మోదీపై ప‌తాక‌స్థాయిలో బాబు భ‌క్తి… విమ‌ర్శ‌ల వెల్లువ‌!

ప్ర‌ధాని మోదీపై సీఎం చంద్ర‌బాబు త‌న స్థాయిని మ‌రిచి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నార‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

ప్ర‌ధాని మోదీపై సీఎం చంద్ర‌బాబు త‌న స్థాయిని మ‌రిచి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నార‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. బాబుపై చాలా మంది మ‌న‌సులో ఉన్న‌దే… సీబీఐ మాజీ అధికారి, టీడీపీ అనుకూల‌మ‌నే ముద్ర ఉన్న విశ్రాంత ఉన్న‌తాధికారి బ‌య‌టికి చెప్పారు. టీడీపీ అనుకూల‌మనే ముద్ర ఉన్న ఆ విశ్రాంత ఐపీఎస్ అధికారే ఎం.నాగేశ్వ‌ర‌రావు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా సామాజిక‌, రాజ‌కీయ ప‌రిణామాల‌పై త‌న‌వైన అభిప్రాయాల్ని ఆయ‌న కుండ‌బద్ధ‌లు కొట్టిన‌ట్టు చెబుతుంటారు. ఇవాళ భోగాపురంలో అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్రయాన్ని ప్ర‌ధాని మోదీ జాతికి అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌ధాని మోదీపై చంద్ర‌బాబు భ‌జ‌న ప‌తాక స్థాయికి చేరింది. మోడీ…మోడీజీ అని తాను అంటూ జ‌నంతో గ‌ట్టిగా అనిపించ‌డాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వ‌ర‌రావు త‌ప్పు ప‌ట్టారు. అలాగే ప్ర‌జాస్వామ్య ప్ర‌పంచంలో మోదీ లాంటి నాయ‌కుడు లేర‌న‌డంతో పాటు ఇంకా చాలా చాలా పొగ‌డ్త‌లే చంద్ర‌బాబు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాగేశ్వ‌ర‌రావు షేర్ చేస్తూ, ఘాటు పోస్టు పెట్టారు.

“చంద్ర‌బాబు గారు… అధికారం కోసం ఇంత‌లా దిగ‌జారాల్సిన దుస్థితి నిజంగా వుందా? దివికేగిన ఆ మ‌హానుభావుడు ఎన్టీఆర్ ప‌విత్ర ఆత్మ తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెడుతున్న మీ ప్ర‌వ‌ర్త‌న చూసి ఎంత‌గా శోకిస్తుందో ఊహించుకున్నారా?” అని నాగేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించ‌డం గ‌మనార్హం. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అన్నార‌ను కాదు కానీ, ఆ వీడియో చూస్తే, ఎవ‌రికైనా ఇలాంటి అభిప్రాయం క‌ల‌గ‌కుండా వుండ‌దు.

ప్ర‌ధానిపై అభిమానం వుంటే దాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఒక ప‌ద్ధ‌తి వుంటుంది. మ‌రీ ముఖ్యంగా మ‌రో పార్టీకి చెందిన నాయ‌కుడు, ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న నాయ‌కులు త‌మ ప్ర‌జ‌ల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ, ప్రేమ‌ను చూపాల్సి వుంటుంది. కానీ చంద్ర‌బాబు అలాంటి ఆలోచ‌న‌లేవీ చేసిన‌ట్టు లేదు. త‌న స్థాయిని మ‌రిచి, బీజేపీ కార్య‌క‌ర్త‌లా సభా వేదిక‌పై నుంచి మోదీ, మోదీజీ అని గ‌ట్టిగా అర‌వ‌డం, అదే రీతిలో కార్య‌క‌ర్త‌ల‌తో ప‌ల‌కించ‌డం చూసేవారికి ఎబ్బెట్టుగా అనిపించింది. నాగేశ్వ‌ర‌రావు మాట‌ల్లో చెప్పాలంటే… అధికారం కోసం ఇంత‌లా దిగ‌జారాల్సిన అవ‌స‌రం లేదు.

ఇదే నాగేశ్వ‌ర‌రావు శుక్ర‌వారం చేసిన ట్వీట్ కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ధాని స‌భ‌కు సంబంధించి సంబంధిత అధికారుల‌తో చంద్ర‌బాబు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ ట్వీట్ ఏంటో కూడా తెలుసుకుందాం.

“ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రధాన మంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్‌గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం….. పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా?

