‘ప‌ల్లె’వించిన వైసీపీ విజ‌యం…!

స్థానిక సంస్థ‌ల ప‌రిష‌త్‌ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ‘ప‌ల్లె’వించింది. ఈ ఫ‌లితాలు 2029 సార్వ‌త్రిక ఎన్నికల్లో అధికారంపై ఆ పార్టీలో ఆశ‌ల్ని చిగురింపుజేశాయి.

స్థానిక సంస్థ‌ల ప‌రిష‌త్‌ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ‘ప‌ల్లె’వించింది. ఈ ఫ‌లితాలు 2029 సార్వ‌త్రిక ఎన్నికల్లో అధికారంపై ఆ పార్టీలో ఆశ‌ల్ని చిగురింపుజేశాయి.

నిజానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై వైసీపీ నాయ‌క‌త్వంలో ఎలాంటి అంచ‌నాలు లేవు. ఈ ఎన్నిక‌లు కేవ‌లం కూట‌మి కోసమే అని వైసీపీ భావిస్తూ వ‌చ్చింది.

అలాగ‌ని అధికారికంగా ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్టుగా ఎక్క‌డా ఆ పార్టీ ప్ర‌క‌టించ‌లేదు. అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై వైసీపీ ఆలోచ‌న వేరే వుంది. దాన్ని అమ‌లు చేయ‌డంలో వైఎస్ జ‌గ‌న్ మొద‌లుకుని, ఆ పార్టీ దిగువ శ్రేణి కార్య‌క‌ర్త వ‌ర‌కూ విజ‌యం సాధించారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ నేతృత్వంలోని కూట‌మి అరాచ‌కాల్ని యావ‌త్ ప్ర‌పంచానికి చూపాల‌ని వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులు గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు.

వైఎస్ జ‌గ‌న్ కోరుకున్న దానికంటే టీడీపీ ప‌దింత‌లు ఎక్కువ‌గానే అరాచ‌కాల‌కు పాల్ప‌డింది. టీడీపీ అరాచ‌కాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి.

విజ‌న‌రీగా, ప్ర‌జాస్వామిక‌వాదిగా ఇంత‌కాలం దేశం గౌర‌విస్తున్న చంద్ర‌బాబు పాల‌న‌లో ఇన్ని దాష్టికాలా? అని జాతీయ‌స్థాయిలో ఏకిపారేయడం చూశాం. ఇదీ వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ సాధించిన విజ‌యం.

కానీ టీడీపీ, ఆ పార్టీని మోస్తున్న మీడియా దృష్టిలో స్థానిక సంస్థ‌ల్లో కూట‌మి సాధించిన విజ‌యాలు వేరే. ప్ర‌స్తుతానికి వ‌స్తే , రెండో విడ‌త‌లో జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.

జెడ్పీటీసీల విష‌యానికి ఏక‌గ్రీవాలు కాకుండా, 582 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో కూట‌మి 473, వైసీపీ 57 స్థానాల్లో విజ‌యం సాధించాయి. ప‌ది శాతం ఫ‌లితాల్ని వైసీపీ ద‌క్కించుకోగ‌లిగింది.

ఎంపీటీసీ స్థానాల విష‌యానికి వెళితే… మొత్తం 9,821 ఉన్నాయి. వీటిలో 2.051 ఏక‌గ్రీవాలయ్యాయి. మిగిలిన‌ 7,767 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో కూట‌మికి 5,819, వైసీపీకి 1,583, ఇత‌రుల‌కు 187 ఎంపీటీసీ స్థానాలు ద‌క్కాయి. వీటిలో వైసీపీ 20 శాతం పైగా స్థానాల్లో విజ‌యం సాధించింది.

అరాచ‌క‌, తీవ్ర ప్ర‌లోభాల‌కు గురి చేసిన ప‌రిస్థితుల్లో, క‌నీస స్థాయిలో కూడా డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌కుండా వైసీపీ సాధించిన విజ‌యాలుగా చూడాలి. అందుకే కూట‌మితో పోల్చితే, వైసీపీకి ద‌క్కింది త‌క్కువే అయిన‌ప్ప‌టికీ, అత్యంత విలువైన‌విగా భావించాలి.

