స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి ఉంటే..!

కూటమి నాయకులు ఈ ఫలితాలను ఎంతగా గొప్పగా చెప్పుకున్నా, అనంతపురం ఫలితం మాత్రం వారిని వెంటాడుతూనే ఉంటుంది.

స్థానిక ఎన్నికలు గతంలో ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి చూసినా.. తాజాగా వచ్చిన ఫలితాలు కూటమికి గట్టి ఝలక్ అనే చెప్పాలి.

కూటమి కుమ్మేసిందంటూ అనుకూల మీడియా ఎంతగా ఊదరగొట్టినా, క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే అసలు కథ వేరేలా కనిపిస్తోంది.

ఇన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, ఇన్ని అడ్డంకులు సృష్టించి, ప్రత్యర్థులను నామినేషన్ల దశ నుంచే నిలువరించే ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాల్లో గెలవడం చిన్న విషయం కాదు.

ఐదేళ్ల కిందట జరిగిన స్థానిక ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సహజంగానే అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రెండంటే రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు జరిగిన స్థాయిలో ఏకగ్రీవాలు, బెదిరింపులు, రిగ్గింగులు, నామినేషన్ పత్రాల లాక్కోవడం, పోలీసులను, ఎన్నికల అధికారులను ప్రేక్షకులుగా మార్చడం వంటి పరిణామాలు అప్పట్లో కనిపించలేదు. అయినా టీడీపీ సాధించిన ఫలితాలు రెండంటే రెండు మున్సిపాలిటీలే!

కట్ చేస్తే.. ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది. పోలీసు వ్యవస్థ, అధికార యంత్రాంగం తమ చేతుల్లో ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అనేక వివాదాలు, అక్రమాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ప్రత్యర్థి అభ్యర్థులను పోటీకి రానివ్వకుండా చేయడం, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణల ఆరోపణలు, పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ దృశ్యాలు.. ఇన్ని జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగైదు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.

అంతేకాదు, అనంతపురం వంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కార్పొరేషన్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది.

ఇది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా పెద్ద షాక్. అనంతపురం లాంటి ప్రాంతంలో కూటమికి అనుకూలమైన వాతావరణం ఉందని భావించినా, అక్కడి ప్రజలు మరో తీర్పు ఇచ్చారు.

ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడి గెలవడం వెనుక స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను తక్కువ అంచనా వేయలేం.

ప్రజల్లో అసంతృప్తి ఉందా? కూటమి పాలనపై వ్యతిరేకత ఉందా? స్థానిక నాయకత్వంపై ఆగ్రహం ఉందా? అనే ప్రశ్నలకు ఈ ఫలితాలు సమాధానాలు చెబుతున్నాయి.

జరిగిన పరిణామాల తీవ్రతను పక్కనపెట్టి, తమకు అనుకూలమైన లెక్కలతో విజయాన్ని సమర్థించుకోవడం అనుకూల మీడియాకు మాత్రమే సాధ్యమవుతుంది.అసలు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒక్కటే.

ఇన్ని అడ్డంకులు, బెదిరింపులు, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఫలితాలు సాధించిందంటే, ఎన్నికలు నిజంగా స్వేచ్ఛగా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?

ప్రత్యర్థి అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం ఇచ్చి ఉంటే? ఎవరినీ బెదిరించకుండా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కల్పించి ఉంటే? ఓటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉంటే? అప్పుడు ఫలితాల లెక్కలు ఎలా ఉండేవి?ఈ ప్రశ్నలే ఇప్పుడు కూటమిని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు.

కూటమి నాయకులు ఈ ఫలితాలను ఎంతగా గొప్పగా చెప్పుకున్నా, అనంతపురం ఫలితం మాత్రం వారిని వెంటాడుతూనే ఉంటుంది.

ఐదేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉండి రెండే రెండు మున్సిపాలిటీలకు పరిమితమైన టీడీపీ, ఇప్పుడు అధికారంలో ఉండి ఇన్ని రాజకీయ అస్త్రాలు ప్రయోగించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిలువరించలేకపోయింది.

అందుకే ఈ ఎన్నికల్లో అసలు చర్చ కూటమి ఎన్ని స్థానాలు గెలిచిందన్నది కాదు. ఇన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్థానాలు ఎలా గెలిచిందన్నదే! ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి ఉంటే ఫలితాలు ఇంకెంత భిన్నంగా ఉండేవో అన్న ప్రశ్నకు మాత్రం కూటమి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు!

7 Replies to “స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి ఉంటే..!”

  1. పాపం…నీ బాధ వర్ణనాతీతం….నిన్న అర్ధరాత్రి కూడా కస్టపడి కవర్ డ్రైవ్…పండగ పూట కూడా ఉదయాన్నే కవర్ డ్రైవ్…పండగ బోనస్ గట్టిగా ఇచ్చాక నీకు మాత్రం తప్పేదేముంది…

  2. ఏది నిజం?

    నువ్వేమో ‘2024లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి 94% సీట్లు ఇచ్చి కూటమిని ఆశీర్వదించి, మనోడిని కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని11తన్ని పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేసారు అని బాధ పడుతున్నావ్ ..

    మరి మానోడేమో ఎన్నికలు సక్రమంగా జరిగుంటే 99% హామీలు అమలు చేసిన నేనే 175/175గెలిచేవాడిని, మోడీ EVMలని టాంపరింగ్ చేసి అక్రమంగా కూటమిని గెలిపించాడు అంటాడు.. ఏది నిజం అరికట్ల ఎంకిటీ? ఇదీ అంతే

  3. సాక్షి పెళ్ళాం& నువ్వూ ఇట్లా తప్పుడు రాతలు రాసి రాసి మావోన్ని తప్పుడు భ్రమల్లో, ఊహాప్రపంచంలో  ఉంచడానికి లోకేష్ దగ్గర లొంగిపోయారని విశ్వసనీయ సమాచారం. నిజమే కదా ఎంకిటీ?

Comments are closed.