నేను ఒడిశాలో జానకీ వల్లభ పట్నాయక్, బిజూ పట్నాయక్, హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగో, నవీన్ పట్నాయక్ లాంటి ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశాను. వారెప్పుడూ తమ హోదాను కాపాడుకుంటూ, ప్రధానమంత్రిని ఒక సహచరుడిగా గౌరవించారే తప్ప, తమ పదవిని ఏనాడూ పలచన చేయలేదు”

ప్ర‌ధానిని స‌హ‌చరుడిగా చూసిన ముఖ్య‌మంత్రుల గురించి నాగేశ్వ‌ర‌రావు ప్ర‌త్యేకంగా గుర్తు చేయడం విశేషం. కానీ చంద్ర‌బాబు మాత్రం ఈవెంట్ మేనేజ‌ర్‌గా మారి, త‌న స్థాయిని దిగ‌జార్చార‌ని త‌ప్పు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు తీరుపై విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, త‌ట‌స్థులు, అలాగే రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచించే వారెవ‌రైనా అంగీక‌రించ‌రు. ఆ విష‌యం చంద్ర‌బాబుకే ఇంకా తెలియ‌దు. త‌న ప‌ద‌వి మోదీ భిక్ష అన్న రీతిలో చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తించ‌డం చివ‌రికి ఆయ‌న్ను అభిమానించే వాళ్ల‌కు సైతం న‌చ్చ‌డం లేదంటే ఆశ్చ‌ర్యపోవాల్సిన ప‌నిలేదు.

21 Replies to “మోదీపై ప‌తాక‌స్థాయిలో బాబు భ‌క్తి… విమ‌ర్శ‌ల వెల్లువ‌!”

  1. అధికారం కోసం ఎవడి ఉచ్చ అయినా అమృతం లా తాగే ఒకే ఒక్క నాయకుడు… మన బొల్లిగారు..

  2. అ.ధికారం కోసం ఎ/వడి ఉ/చ్చ అయినా అ/మృ.తం లా తా.గే ఒకే ఒక్క నా.యకుడు… మన బొ/ల్లిగారు..

  3. అ.ధికారం కోసం ఎ/వడి ఉ/చ్చ అయినా అ/మృ.తం లా తా.గే ఒకే ఒక్క నా.య-కుడు… మన బొ/ల్లిగారు..

  4. అ.ధికా.రం కోసం ఎ/వడి ఉ/చ్చ అయినా అ/మృ.తం లా తా.గే ఒ.కే ఒ.క్క నా.యకు.డు… మన బొ/ల్లిగా.రు..

  5. అ.ధికా.రం కోసం ఎ/వడి ఉ/చ్చ అ.యినా అ/మృ.తం లా తా.గే ఒ.కే ఒ.క్క నా.యకు.డు… మన బొ/ల్లిగా.రు..

  6. కనీసం పది శాతం టీడీపీ అభిమానులైనా సమర్థించి ఉంటారా అన్నది‌‌ ప్రశ్నించుకోండి, వీలైతే ‌మీకు అలవాటు ఐనా ఐవీఆర్ఎస్ సర్వే చేసి తెలుసుకోండి. మీ పార్టీతో సంబంధం లేని వాళ్లకే చిరాకుగా ఉంది, మరి అభిమానులు, ‌కార్యకర్తలకు‌ ఎలా ఉంటుందో తెలియదా. 

  7. తిరుపతి లో మోడీ కాళ్ళు పట్టుకోబోయిన అన్న భక్తి సంగతేంటి?

  8. కనీసం పది శాతం మీ పార్టీ అభిమానులైనా సమర్థించి ఉంటారా అన్నది‌‌ ప్రశ్నించుకోండి, వీలైతే ‌మీకు అలవాటు ఐనా ఐవీఆర్ఎస్ సర్వే చేసి తెలుసుకోండి. మీ పార్టీతో సంబంధం లేని వాళ్లకే చిరాకుగా ఉంది, మరి అభిమానులు, ‌కార్యకర్తలకు‌ ఎలా ఉంటుందో తెలియదా

  9. కనీసం పది శాతం టీడీపీ అభిమానులైనా సమర్థించి ఉంటారా అన్నది‌‌ ప్రశ్నించుకోండి, వీలైతే ‌మీకు అలవాటు ఐనా ఐ*వీ*ఆర్ఎస్ స*ర్వే చేసి తెలుసుకోండి. మీ పా*ర్టీతో సంబంధం లేని వాళ్లకే చిరాకుగా ఉంది, మరి అభిమానులు, ‌కార్య*కర్తలకు‌ ఎలా ఉంటుందో తెలియదా

  10. ఇప్పుడు కొత్త విషయాలేవైనా చెప్పారా?  జీవితంలో ఎన్నడైనా హుందాగా ఉంటే ఇప్పుడు మారారని విమర్శించవచ్చు.

  11. సోనియమ్మ మెడలు వంచిన ధీరుడు

    వంగి టెంకాయ కొట్టలేని శూరుడు

    కానీ మోడీ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగితే ఇక్కడ తాడేపల్లి లో వంగుంటాడు

  12. అప్పుడప్పుడూ ఒంగోవాలీ , తప్పదు. భవిష్యత్ ప్రణాళిక చాలా పెద్దది మరి. వారసత్వానికి అధికార బదిలీ సాఫీ గా జరగాలంటే ఆ మాత్రం సిగ్గు విడిచి ఉండటం లో తప్పు లేదు. విభిన్న ధృవాలు కలవడం అంటే ఇదే. ఒకరేమో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, ఇంకొకరు వారసుడి పట్టాభిషేకం కోసం ఆత్రుత

Comments are closed.