వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పట్టు నిలుపుకున్నారు. చంద్రగిరిలో మొత్తం ఆరు జెడ్పీటీసీ స్థానాలుండగా, వాటిలో మూడింటిలో వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యంగా తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన చిన్న కుమారుడు హర్షిత్‌రెడ్డిని గెలిపించుకుని , శభాష్ అనిపించుకున్నారు.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానం నుంచి తన కుమారుని నిలిపి, రాజకీయంగా ప్రత్యర్థులకు చెవిరెడ్డి సవాల్ విసిరారు. దీంతో తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నిక అత్యంత ఉత్కంఠకు దారి తీసింది. ఈ స్థానానికి ప్రత్యేకత వుంది. దాదాపు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తలపిస్తుంది.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ పరిధిలో 1,52,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో 85,335 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ ఎన్నో పన్నాగాలు పన్నింది. వాటన్నింటిని తిప్పికొట్టడంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తయన తనయులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. దొంగ ఓటర్లను ఎలా పట్టుకున్నారో కళ్లకు కట్టేలా వీడియోలు బయటికి వచ్చాయి.
ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే, ఇక్కడి గెలుపు రానున్న రోజుల్లో చంద్రగిరి ఎమ్మెల్యే విజేతెవరో రెండేళ్లు ముందుగానే తేలుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. చెవిరెడ్డి కుమారుడిని ఎలాగైనా ఓడించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డి, కుమారుడు వినీల్ సర్వశక్తులు ఒడ్డారు.
ఈ క్రమంలో 7న జరిగిన కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య సాగింది. అంతిమ విజయం చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిని వరించింది. తన సమీప టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మిపై హర్షిత్‌రెడ్డి 562 ఓట్ల మెజార్టీతో గెలుపొంది, ప్రత్యర్థులను చావు దెబ్బ కొట్టారు. రాజకీయంగా ఇది చెవిరెడ్డికి అతిపెద్ద ప్రోత్సాహం అని చెప్పొచ్చు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెంలలో వైసీపీ విజయ ఢంకా మోగించింది.
చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. గత సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డిపై టీడీపీ నేత పులివర్తి నాని 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అలాంటి నియోజకవర్గంలో రెండున్నరేళ్లలోపే… రాజకీయంగా పరిస్థితి మారడం చర్చనీయాంశమైంది. చంద్రగిరిలో మూడు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ గెలుపొందడం, ఆ నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా ఆ పార్టీకి కొత్త ఊపు తెచ్చింది.

అదేంటి టీడీపీ పోలీస్ లు ఉపయోగించి గెలిచుండలే, ఇది పరదారకంగా జరిగిందా? మనం గెలిచిస్తే కరెక్ట్ ఎదుటివాడు గెలిస్తే అరాచకం…వావ్ great great ఆంధ్ర website
రిగ్గింగ్ చేసి గెలిచాడు అని రాయడం మర్చిపోయావ్ అరికట్లా.. మనోళ్లు గెలిస్తే స్వేచ్ఛగా పోలింగ్ జరిగినట్టు.. ప గో ళ్ళు గెలిస్తే అరాచకాలు, రిగ్గింగ్ చేసి గెలిచినట్టు భలే కథలు అల్లుతావు రా..
500 votes majority. Adhi oka gelupenaa ?
85k+ votes vachhayi.. batuku jeevudaa ani gelichinattu..adi ghanavijayam ani buld up lu
జిల్లా ఏం ఖర్మ..ఈ గెలుపు రాష్ట్రం లో , దేశం లో, ఖండాంతరాలలో పార్టీ కి ఊపు నిచ్చింది…వచ్చే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో విజయం మీద నమ్మకం తో రప్ప రప్ప అంటున్న కార్యకర్తలు అని రాసేయి
పండగ చేస్కో
165 MLA వస్తాయని చెప్పిన సర్వేలు కూడా చంద్రగిరి లో YCP గెలుచుకుంటుంది అని చెప్పారు……. చివరికి 40,000 ఓట్లతో ఊడిపో ఇంది