ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పలు సర్వే సంస్థు మభ్యపెడుతున్నట్టుగా తెలుస్తోంది. పాలన అత్యద్భుతంగా వుందని, గతం కంటే ఎక్కువ సీట్లు 2029లో కూటమికి వస్తాయని కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబుకు నివేదికలు ఇస్తున్నట్టు సమాచారం. కానీ కొందరు మాత్రం పాలన గాడి తప్పుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం కూటమికి వ్యతిరేకంగా వుందని చంద్రబాబు చెవిలో వేస్తున్నారు.
అయితే తియ్యటి మాటలే చంద్రబాబుకు వినసొంపుగా వుంటున్నాయి. ప్రభుత్వంపై నెగెటివ్ అనే మాట వినడానికి చంద్రబాబు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెబుతున్న వారిని చంద్రబాబు దూరంగా పెడుతున్నారని కొంత మంది టీడీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీకి ఎన్నికల ముందు నుంచి వ్యూహకర్తలుగా, అలాగే సర్వేలు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తమ ప్రత్యర్థులతో సైతం కూటమి పాలనపై జనం ఆహా, ఓహో అంటున్నారని చెబుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి 11 ఎమ్మెల్యే, నాలుగు లోక్‌సభ సీట్లు వచ్చాయని గుర్తు చేయడంతో పాటు రాబోవు ఎన్నికల్లో ఎలా వుంటుందో ఆ పార్టీ నాయకులతో నేరుగా చెబుతున్నారని తెలిసింది.
2029 ఎన్నికల్లో వైసీపీ 11 నుంచి 8 సీట్లకు పడిపోతుందని ఆ పార్టీ నాయకులతో టీడీపీ వ్యూహకర్తలు చెబుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చంద్రబాబును ఎంతగా మభ్యపెడుతున్నారో అర్థమవుతోందని మనసులో అనుకుంటూ, ఇదే రకంగా ముందుకెళ్లాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. ఎందుకంటే, గతంలో ఇదే రీతిలో తమ నాయకుడు వైఎస్ జగన్‌ను కొందరు సర్వే నిపుణులు భ్రమల్లో ముంచి, వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరించేలా చేశారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడు చంద్రబాబు వద్ద కూడా అదే రకమైన టీమ్ పని చేస్తున్నట్టు అర్థమవుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటి అబద్ధాలు, వాస్తవ విరుద్ధ సర్వే నివేదికలు ఇచ్చే వారికే నాయకుల అండదండలుంటాయని మరోసారి రుజువు అవుతున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఒకవైపు చంద్రబాబు మనసేమో, క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతున్నట్టు నమ్ముతోంది. కానీ అద్భుతం, అమోఘం అని చెప్పేవారి మాటల వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని టీడీపీ సీనియర్లు అంటున్నారు. నిజాలెవరికీ చెవికెక్కవనేందుకు తమ నాయకుడు చంద్రబాబు అతీతం కాదని వారు అంటున్నారు.
ముఖ్యంగా మూడు పార్టీలు కలిసి ఉన్నంత వరకూ, ప్రభుత్వంపై వ్యతిరేకత పని చేయదనే రాంగ్ పీడ్‌బ్యాక్ చంద్రబాబుకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి పరిపాలనపై మాత్రం ఎన్నికలు జరుగుతాయనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. అద్భుతం అని చెప్పే వారి గళాల ముందు, నెగెటివ్ అభిప్రాయం తేలిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని పలువురు అంటున్నారు. కానీ అధికారంలో వుంటే, తియ్యటి మాటల్ని తప్ప, చేదు అంశాల్ని పట్టించుకోరని ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్లు చెబుతున్నారు. ఒకట్రెండుసార్లు పాలనపై వాస్తవాల్ని చెప్పడానికి ప్రయత్నించి, ఆయన ఆగ్రహానికి గురై, ఆ తర్వాత మనకెందుకులే అని నోర్మూసుకుంటున్నట్టు టీడీపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

175/175..21/21 కామెడీ గుర్తుకువస్తే నా తప్పు కాదు
Y Not Zero seats got YCP- YCP followers
25/25 అని , వై నాట్ 175? అని డప్పు కొట్టినప్పుడు అన్న కి చెప్పి ఉంటే…ప్రతిపక్ష హోదా దొరికేది
fakoo fake…
సర్,
2029 లో YSRCP కి ప్రతిపక్షం హూడా రావచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వంపై కొన్ని విషయంలోలు పాజిటివ్, కొన్ని నెగెటివ్ ఉన్నాయి.
తాలికివందం మీద పాజిటివ్ ఉంది అమ్మవాడి స్కీం తో పోల్చితే.
అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యంగా కొన్ని అసహం ఉంది PRC విషయం లో, యువతలో మెగా DSC మీద పాజిటివ్ ఉంది కానీ ఇంకా ఎక్కువ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే జగన్ గారి పాలన చూసిన తర్వాత మళ్ళీ చాన్స్ అంటే న్యూట్రల్, ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం కూడా ఉంది.
ఫేక్ ఫేక్…
సాంబ డెబిట్ చూడు కామెడి కింగ్ ది
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా వైసీపీ ప్రతిపక్ష హోదా కు తగ్గ మార్కులు తెచ్చుకొంటుందో లేదో చూడొచ్చు అందులోను డైరెక్ట్ ఎలక్షన్ లు అంటున్నారు దానికి నువ్వు తెలివిగా అధికార పార్టీ అక్రమాలు చేస్తాడని పలువురు మేధావులు అంటున్నారని ఆర్టికల్ రాయాలి ఎటు సంక నాకిపోతుంది కాబట్టి
నీకు మంచిదేగా, గమ్మునుండు
Reddy
Eesari kooda anna oodipothe ?
Just asking
Odipothe Paristhithi yemiti?
చంద్రబాబు ఓడిపోతే ఏమి అవుతుంది
yemavuthadi?
Rapa Rapa Start avuuthadi
Babu nu bokka lo yesathadu anna
Ee sari lepisina lepeyyochu !!!!
Anna Nrakatam modaledithe yela vuntado choospisthadu !!!!
Mari Anna odipothe?
Rapa Rapa start avuuthadi
Anna narakatam modaledithe yela vuntado choopisthadu
CBN ni bokka lo yestahadu, leda lepesthadu !!!!
Reddy
Ippatinunche start chesava?
Yelagu election time ki anna 150 + ani rasthavu
Ala cheppali..lekapotey chemba paisalu ivvadu
లోకల్ బాడీ లో వైస్సార్సీపీ నామినేషన్ వేసారో కూటమి గల్లంతు దాన్ని జగన్ ఓహో అనుకుంని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం కాబట్టి జగన్ ఓడిపోతే కసితో పని చేస్తాడు
why not 175