ఆ నడుమ కొన్ని నెలల కిందట.. దేశమంతా పొదుపు పాటించాలని, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గాలని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. ఆ వెంటనే.. దేశవ్యాప్తంగా మోడీ భక్తులందరికీ పూనకం వచ్చేసింది.
డీజిలు, పెట్రోలు వాహనాల వాడకం తగ్గించేస్తే.. ఉన్నపళంగా మోడీ తమను ప్రేమగా వాటేసుకుంటాడన్నంతగా అందరూ చెలరేగిపోయారు. భాజపా/ ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నిచోట్లా ఈ పొదుపు మంత్రం ఉన్మాదం స్థాయిలో కనిపించింది.
ప్రధాని నుంచి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ తమ తమ కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకున్నారు. చంద్రబాబునాయుడు, పవన్, లోకేష్ లాంటివారు కాన్వాయ్ లో రెండు మూడు వాహనాలకు పరిమితం అయ్యారు. చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి.. అదే సీజన్లో నెల్లూరులో షెడ్యూలు చేసి ఉన్న మహానాడు మహాసభలను ఏకంగా రద్దు చేసేశారు. మెజారిటీ ఆన్ లైన్ లో జరిగేలా హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు.
చంద్రబాబు పొదుపు కోసం పిలుపు ఇచ్చారు కదాని మంత్రులు ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటినుంచి రైల్వేస్టేషను దాకా సైకిల్లో వెళ్లడం.. అక్కడినుంచి విజయవాడకు రైల్లో వెళ్లడం.. మంత్రులు పూనుకున్న ఇలాంటి ప్రహసనాలు ప్రజలకు నవ్వు తెప్పించాయి. పెట్రోలు వాడకం తగ్గించడం ఒక్కటే దేశానికి శ్రీరామరక్ష.
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే.. విదేశీమారకద్రవ్య నిల్వలు పెరగాలంటే అదొక్కటే మార్గం అన్నట్టుగా అందరూ చెలరేగిపోయారు. అయితే.. ఆ పొదుపు ఉద్యమం మొత్తం పాలపొంగులాంటిదేనా? మూణ్నాళ్ల ముచ్చటేనా? మోడీ పిలుపు ఇచ్చారు గనుక.. కొన్ని రోజులు అలాంటి నాటకాలు నడిపించి.. మళ్లీ అందరూ యధావిధిగా దుబారాకు పూనుకుంటున్నారా? రకరకాల ఉత్సవాలు, వేడుకల ముసుగులో విపరీతమైన డీజిలు వృథాకు మళ్లీ తెరతీశారా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.
భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. ఈ ఒక్క విమానాశ్రయంతో యావత్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మొత్తం మారిపోతాయని చంద్రబాబునాయుడు ఊదరగొట్టడం ఆల్రెడీ ప్రారంభించారు. ఆయన సహజశైలిలో ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం దేశచరిత్రలో గుర్తుండిపోయేలా నిర్వహించాలని ఆర్భాటం చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికి ఉబలాటపడుతూ ఉండే కూటమి నాయకులందరూ కలిసి ఇవాళ విజయనగరం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు భారీ స్థాయిలో కార్ల ర్యాలీ నిర్వహించారు.
కేవలం రెండు మూడు నెలల కిందట పొదుపుమంత్రం గురించి అతి భయంకరంగా ఉపన్యాసాలు దంచిన పార్టీ నాయకులే ఇప్పుడు.. ఇలాంటి కార్ల ర్యాలీ చేపట్టడం ద్వారా ఏం సకేతాలు ఇవ్వదలచుకున్నారు.
ఎందుకింత దుర్మార్గంగా వృథా చేస్తున్నారు. ఎటూ ప్రారంభోత్సవానికి జనాన్ని తరలించడానిక వేల కొద్దీ లీటర్ల డీజిలు, పెట్రోలు వృథా చేస్తారు. మళ్లీ ఇప్పుడు కూడా ఇలా దండగ చేయడం అవసరమా అనేది ప్రజల సందేహం. దేశ ఆర్థిక వ్యవస్థకు వీరు చేసే మేలు అదేనా? అనేది సందేహం. సుద్దులు చెప్పడం, పొదుపు మంత్రాలు పఠించడం అంతా పాలపొంగు లాగా కొన్నాళ్లు మాత్రమే ఉంటాయా.. తర్వాత అంతా యథావిధిగా మారిపోతాయా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.

చెట్లు కొట్టించి దుకాణాలు (వైన్ షాప్ తప్ప) మూసివేయించి ఇరువైపుల పరదాలు కట్టించి తిరగాలంటారు.
ఈ రోజుల్లో కారు పార్కింగ్ కోసం చేతికి రావలసిన పంట పొలాలు దున్నేస్తున్నారు. అంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా?
ప్రపంచంలో అతి ప్రచార పిచ్చి ఉన్న పార్టీ మన పచ్చ పార్టీ వాళ్ళు సైలెంట్ గా ఎలా చేస్తారు అనుకున్నావు GA. భోగాపురం ఎయిర్పోర్ట్-జగన్ హయాంలో జరిగింది దాన్ని హైజాక్ చేయాలి అంటే అతిగా ప్రచారం చేసుకోవడం ఒక్కటే దారి.