జగన్ ఛాన్సిచ్చారు.. వాళ్లు ఆడుకుంటున్నారు!

అమరావతి రాజధాని విషయంలో సంయమనం పాటించడం జగన్మోహన్ రెడ్డి బాధ్యత. కారణాలు ఏమిటని ఇప్పుడు తవ్వుకుంటూ వెళ్లడం అనవసరం.

అమరావతి రాజధాని విషయంలో సంయమనం పాటించడం జగన్మోహన్ రెడ్డి బాధ్యత. కారణాలు ఏమిటని ఇప్పుడు తవ్వుకుంటూ వెళ్లడం అనవసరం. మొత్తానికి అమరావతి రాజధానిని జగన్ ఇష్టపడలేదు. ప్లానింగ్, బొమ్మలు చూపించడం తప్ప.. నిర్మాణం చంద్రబాబు చేయలేకపోయాడు. నేను చేయగలిగాను.. అని చెప్పుకోగల అవకాశాన్ని ఆయన వదులుకున్నారు. అమరావతిని ద్వేషించే నాయకుడనే ముద్రను మూటగట్టుకున్నారు. ఆ విషయంలో ఆయన అయిదేళ్లపాటు ఎవ్వరి సలహాలను కూడా ఖాతరు చేయలేదు. ఫలితం ఎన్నికల్లో కనిపించింది.

రాష్ట్రప్రజలందరూ అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు.. అనే సంగతి ఎన్నికల తీర్పులో స్పష్టమైంది. తదనంతర పరిణామాల్లో ఇక గత్యంతరంలేని స్థితిలో అమరావతి రాజధాని పట్ల వైసీపీలో కూడా సానుకూలత ఏర్పడినట్టుగా కనిపించింది. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించిన తరువాత.. ఇక మూడు రాజధానుల ఆలోచన తాము విడిచిపెట్టినట్టుగా వైసీపీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

వైసీపీ తమ విధానం మార్చుకున్నదని ప్రజలకు అర్థమైంది. నిజం చెప్పాలంటే.. ఓటమికి దారి తీసిన వాటిలో ఒక ప్రధాన కారణం పట్ల ఆలోచన మార్చుకున్నందుకు ఆ పార్టీ అభిమానులు కూడా సంతోషించారు.

కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ వివాదాన్ని రాజేశారు. రివర్ బెడ్, రివర్ బేసిన్ అంటూ రకరకాల విమర్శలు చేశారు. ఈ సమయానికి తగిన విమర్శలు కావు అవి. ఆ మాటలకు సజ్జల రామకృష్ణా రెడ్డి సమర్థింపు కూడా గొప్పగా లేదు.
రాష్ట్ర ప్రజలు ఒకసారి రాజధానిగా అమరావతిని ఆమోదిస్తున్నట్టుగా విస్పష్టమైన తీర్పు చెప్పిన తరువాత.. తమ ప్రత్యర్థి జగన్ కూడా దానికి అనుకూలంగా ఉంటే.. తెలుగుదేశానికి లాభం లేదు. జగన్ దానిని వ్యతిరేకిస్తున్నాడనే అస్త్రాన్ని ప్రయోగించే వారు అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు జగన్ కూడా దానిని సమర్థిస్తే.. వచ్చే ఎన్నికలకు వారు ఒక ఎడ్వాంటేజీని కోల్పోతారు. ఎన్నికల తర్వాత తొలుత అలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ.. తన తాజా వ్యాఖ్యలతో అమరావతి పట్ల తనకు ఇంకా విముఖతే ఉన్నదని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆయన మాటల్ని తెలుగుదేశం చాలా అద్భుతంగా అందిపుచ్చుకుంది. జగన్ లో అమరావతి పట్ల ద్వేషం ఇంకా పోలేదంటూ.. వారు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అసలే తెలుగుదేశం పార్టీ వారు గోబెల్స్ ప్రచారంలో దిట్టలు. ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం ద్వారా.. ప్రపంచాన్ని నమ్మించగలం అనే కాన్ఫిడెన్స్ ఉన్నవారు. అలాంటి వారికి జగన్ తానుగా ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్లిప్పుడు పదేపదే ఆడుకుంటున్నారు. జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒక వేళ మళ్లీ గెలిచినా జగన్ అమరావతిని నాశనం చేసేస్తారనే ప్రచారం ప్రారంభించారు. విశ్లేషకుల అంచనాలు అయితే.. ఈ ప్రచారాన్ని వారు చాలా జాగ్రత్తగా వచ్చే ఎన్నికల వరకు సాగిస్తూనే ఉంటారు.

