పులివెందులలో టీడీపీ గూబగుయ్‌మనిపించిందని ఆ పార్టీ మీడియా అత్యుత్సాహంతో రాతలు రాసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంచుకోట పులివెందులలోనే సత్తా చూపగలిగేంత సత్తా టీడీపీకి వుండి వుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి జన్మస్థలిలో ఎందుకు సత్తా చూపలేకపోయిందనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
మున్సిపల్ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా తన కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ … “పులివెందులలో గూబగుయ్‌మనిపిస్తే .. ఆ సౌండ్ రాష్ట్రమంతా మోగాలి” అని పిలుపు ఇచ్చారు.
అయితే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి, ఏకగ్రీవాలు చేసుకున్నారు. రిగ్గింగ్‌తో విజయాల్ని నమోదు చేసుకున్నారు. అదే ప్రజావిజయం అంటూ టీడీపీ, ఆ పార్టీ మీడియా తెగ సంబరపడుతోంది.
పులివెందుల నియోజకవర్గంలో ఏడు ఎంపీపీ పదవుల్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఏడు జెడ్పీటీసీల్లో ఐదింటిని కూటమి దక్కించుకుంది. అతి కష్టం మీద రెండు జెడ్పీటీసీలను మాత్రమే వైసీపీ సొంతం చేసుకుందంటూ… టీడీపీ మీడియా తనను తాను వంచించుకుంటూ కథనాలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ కూడా ఈ రకంగా తన విజయాలపై సంతోషాన్ని వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
పులివెందులలో కూడా వైపీపీకి నామినేషన్లు వేసేంత దయనీయ స్థితికి టీడీపీ నెట్టేయడం నిజమే అనుకుందాం. మరి చంద్రగిరిలో టీడీపీ ఎంత బలంగా వుండాలి? అక్కడ చంద్రబాబు జన్మించారు కదా! చంద్రగిరి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, టీడీపీ సగం మాత్రమే గెలిచింది.
అది కూడా చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం స్థానాల్లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. త్వరలో ఆ మూడింటికి సంబంధించి కీలక ఆదేశాలు వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి గెలుపొందారు. ఇక్కడ 1.50 లక్షల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గం విజయాన్ని శాసించే మండలం ఇది. అలాంటి చోట టీడీపీ బొక్కబోర్లా పడింది. అలాగే ఇన్ని అరాచకాల మధ్య కూడా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది.
ఇక్కడ టీడీపీ పరాజయాల సంగతేంటి? ఎక్కడో వైఎస్ జగన్ మేనత్త ఊరిలో టీడీపీ 20 ఏళ్ల తర్వాత గెలిస్తే, దాన్ని పతాక శీర్షికలతో రాస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత అడ్డాలో టీడీపీని వైసీపీ చావు దెబ్బ తీస్తే మాత్రం, అదేమీ కొత్త విషయం కాదన్నట్టుగా టీడీపీ మీడియా, లోకానికి నిజం తెలియకుండా కప్పెడుతోంది. ముందు ఇంటి గెలిచి, ఆ తర్వాత బయట గెలిచి గొప్పలు చెప్పుకుంటే బావుంటుందని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు.

కుప్పం లో చంద్రబాబు కీ 12 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ లో రూలక్ కానీ అధికారం ఉంది అని డిక్లేర్ చేసుకున్నారు జనరల్ ఎలక్షన్ పక్క వైస్సార్సీపీ కొడుతోంది
avunu ee saari 175/175 pakka..