ముందంజలో వైసీపీ

ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తొలి విడతలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ముందంజలో ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తొలి విడతలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ముందంజలో ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న జీవీఎంసీలో తామే అగ్రభాగాన ఉన్నామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 120 వార్డులలో అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా, విజయదశమి శుభవేళ బీఫారాలను అందించామని, ప్రచారంలోకి కూడా తామే ముందుగా వెళ్లిపోయామని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు చెప్పారు.

ఇది తమ మొదటి విజయం అని ఆయన అన్నారు. తాము అన్ని వార్డులలో సామాజిక సమీకరణలను సరిచూసుకుంటూ, అందరితో చర్చించి, ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా పూర్తి ఆమోదంతో అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు.

కూటమి పార్టీలు ఈ రోజుకీ లిస్ట్ రిలీజ్ చేయలేని స్థితిలో ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వారి మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదని ఆయన విమర్శించారు. సరైన నాయకత్వం లేక అవస్థలు పడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.

తాము రేసులో ముందుంటే, కూటమి నేతలు ఇంకా బీఫారాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థులను బెదిరించడానికి దిగడం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు.

ప్రజాస్వామ్యయుతంగా పోటీకి కూటమి నేతలు సిద్ధం కావాలని ఆయన కోరారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ ఉందని, మేయర్ సీటుతో పాటు అత్యధిక సంఖ్యలో కార్పొరేటర్లను కూడా తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీ అభ్యర్థులంతా సమర్థులైనవారని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు జనం మద్దతు పొందుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

11 Replies to “ముందంజలో వైసీపీ”

  1. ఒకడేమో టైమ్ మీది, కొడతారు కొట్టించుకుంటాం.. అంటూ వైసీపీ క్యాండిడేట్స్ ని నామినేషన్ కూడా వెయ్యకుండా 

    పోలీసులని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని CM ఖూనీ చేశాడు 

     అంటూ లంగా అరుపులు అరుస్తూ0టె.. నువ్వేమో ఏ ఇబ్బందీ లేకుండా అందరికంటే ముందే అన్ని డివిషన్స్ కి నామినేషన్ వేసెసాం..అపుడే ప్రచారం కూడా చేసుకుంటున్నాం.. విజయం ముంగిట ఉన్నాం.. వాళ్ళేమో సరైన నాయకత్వం “లేక సీట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అంటావ్.. ఏది నిజం?

Comments are closed.