జగన్ మేలుకోవాలి. జరుగుతున్న నష్టాన్ని నివారించే బాధ్యతను మళ్లీ తన వందిమాగధుల చేతుల్లో పెట్టడం కాదు. తాను ఒక చర్చకు కారణమైన తర్వాత.. దాని గురించి సర్దిచెప్పే బాధ్యతను మరొకరికి అప్పగించకూడదు. తానే స్వయంగా నివృత్తి చేయాలి. ప్రజలకు హామీ ఇవ్వాలి. ఇప్పుడు కాకపోయినా.. ఈ ప్రచారం మరింత ఉధృతరూపం దాల్చకముందే ఆ పనిచేయాలి. లేకపోతే ఆ మాటల వల్ల నష్టమే ఎక్కువ.

18 Replies to “జగన్ ఛాన్సిచ్చారు.. వాళ్లు ఆడుకుంటున్నారు!”

  1. ఈ జగన్ అనే నరకాసురుడు ఇంకా పాపాలు చేయక ముందే చర్యలు తీసుకోవాలి అని ఆంధ్ర పౌర సమాజం , ప్రజలు నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని నెటిజనులు కూడా అంటున్నారు కదా…

    1. Avunu east west guntur ku oka state icheste peeda potundi anukuntunnaru. Appulakuuppalu chesi moodu partylu panchukunnayu. Abhivruddi paper lake parimatham

  2. ఎవర్ని ఏమంటున్నావ్ రా?

    “సింగిల్ సింహం” ఇక్కడ..ఒక్కసారి మాట చెబితే11వందలసార్లు చెప్పినట్టే..

  3. చెప్పిన మాట తప్పుడు, మడమ తిప్పుడు “సింగిల్ సింహం” డిక్షనరీలో లేదు.. 2.Oలో కనీసం11రాజదాన్లు కట్టి చూపిస్తాడు. Any doubts?

    GA..మీ ఊరి లో కూడా రాజధాని కట్టాలా చెప్పు? Recommend చేస్తా?

  4. 2019 లో YCP win అంటె amaravathi వద్దు అని అన్నట్ల? ఒక small state ki 2 lakhs crores అప్పు అవసరమా? 2-3 crops పండి పంట పొలాలు ఎందుకు? Dry లాండ్స్ వుండగా

  5. అసలు జనం… జగన్ ని ఎందుకు నమ్మాలి?

    ముందు నువ్వు సమాధానం చెప్పు చూద్దాం

  6. రాజధాని విషయంలో ” జగన్ చేతులు పూర్తిగా కాలిపోయాయి -ఇక ఆ తులు పెట్టుకోవడాన్ని కి లేకుండా “

  7. ///అసలే తెలుగుదేశం పార్టీ వారు గోబెల్స్ ప్రచారంలో దిట్టలు. ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం ద్వారా.. ప్రపంచాన్ని నమ్మించగలం అనే కాన్ఫిడెన్స్ ఉన్నవారు.///

    .

    నువ్వు చెప్పిందె వాళ్ళు రాసారు! ఇందులొ గోబెల్స్ ప్రచారం ఎముంది? నమ్మించటం ఎముంది? 

    గోబెల్స్ ప్రచారం అంటె..

    బాబాయి ని చంపి నారాసుర రక్త చరిత్ర….

    చంద్రబాబు ఇంట్లొ పింక్ డైమొండ్

    32 కమ్మ DSP లు 

    అమరవతి లొ ఇన్సిడర్ ట్రేడింగ్

    అమరవతి మునిగిపొయింది

    కీయా Y._.S._.R తెచ్చాడు!

    గూగుల్ జగన్ నె తెచ్చాడు

    బొగాపురం కి కర్త కర్మ క్రియా జగనె

    1. బావా మరదళ్ల సంసారం కోసం 10లక్షల కోట్ల అప్పుతో రుషికొండ ప్యాలెస్? Whynot వండర్?

Comments are closed.