వైసీపీపై వ్య‌తిరేక‌త సృష్టే ఏకైక ఎజెండా!

చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌నారీతుల్ని గ‌మ‌నిస్తే, ఒక విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు ప‌లువురు చెబుతున్నారు.

చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌నారీతుల్ని గ‌మ‌నిస్తే, ఒక విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు ప‌లువురు చెబుతున్నారు. వైసీపీపై వ్య‌తిరేక‌త సృష్టే కూట‌మి ప్ర‌భుత్వ ఏకైక ఎజెండాగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇందుకోసం చివ‌రికి టీటీడీని, క‌లియుగ దైవం శ్రీ‌వేంకటేశ్వ‌ర‌స్వామిని మాత్రం వ‌దిలి పెట్ట‌క‌పోవ‌డం ఆశ్య‌ర్యం క‌లిగిస్తోంది. హిందువుల్ని ఆవేద‌నకు గురి చేస్తోంది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యిలో క‌ల్తీ, అలాగే ప‌ర‌కామ‌ణి చోరీ కేసు, మాజీ ఏవీఎస్వో స‌తీశ్‌కుమార్ అనుమానాస్ప‌ద మృతి కూడా రాజ‌కీయ రంగు పులుముకోవ‌డం వెనుక స్వార్థ ప్ర‌యోజ‌నాలున్నాయనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. అలాగే క‌ల్తీ లిక్క‌ర్ త‌యారీలో తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జ‌య‌చంద్రారెడ్డి, అలాగే మ‌రికొంద‌రు ఆ పార్టీ నాయ‌కులు ప‌ట్టుబ‌డినా, దాన్ని వైసీపీ మెడ‌కు చుట్టే ప్ర‌య‌త్నాల్ని చూడొచ్చు.

ఇప్ప‌టికే మాజీ మంత్రి జోగి ర‌మేశ్‌, ఆయ‌న సోద‌రుడిని కూడా క‌ల్తీ లిక్క‌ర్ కేసులో అరెస్ట్ చేసి, నెల్లూరు జైల్లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు జోగి బ్ర‌ద‌ర్స్‌కు ముడుపులు ఇచ్చిన‌ట్టు ప్ర‌ధాన నిందితుడు జ‌నార్ద‌న్‌రావు చెప్పిన‌ట్టు టీడీపీ అనుకూల ప‌త్రిక రాసుకొచ్చింది. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే వైసీపీపై నిత్యం నెగెటివిటీని సృష్టించేందుకు ఒక ప‌థ‌కం ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం, దాని అనుకూల మీడియా కేసులు పెట్ట‌డం, క‌థ‌నాలు రాస్తున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అభివృద్ధి ప‌నుల కంటే వైసీపీపై వ్య‌తిరేక‌త వ‌ల్లే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌చ్చ‌ని ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ ఆలోచ‌న‌ల‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజానిజాల‌తో సంబంధం లేకుండా, ప్ర‌త్య‌ర్థుల్ని ఎలా బ‌ద్నాం చేయాలో వ్యూహాత్మ‌కంగా టీడీపీ అనుకూల మీడియా ప‌క్కా వ్యూహంతో క‌థ‌నాలు రాస్తోంది. అలాగే చానెల్స్‌లో డిబేట్స్ నిర్వ‌హిస్తోందన్న విమ‌ర్శ లేక‌పోలేదు.

మంచి ప‌నులు ప్ర‌జ‌ల్ని పెద్ద‌గా ఆక‌ట్టుకోవ‌నే అభిప్రాయంలో పాల‌కులున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని, ల‌క్ష‌లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌నే ప్ర‌చారం …కేవ‌లం ఒక‌ట్రెండు రోజులు అనుకూల మీడియాలో ప‌తాక శీర్షిక‌లకే ప‌రిమితం అవుతోంద‌న్న భావ‌న పాల‌కుల్లో వుంది.

అందుకే రాష్ట్రంలో ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌న్నింటికీ వైసీపీనే కార‌ణ‌మ‌న్న ముద్ర వేసే ఆలోచ‌న‌తో పాల‌కులు ముందూ, వెనుకా ఆలోచించ‌కుండా, సొంత మీడియాతో దుష్ప్ర‌చారం చేస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. దీన్ని వైసీపీ ఎలా తిప్పికొడుతుందో అని జ‌నం మాట్లాడుకుంటున్నారు. త‌మ‌పై సాగుతున్న విష ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌డంపైనే వైసీపీ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి వుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

12 Replies to “వైసీపీపై వ్య‌తిరేక‌త సృష్టే ఏకైక ఎజెండా!”

  1. Great article Jagan Inocencent .Jagan babayee ne chapende CBN , Kalte nayee  and kaltee liqur kalepende TDP .  GA Sakshi ne menchepitunde adee chadavatamu maa karma

  2. ఎందుకురా మా జగన్ రెడ్డి ని హింసిస్తున్నారు..

    చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి ఫోటో దిగారని.. అర్జెంటు గా కేటీఆర్ తో కలిసి ఫోటో కి ఫోజులిచ్చిన అమాయకుడు రా మా జగన్ రెడ్డి..