ఈ విజ‌యాలు చాలు… గ్రామీణం మ‌ళ్లీ వైసీపీ వైపు మొగ్గు చూపుతోంద‌ని చెప్ప‌డానికి. ఈ విజ‌యాల విలువ ఎంతో, ఏం చేయ‌బోతున్నాయో ఈ పాటికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ముఖ్య‌మైన మంత్రి నారా లోకేశ్‌కు బాగా తెలిసొచ్చి వుంటుంది.

నిజానికి ఈ స్థాయిలో వైసీపీకి విజ‌యాలు ద‌క్కుతాయ‌ని ఆ పార్టీ పెద్ద‌లెవ‌రూ ఊహించి వుండ‌రు. ఎందుకంటే, ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆలోచ‌న‌లు, అంచ‌నాలు వేరేగా వున్నాయి. ఎంత‌సేపూ వాటిని అమ‌లు చేయ‌డానికే వైసీపీ ఎక్కువ శ్ర‌ద్ధ చూపుతూ వ‌చ్చింది.

అంతేకానీ, పార్టీ విజ‌యం కోసం అభ్య‌ర్థుల‌కు క‌నీస స్థాయిలో అయినా ఆర్థిక సాయం అందించాల‌నే ఆలోచ‌న కూడా లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ ప‌రిష‌త్ ఎన్నికల్లో అద్వితీయ విజ‌యాల్ని సొంతం చేసుకుంది.

ఈ విజ‌య బీజ‌మే, రానున్న రోజుల్లో మొల‌కెత్తి, అధికార‌మ‌నే చెట్టుగా పెర‌గడానికి దోహ‌దం చేస్తుంద‌నే ఆశాభావం వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో మెండుగా క‌నిపిస్తోంది. ఎంత‌టి సుదూర ల‌క్ష్య‌మైనా, మొద‌ట ఒక్క అడుగుతోనే మొద‌లై, ఆ త‌ర్వాత చేరుకుటుంది.

వైసీపీ విజ‌యాల్ని కూడా ఆ కోణంలోనే చూడాల్సి వుంటుంది. వైసీపీకి ప‌ల్లె నిలిచిన అండ‌… అధికారంపై అచంచ‌ల విశ్వాన్ని క‌లిగించిందంటే అతిశ‌యోక్తి కాదు.

10 Replies to “‘ప‌ల్లె’వించిన వైసీపీ విజ‌యం…!”

  1. అయితే 2029 లో వైసీపీ వస్తుంది అధికారంలోకి అంటావ్ 🤣 ప్రతి సారి జాకీలు పెట్టి లేపుతావ్, అక్కడ చూస్తే వైసీపీ కి మొట్టికాయలు వేస్తారు జనాలు. మళ్ళీ కవర్ డ్రైవ్ లు అడతావ్ 

  2. కర్నూల్ అనంతపురం చిత్తూరు విజయనగరం విశాఖపట్నం తూగో పగో లో వైస్సార్సీపీ దెబ్బ కూటమి ఎగిరి పోయంది  కూటమి అధికారం చూపించిన ఏమి లేదు 

  3. టీడీపీ ని పడుకోబెట్టాడు లోకేష్ రెడీ్బుక్ తో వైస్సార్సీపీ ని మేల్కొలిపినాడు ఇంకా కూటమి ఉన్న గెలిచే పరిస్థితి లేదు అందరు ఇక్కడ మెసేజ్ చెయ్యడం తప్ప ఏమి చేయలేము 

  4. 2.8  ఇయర్స్  ఇంత ప్రభుత్వం వ్యతిరేకత నా ఇంకో 2 ఇయర్స్ ఉంటే మళ్ళీ కూడా కూటమి సూపర్ సిక్స్ కీ పరిమితం మా 

Comments are closed.