జీవీఎంసీలో పెద్ద ఎత్తున రెబెల్స్ రంగంలో ఉన్నారు. వారిని ఓదార్చి, సముదాయించి గెలుపు తీరాలకు కూటమిని చేర్చడం మూడు పార్టీలకు కష్టతరంగా మారుతోంది.
విశాఖలో 120 వార్డులు ఉంటే, వందల్లోనే నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి వార్డులో లెక్కకు మించి నామినేషన్లు వేశారు.
బీఫారాలు తర్వాత ఇస్తామని చెప్పడంతో ఆశావహులంతా మూడు పార్టీలలో పోటీ పడ్డారు. ఈ నెల 21న నామినేషన్ల విత్డ్రా ఉంది.
ఇప్పుడు ఒక్కో వార్డులో కూటమి తరఫున ఒక్కరే అభ్యర్థి ఉండాలని చెబుతున్నారు. దాంతో ఆశావహులు ఎంతమేరకు తగ్గుతారన్నదే టెన్షన్ పెడుతోంది.
తమకే సీటు అని భావించినవారంతా నామినేషన్లు వేశారు. వారిని దారికి తేవడం అంటే అతి పెద్ద కసరత్తుగానే ఉంది. వెనక్కి తగ్గేది లేదని చాలా మంది చెబుతున్నారు. బీఫారం ఇవ్వకపోయినా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారూ ఉన్నారు.
దాంతో ఏం చేయాలో అధినాయకత్వాలకు పాలుపోవడం లేదు. జీవీఎంసీలో మొత్తం 120 వార్డులలో టీడీపీ 77, జనసేన 32, బీజేపీ 11 సీట్లను పొత్తులో భాగంగా సర్దుబాటు చేసుకున్నాయి.
సంఖ్యాపరంగా అసంతృప్తి ఉన్నా, సమయం లేకపోవడం వల్ల సరిపెట్టుకోవాలని మిత్రపార్టీలు చూసినా, తాము చెప్పిన వార్డులలోనే నామినేషన్లు వేయాలని టీడీపీ నాయకులు కోరడంతో వ్యవహారం మొత్తం రివర్స్ అవుతోంది.
తమకు బలం ఉన్న వార్డులలో పోటీ చేస్తామని జనసేన, బీజేపీ నాయకులు అంటున్నారు. దాంతో ఈ విధంగా మరో పీటముడి పడుతోంది. ఎన్నికల ప్రచారానికి సమయం లేదు. సీట్ల తకరారు తేలకపోతే కనుక అంతిమంగా దెబ్బతింటామన్న బెంగ అందరిలో ఉంది.
ఇలా గందరగోళంగా, చివరి దాకా అయోమయంగా పొత్తులు, సీట్లు, వార్డుల ఎంపికలు, పెద్ద ఎత్తున రెబెల్స్ నామినేషన్లు వేయడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కూటమి ఈ వ్యవహారాన్ని ఏ విధంగా కొలిక్కి తెస్తుంది అన్నది అంతా తర్కించుకుంటున్నారు. కూటమిలో సాగుతున్న ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా వైసీపీ ఎంతవరకు మార్చుకుంటుంది అన్నది చూడాలి.

రాష్ట్రం మొత్తం లో సింగిల్ మున్సిపాలిటీ/కార్పొరేషన్/Zpp/Mpp గెలిస్తే అప్పుడు
నో సింగిల్ seat ఫర్ ycp