ఏపీలో బీజేపీ బలోపేతానికి ఆ పార్టీ నూతన అధ్యక్షుడు మాధవ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని దగ్గుబాటి పురందేశ్వరి నుంచి ఆయన స్వీకరించిన సంగతి తెలిసిందే. బీజేపీ బలపడితే, ఎక్కడ టీడీపీ బలహీనపడుతుందో అనే భయంతో దగ్గుబాటి పురందేశ్వరి చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే విమర్శ వుంది. దగ్గుబాటి హయాంలో బీజేపీలో కీలక నాయకులు చేరకపోగా, సొంతవాళ్లు కూడా వీడి వెళ్లిపోయారు.
దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ వైఖరితోనే కొందరు నిఖార్సైన బీజేపీ నాయకులు కూడా వెళ్లిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఆ ఆ పార్టీ మూలాలున్న మాధవ్‌కు అప్పగించడం విశేషం. తద్వారా ఏపీలో రాజకీయ పంథాపై బీజేపీ అధిష్టానం తన వైఖరిని స్పష్టం చేసినట్టైంది.
బీజేపీ అధిష్టానం పెద్దల ఆలోచనల మేరకు మాధవ్ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రపరచడం, వారి కుటుంబాల వద్దకెళ్లి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించడం, వీరమరణం పొందిన సైనికుల ఇళ్లకు వెళ్లి నివాళులర్పించనున్నారు. ఈ నెల 14వ తేదీ వరకూ తిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ నెల 14న జిల్లా కేంద్రాల్లో దేశ విభజన సమయంలో నెలకున్న పరిస్థితులపై ఎగ్జిబిషన్ ఏర్పాటు, అలాగే అదే రోజు సాయంత్రం క్యాండిల్స్ లేదా కాగడాలతో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ అంటే దేశభక్తి పార్టీగా ప్రజలు గుర్తించేలా నడుచుకుని, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్లాన్‌లో భాగంగా మాధవ్ నేతృత్వంలో ఆ పార్టీ ముందుకెళుతోంది.

Nee opinion lo nikharsu ayina BJP leader ante Vishnu Vardhan Reddy aa? Joke…
పోనిలే మంచిదే. అప్పుడైనా ఇక ఒక జేబులో టీడీపీ , ఒక జేబులో y/cp , ఒళ్ళో jsp పెట్టుకోవాల్సిన అవసరం తప్పుతుంది. ఇంక భీభత్సమైన మెజారిటీ తో గెలవడం ఒకటే మిగిలింది.
పోనిలే మంచిదే. అప్పుడైనా ఇక ఒక జేబులో టీడీపీ , ఒక జేబులో y /c/p , ఒళ్ళో j/sp పెట్టుకోవాల్సిన అవసరం తప్పుతుంది. ఇంక భీభత్సమైన మెజారిటీ తో గెలవడం ఒకటే మిగిలింది.
Till now BJP never got deposits by contesting alone🤣