బీఆర్ నాయుడి వ్య‌వ‌హారంలో టీడీపీలో చ‌ర్చ ఇదీ!

టీటీడీ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు నుంచే బీఆర్ నాయుడి మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని టీడీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు

ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌న్ని టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పౌర స‌మాజం నుంచి కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే డిమాండ్స్‌కు త‌లొగ్గి బీఆర్ నాయుడిని సీఎం చంద్ర‌బాబు త‌ప్పిస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అయితే టీడీపీలో బీఆర్ నాయుడి వ్య‌వ‌హారంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. కేవ‌లం బీఆర్ నాయుడి నోటి దురుసు, అహంకార వైఖ‌రితోనే స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకున్నార‌నే ఏకాభిప్రాయానికి టీడీపీ నాయ‌కులంతా వ‌చ్చారు. టీటీడీ చైర్మ‌న్‌గా ఎంతో హుందాగా, సంస్కార‌వంతంగా వ్య‌వ‌హ‌రించడానికి బ‌దులు, అహంకార ధోర‌ణితో న‌డుచుకుంటున్నార‌ని టీడీపీలో దాదాపు నాయ‌కులంతా ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

టీటీడీ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు నుంచే బీఆర్ నాయుడి మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని టీడీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. శ్రీ‌వాణి టికెట్ల‌పై క‌నీసం టీటీడీ అధికారుల‌తో సంప్ర‌దించ‌కుండా మీడియాతో త‌న‌కు తోచిన‌ట్టు చెప్ప‌డాన్ని ప‌లువురు ఇప్పుడు తెర‌పైకి తెచ్చారు. టీటీడీలో సేవ చేసి, ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌ని రెండేళ్ల కాలానికి చైర్మ‌న్ ప‌ద‌విని చంద్ర‌బాబు ఇచ్చార‌నే సంగ‌తినే ఆయ‌న మరిచిపోయార‌ని చీవాట్లు పెడుతున్నారు.

అన‌వ‌స‌రంగా రాజ‌కీయ ప్రేలాప‌న‌ల‌తో కోరి స‌మ‌స్య‌లు తెచ్చుకున్నార‌ని అంటున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిని ఏక వచ‌నంతో సంబోధించ‌డాన్ని వైసీపీ నాయ‌కుల‌తో పాటు టీడీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

తిరుమ‌ల‌కు వ‌చ్చి భార‌తిని గుండు తీయించుకోవాల‌ని బీఆర్ నాయుడు నోటికొచ్చిన‌ట్టు మాట్లాడార‌ని చెబుతున్నారు. అలాగే త‌న‌కంటే ముందు ప‌లుమార్లు టీటీడీ చైర్మ‌న్‌గా, బోర్డు స‌భ్యుడిగా సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిని వాడు, వీడు, రాస్కెట్‌, పోరోంబోకు …ఇలా నోటికొచ్చిన‌ట్టు అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేయ‌డంపై టీడీపీ నాయ‌కులు కూడా ఏమంత సంతృప్తిగా లేరు.

ప్ర‌తిష్టాత్మ‌క టీటీడీ చైర్మ‌న్‌గా వుంటూ, బ‌జారు మ‌నుషులు భాష మాట్లాడ్డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం బీఆర్ నాయుడి నోటి దురుసుతోనే స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయ‌ని, అంతిమంగా కూట‌మి స‌ర్కార్‌కు రాజ‌కీయ న‌ష్టం క‌లుగుతోంద‌నే చ‌ర్చ ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.

స‌భ్య‌త‌, సంస్కారం గురించి నిత్యం ఇత‌రుల‌కు నీతులు చెప్పే చంద్ర‌బాబు, లోకేశ్ ఏదో ఒక ద‌శ‌లో జోక్యం చేసుకుని బీఆర్ నాయుడిని క‌ట్ట‌డి చేసి వుంటే, ఇవాళ ప‌రిస్థితి ఇంత వ‌ర‌కూ వ‌చ్చి వుండేది కాద‌న్న చ‌ర్చ టీడీపీలో సాగుతోంది. అందుకే ఇప్పుడు బీఆర్ నాయుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో, ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ నాయ‌కుడు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌లేదు.

49 Replies to “బీఆర్ నాయుడి వ్య‌వ‌హారంలో టీడీపీలో చ‌ర్చ ఇదీ!”

    1. దారుణ వాళ్ళు చేతుల్లో వల్లే చేసుకున్నారు మొదటి రోజు నుంచి ఒక రోజు కూడా జగన్ భజన లేకుండ టీడీపీ వాళ్ళు లేరు 11 వచ్చిన వాడిని పైకి లేపారు ఎక్కడో బెంగుళూరు లో ఉందాల్చిన వాడిని ఆంధ్రప్రదేశ్ లో ఉండేలా చేసారు వాళ్ల గొయ్యే వల్లే తవ్వుకున్నారు 

  1. అది సరే… నాని, వంశీ, రోజా… నోటికి వచ్చినట్టు మాట్లాడినపుడు… అన్నియ వాళ్లకి ప్రమోషన్ ఇచ్చాడు కదా.. అందువల్లే మనకి 11 వచ్చాయి… అన్న విషయం మర్చిపోతే ఎలాగ?

    అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంబటి ముఖ్యమంత్రి ని దుర్బాషలు మాట్లాడినా అన్నియ సిగ్గు లేకుండా సమర్దించాడు కదా 

    వైసీపీ నాయకులు కూడా ఇలాగే అనుకుంటున్నారు అన్నియ గురించి అని టీడీపీ వాళ్లకు సమాచారం వచ్చింది అంట 

      1. నేను context గురించి చెప్పాను.. అది రాజకీయమా కాదా అన్నది కాదు 

    1. ఎప్పుడో దిగిపోయిన అన్నియ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు బొల్లియ ఏం పీకుతున్నాడో చెప్పు చూద్దాం 😂😜🤣

  2. టీటీడీ బెస్ట్ అంటే కరుణాకర్ పేరు చెప్పితారు తిరుమల లో చాలా మంది సిబ్బంది దరిద్రం అంటే BR పేరు చెప్పుతారు అది బాబు కీ నష్టం 

  3. ముందు బాబు గారు దీనికి పరిస్కారం చూడాలి లేదు అంటే గోవిందు మీద  బాబు భక్తి లేదు అని జనాలు అనుకుంటున్నారు 

  4. మా కమ్మ వల్లే బీర్ నాయిడు అంటున్నారు మా కులం కీ మచ్చ తెచ్చాడు స్వామి సేవ లో ఉంది  ఇలా రాజకీయ్యాలు మాట్లాడి  అన్ని రాజకీయనాయకులు నీ కూడా ఒకే రకంగా చూడాలి దేవుడి ముందు ఆలా ఉంటే మానేసి రాజకీయ్యాలు చేసుకో 

    1. తమరు ఆంధ్ర కమ్మ సంఘానికి అధ్యక్షరాలు మరి .. తమరికి వొచ్చి చెప్పుకున్నారు ..

  5. టీడీపీ వాళ్ళు పాపం మన గ్యాస్ ఆంధ్ర కి ఇంటర్వ్యూ ఇచ్చి మరి వాపోయారు …

  6. ఈ GA ఇంగ్లిష్ ఎడిషన్లొ ఎమి ఆర్టికల్ రాసాడొ చూడండి.

    .

    YSRCP makes social media activists, big scapegoats!

  7. నీ బొంద! అక్కడ ఆ మహిళ నా మీద అసబ్యంగా ఫేక్ వీడియొలు తయారు చెసి నెట్లొ పెడుతున్నారు అని బులుగు మీడియా చానళ్ళా మీద ఇవ్వాళ పొలీస్ కంప్లైంట్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి!

    .

    అదె నిజం అయితె భూమన సహా అందరినీ లొపలవెస్తారు ఎమొ?

  8. నీ బొంద! అక్కడ ఆ మహిళ నా మీద అసబ్యంగా ఫేక్ వీడియొలు తయారు చెసి నెట్లొ పెడుతున్నారు అని బులుగు మీడియా చానళ్ళా మీద ఇవ్వాళ పొలీస్ కంప్లైంట్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి!

    .

    అదె నిజం అయితె భూమన సహా అందరినీ లొపలవెస్తారు ఎమొ?

    1. మన దేవుళ్ళని బం డ బూ తు లు తిట్టి, గొ ర్రె మ తం లోకి పోయిన న క్స లై టు అయితే బెటర్ అంటావు?!

  9. అప్పట్లో మన పాస్టర్ ముఠా తిరుమల లో చేసిన  అరాచకాలన్నీ బైట పెడుతుంటే,BR ని ఎలా ఛైర్మెన్ సీట్లో ఉండనిస్తాము? గుండెపోటును గొడ్డలిపోటుగా మార్చి నారాసుర చరిత్ర అంటూ ప్రచారం చేసినట్టు.. ఇక్కడ కూడా ఏదో ఒకటి fabricate చేసి BR నీ గబ్బులేపితే గానీ మనోడు శాంతించడు 

  10. ” లడ్డూ కెమికల్  కల్తీ” ని ప్రజలనుండి డైవర్ట్ చెయ్యడానికి  రోజూ ఎన్నెన్ని పాట్లు పడుతున్నారు రా? ప్రజల్ని ఎర్రోళ్లని చెయ్యొచ్చు కానీ ఆ వెంకటేశ్వర స్వామి నుండి తప్పించుకోగలడా?

  11. Why can’t govt appoint any Guru as a chairman of TTD,

    It is not good to have BR Naidu as TTD chair person…. Even, there are rumours that he is a broker in arranging …… to……..

  12. నిన్న భూమన, BR నాయుడు మీద బాదితురాలు ఎదొ ఉత్తరం చంద్రబాబు కి రాసింది అని ఊదర కొట్టారు! ఇక సాక్షి లొ ఎకంగా ఒక ఫుల్ల్ పెజీ నింపి అమె లెట్టర్ ని కూడా అచ్చువెసారు!

    .

    తీరా చూసె అసలు ఆ వీడియూ, పొటొలలొ ఉన్న అమ్మయి కి ఆ లెట్టర్ లకి సంబందం లెదు అంట! బాదితురాలు అంటూ వెరె ఎవరితొనొ లెట్టెర్ రాయించి, ఆ పొటొ, వీడియొలలొ ఉన్నా అమ్మయె రాసినట్తుగా నిన్న అంతా డప్పు వెసారు! అసలు వాళ్ళ పెర్లు కూడా వేరె అంట!

    .

    ఆ విషయం ఇవాళ స్వయంగా జర్నొలిస్ట్ సాయి నె చెప్పాడు! కావాలి అంటె కింద లిం.-.క్ చూడంది. అలా ఉంటాయి మన బులుగు రాతాలు.

    1. వీడు లిం.-.క్ డె.-.లీ.-.ట్ చెస్తున్నాడు.

      నాయుడు గారు మంచోడు journalist sai అని సే.-.ర్చ్ చెయండి

Comments are closed.