ఈ విజయాలు చంద్రబాబులో భయాన్ని పెంచాయా?

కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబునాయుడు.. తన మంత్రివర్గ సహచరులతో పంచుకున్న మాటలు చాలా కీలకం.

కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబునాయుడు.. తన మంత్రివర్గ సహచరులతో పంచుకున్న మాటలు చాలా కీలకం. ఆయన ఏం చెప్పారంటే.. ‘‘ఈ విజయాలన్ని తలకెక్కించుకుని నేల విడిచి సాము చేయొద్దు. మరింత బాధ్యతగా జవాబుదారీతనంతో పనిచేయాలి’’ అని చెప్పుకొచ్చారు.

కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. ఈ విజయాలు తలకెక్కించుకోవద్దు అని చెప్పినట్టుగా లేవు ఈ మాటలు.. ‘‘ఇప్పుడు మనకు దక్కిన వాటిని అసలు విజయాలు అనుకోవడానికే వీల్లేదు.. వీటిని నమ్ముకుంటే నట్టేట మునుగుతాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పూర్తిగా భిన్నమైన వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిందే..’’ అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది.

మునిసిపాలిటీల్లోను, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ కూటమి పార్టీలు ఘనవిజయాన్నే సాధించాయి. ఈ గెలుపు లెక్కలను చంద్రబాబునాయుడు రకరకాలుగా విశ్లేషిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనని.

ప్రజలు ఆ పార్టీ పతనాన్ని రాసేశారని చెప్పుకొచ్చారు. ఎన్ని ఏకగ్రీవాలు దక్కినా, ఎన్ని విజయాలు దక్కినా.. అవి ఎలా దక్కాయో బాహ్యప్రపంచంలోని వారికి తెలియకపోయినా.. గెలిచిన వారికి, వారిని గెలిపించిన పెద్దలకు బాగా తెలుసు.

ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని అక్రమాలు జరిగితే.. ఎన్ని దందాలు, దాదాగిరీలు చేస్తే ఆ ఘన విజయాలను నమోదు చేసారో అందరి కంటె ఎక్కువగా చంద్రబాబునాయుడుకే తెలుసు. అందుకే ఆయన ఈ ఫలితాలను చూసి భయపడుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.

ఇంకా బాగా కష్టపడకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవం అని మంత్రులకు హితోపదేశం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు.

అంతో ఇంతో పారదర్శకంగా, నిజాయితీగా ఎన్నికలు జరిగిన చోట్ల అయితే వైసీపీ అభ్యర్థులు గెలవడమూ, కూటమి వారు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కడమూ చంద్రబాబుకు తెలియని సంగతి అనుకోవడానికి వీల్లేదు. అందుకే ఈ గెలుపులను సెలబ్రేట్ చేసుకున్నారు గానీ.. వారి ఆత్మవిశ్వాసం మాత్రం పెరగలేదు.

గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే తరహాలో రికార్డు స్తాయి విజయాలను నమోదు చేశారు. అప్పట్లో కూడా వ్యవసస్థలను పాలక పార్టీ వాడుకోవడం జరిగింది. పోలీసు యంత్రాంగాన్ని కూడా తమకు అనుకూలంగా వాడుకున్నారు.

అప్పటి స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవానే కనిపించింది. కానీ పర్యవసానం ఏమిటి? సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి వైసీపీ చతికిలపడింది.

అడ్డదారుల్లో దక్కే విజయాలు పార్టీ పతనాన్ని నిర్దేశిస్తాయే తప్ప.. మేలు చేయవనే సత్యాన్ని చంద్రబాబు ముందుగానే గ్రహించారు గనుక.. ఇప్పుడు తన సొంత వారిని హెచ్చరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

11 Replies to “ఈ విజయాలు చంద్రబాబులో భయాన్ని పెంచాయా?”

    1. ఆయనకి ఏ గతి పడతాదో తర్వాత మాట్లాడుకుందాం కానీ.. నీకు మాత్రం ఈ ఒక్క రాజమండ్రి జైలు తప్ప ఇంకేమీ తట్టదా ఎర్రి నాయాల?

  1. దాదాపు వైస్సార్సీపీ 150 జడ్పీటీసీ 6000 ఎంపీటీసీ గెలిచినట్టు చామాచారం 

  2. దాదాపు రెండు వందలు జడ్పీటీసీ లు 6 వేలు ఎంపీటీసీ లు వైస్సార్సీపీ గెలిచి నట్టు లోకేష్ కీ నివేదిక అందింది అంట 

  3. YCP felt that they were really popular after 2021 local body elections, which they just like TDP. We have all seen the actual result in 2024. CBN does not want a repeat of that. Unfortunately, YCP did not have the maturity to think like this.

  4. MLA పోలీస్ EC గుండాలు ఇంత హంగామా చేసిన మన టీడీపీ గెలిచింది  ఒక గెలుపా అని అంటున్నారు 

    1. అయితే అన్న బెంగుళూరు చెయ్యకుండా వరుసగా ఒక మూడు నాలుగు రోజుల తాడేపల్లి లో ఉండగలుగుతాడా

  5. అవును..అన్ని మన అన్న మాదిరి విజయాలు చూసి why not కుప్పం why not 175 అని పిచ్చా వాగుడు వాగి…రెండు ఒకట్ల కి దిగరు గా? విజయం లో కూడా అణుకువ గా పాఠాలు నేర్చుకొనేవాడు విజ్ఞుడు 

  6. వావ్! భయ్యా ఇలా రోజు మాటకొక వ్యాసం రాసే ధైర్యం కావాలతే ఏ సింతేటిక్ మాత్ర వాడతావు. కిక్ చాలా హై సుమీ! వారమ్ అయినా దిగలేదు..

Comments are closed.