    ..

    కోర్ట్ కి వెళ్లడం అంటే .. అదేదో కొత్త పెళ్ళికొడుకు బారాత్ కి వెళ్లడం అనుకొనే సున్నిత మనస్కుడు రా మా జగన్ రెడ్డి..

    ..

    నాలుగు కుక్కలకు ముక్కలు వేసి.. సీఎం సీఎం అని అరిపించుకొంటే.. ఎదో ఒక రాష్ట్రానికి సీఎం అయిపోవచ్చనే తింగరోడు రా మా జగన్ రెడ్డి..

    ..

    దేవుడి లడ్డు లో నెయ్యి బదులు.. ఆర్టిఫిషల్ రసాయనాలతో కొత్త రెసిపీ ప్రయత్నించి.. ఆ దేవుడిని కొత్త రుచులతో ప్రసన్నం చేసుకొందామనే.. పిచ్చి భక్తుడు రా మా జగన్ రెడ్డి..

    ..

    బాబాయ్ రక్తపోటు, గుండెపోటు, గొడ్డలిపోటు అని ఎవరు చెప్పినా.. అది నారాసురరక్తచరిత్రే అని ముందే ఊహించి చెప్పిన.. చిలక జోస్యుడు రా మా జగన్ రెడ్డి..

    ..

    ఎందుకురా అమాయకుడు, సున్నిత మనస్కుడు, పసి కందు లాంటి మా జగన్ రెడ్డి ని.. అన్ని రకాలుగా హింసిస్తున్నారు.. పాపం రా..

  3. ఎందుకురా మా జగన్ రెడ్డి ని హింసిస్తున్నారు..

    చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి ఫోటో దిగారని.. అర్జెంటు గా కేటీఆర్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన అమాయకుడురా .. మా జగన్ రెడ్డి..

    ..

    కోర్టుకి వెళ్ళడం అంటే.. కొత్త పెళ్ళికొడుకు బారాత్ కి వెళ్లడం అనుకొనే పిల్లాడి మనసు రా మా జగన్ రెడ్డి..

    ..

    నాలుగు కుక్కలకు ముక్కలు వేసి.. సీఎం సీఎం అని అరిపించుకొంటే.. ఎదో ఒక రాష్ట్రానికి సీఎం అయిపోవచ్చనే..తింగరోడురా మా జగన్ రెడ్డి..

    ..

    బాబాయ్ ది రక్తపోటు, గుండెపోటు, గొడ్డలి పోటు అని అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ.. నారాసురరక్తచరిత్ర అని అంజనం వేసి చిలక జోస్యం చెప్పిన.. మహా జ్ఞాని రా మా జగన్ రెడ్డి..

    ..

    ఎందుకురా.. ఒక మాహానుభావుడిని అందరూ కలిసి చిత్రవధ చేసి బాధ పెడుతున్నారు..

    ఆ ప్రతిపక్ష హోదా ఎదో ఇచ్చేస్తే.. బొమ్మ కారు తో ఆడుకొనే పిల్లాడిలా మారిపోతాడు కదరా మా జగన్ రెడ్డి.. ఆలోచించండి విజ్ఞులారా..

  4. ఈ గ్రేట్ ఆంధ్ర కి మళ్ళీ నా కామెంట్స్ చదివి మండినట్టుంది..

    అందుకే నా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేసే పనిలో పడ్డాడు..

    ఇది వాడి వెబ్సైటు.. వాడి ఇష్టం.. ఇక నేను కామెంట్స్ రాసి నా టైం వేస్ట్ చేయదలచుకోలేదు.. ఈ వెబ్సైటు కి పెర్మనెంట్ సెలవు..

    నాకు కూడా లైఫ్ ఉంది.. ఈ జగన్ రెడ్డి పైన పోరాటం ఆగదు ..

    ..

    జై తెలుగు దేశం.. జై చంద్ర బాబు.. జై జై లోకేష్..

  5. ///హిందువుల్ని ఆవేద‌నకు గురి చేస్తోంది.///

    .

    హిందువులు ఆవేద‌నకు గురి ఔతుంది మీ లాంటి దుష్టుల వళ్ళ. 

    YV సుబ్బా రెడ్ది, కరునాకర్ రెడ్డి, జగన్ మొహన్ రెడ్డి లాంటి వారి వళ్ళ! 

  6. “రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు”…I wonder who are these people!!!

    undavalli, telakapalli, sai, IVR, Purusthoam cheddi, ranga rajan, Sastry from Vizag, Subramanya Swamy batch?

  7. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా నెలలలోనే .. వ్యతిరేకత వొచ్చేసింది అని తమరు కూడా తమకు కొట్టారు మర్చి పోయారా ?

  8. వ్యతిరేకత సృష్టి కాదు. ఉన్న వ్యతిరేకత ని బయట కి చూపించడం. మామయ్య మీద ఎవరైనా వ్యతిరేకత సృష్టించగలరా

Comments are closed.