కడినుంచి తెస్తాం? కోర్టు హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కానీ అప్పుడే ఎదుటి వైపు లేచింది. ఇంటర్వెల్ బ్యాంగ్: “ఆగండి మై లార్డ్స్, వారు మీకు చెప్పని విషయాలున్నాయి!” ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ లేచి, ఒకే వాక్యంతో వేడి పెంచారు: “వీళ్లు కోర్టు ఉత్తర్వులు దాచారు!” ఆయన చెప్పినది: – అదే రోజు వైకాపా మరో సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంది. ఆ విషయం సుప్రీంకోర్టుకు చెప్పలేదు. – ఇలాంటివి 10–12 ఉత్తర్వులు ఉన్నాయి. ’11’ ఉత్తర్వుల సంకలనాన్ని అక్కడికక్కడే ధర్మాసనం ముందు పెట్టారు. – ఇంకా, 16 అక్టోబర్ నాటి రిట్ 30031 ఉత్తర్వులూ అమలయ్యాయన్నారు. – అభ్యర్థులందరికీ పోలీసు రక్షణ ఇచ్చామని, వాళ్లు ఎన్నికల సంఘం వద్దకే రాలేదని అన్నారు. – హైకోర్టు పారాలు 10, 11 చదివి వినిపించారు. సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తుకు హైకోర్టే ఆదేశించింది కదా అని గుర్తు చేశారు. ఆయన చివరి పంచ్: “సృష్టించగలిగే(ఫేక్) మీడియా క్లిప్పులు చూసి ఒక పార్టీ మాట నమ్మితే, మా రాజ్యాంగ అధికారానికి అర్థమేంటి?” క్లైమాక్స్: వీడియోకు వీడియోతోనే జవాబు! ఇక్కడ రంగంలోకి దిగారు ప్రభుత్వ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. “మీరు వీడియో చూపారా? మేమూ చూపుతాం అని ఆయన పుంగనూరు వీడియో ప్లే చేయించారు. వైకాపా వాహనం జనం మీదుగా వెళ్లడం, ఆ తర్వాత జనం ఆగ్రహించడం ఆ క్లిప్‌లో ఉందని చెప్పారు. పోలీసులు వారిని సురక్షితంగా తరలించి కాపాడారన్నారు. ఆయన వాదనలో కీలకమైనవి: – “17, 18 తేదీల్లో ఎక్కడున్నారు?” హైకోర్టు ఉత్తర్వుల్లో “నామినేషన్‌కు పోలీసు సహాయం కావాలి” అని మాత్రమే కోరారు, “అడ్డుకున్నారు” అని ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. – హింసకు కారణం ఆ పార్టీ వారేనన్నారు. పంజాబ్ నుంచి ఆయుధాలతో మనుషులు వచ్చారని వివరించారు. – “చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఇది నిజంగా దారుణం” అంటూ వీడియో చూడమని కోరారు. తీర్పు: వైకాపాకు బ్లాంకెట్ ఊరట లేదు. ఇప్పుడు బంతి ఎన్నికల సంఘం కోర్టులో ఉంది. ఈ రోజు సంఘం తీసుకునే నిర్ణయం చెబుతుంది, ఇది “డ్రామానా, లేక నిజమైన ఆవేదనా” అని. అప్పటివరకు ఈ కథ ఒక్క వాక్యంలో: ప్రజాస్వామ్యంలో వీడియోల కంటే ఆధారాలు బలమైనవి, నినాదాల కంటే నిబంధనలు గొప్పవి!

  2. VYCheePee tho polisthe chala thakkuve ani adikuda kosthandra nundi nellore varaku e alajadi lekunda prasanthamga nominations vesaru kani kontha mandi cheepee gund@@l@ valle ee dusthiti ani mokana ummes1n@@ kaanee s1ggu lekunda bonkuthunna G@ an1 lokam kodai koosthundhi 

  3. సుప్రీంకోర్టు పేరు చెప్పి ఈ GA సొంత పార్టీ సుప్పొర్తెర్స్ నీ మరొకసారి విప్ లను చేస్తున్నడు

    సుప్రీంకోర్టు పంతొమిది మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఫైనల్‌గా ఆర్డర్ ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు, కానీ కోర్టు చెప్పింది ఏంటి?

    ఫిర్యాదులు, ఆధారాలు పరిశీలించి గడువు పెంచాలా వద్దా అనేది ఈసీ నిర్ణయించాలని

    గడువు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంటే నలభై ఎనిమిది గంటల సమయం ఇవ్వాలని చెప్పింది. అంతేగానీ, నువ్వు ప్రచారం చేసుకున్నట్టుగా అన్నిచోట్లా గడువు పెంచేసినట్టు కాదు

    ఇక కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని మీరు అఫిడవిట్ లో అడిగారు కానీ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఈ మేటర్ మీద..

    ఇక్కడ నీ ప్రాపగోండ కోసం కోర్టు తీర్పులకే మీ సొంత భాష్యం చెప్పక GA ,

  4. చచ్చింది గొర్రె😀అన్న తో మామూలు గా వుండదు..ఏదో నాలుగు  గావు కేకలు ఏసి ఇంట్లోకెళ్ళి పండుకుందాం అనుకున్నా o ..ఇప్పుడెలా నిజంగా నామినేషన్ వేయాలే?ఇప్పుడు వేయకపోతే ఏం చెప్పాలే జనాలకి😀

  5. నామినేషన్ వేస్తే.. ఏకగ్రీవాలు తగ్గుతాయి… ఓటమి తప్పదు కదా 

Comments are closed.