అయ్యా! మీడియాని వదిలేయండి

మీడియాని ఒక్కదాన్నీ స్వేచ్ఛగా వదిలేయండి. ఇదే ప్రభుత్వాలని కోరేది. ఏదో ఒక వర్గం కోసమో, పార్టీ కోసమో కాదు.

ఒక మనిషిని గదిలో బంధించవచ్చు.. కానీ కనీసం కిటికీ అయినా తెరిచి పెట్టాలి. గట్టిగా అరిస్తే బయట ఎవడన్నా పలికేలా ఉండాలి. ఆ కిటికీ కూడా మూసేసి సీల్ చేస్తే, కాసేపు భరించినా శక్తినంతా కూడగట్టుకుని తలుపుని బద్దలకొట్టే ప్రయత్నం చేస్తాడు.

జైల్లో ఖైదీలని కూడా కటకటాల్లో బంధిస్తారు. రోజూ కాసేపు బయటికి వదుల్తారు. అంతే తప్ప సఫొకేట్ చేయరు.

ఇక్కడ చెప్పుకున్నది మనిషిని శారీరకంగా బంధించే చెఱసాల గురించి. మానసికంగా బంధించే చెరసాల కూడా ఉంటుంది. అదే ఇప్పుడు దేశంలో విస్తరిస్తోంది.

సామాన్యుడికి కష్టమొస్తే ఖాకీ చొక్కల వద్దకి వెళ్తాడు. అక్కడ పని జరగకపోతే నల్లకోటుల్ని సంప్రదిస్తాడు. అక్కడా పని జరగకపోతే మీడియా వద్దకి వెళ్తాడు. ఈ మీడియా మనం పైన చెప్పుకున్న కిటికీ.

సమస్య నుంచి బయటపడడానికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మీడియా మైకు ముందుకెళ్లి తన బాధ చెప్పుకుంటాడు. కానీ ఆ మీడియా కూడా మొహం చాటేస్తే?

దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ పోలీసులు, న్యాయ వ్యవస్థలే కాదు.. మీడియాలు కూడా డబ్బుకో, భయానికో ప్రభుత్వాలకి లొంగిపోతున్నాయి. సామాన్యుడి గోడు వినిపించడానికి వేదికలు ఉండట్లేదు.

సోషల్ మీడియాలోనూ, ఇండెపెండెంట్ యూట్యూబర్ల చానల్స్ లోనూ ఏదన్నా చెప్పుకుందామన్నా.. పెద్ద పెద్ద చానల్స్ నే తోకముడిచేలా చేసిన ప్రభుత్వాలు వీళ్లని చేయడం ఎంత? అందుకే వాళ్లు కూడా కొన్ని సైద్ధాంతిక అంశాల పట్ల నోరు తెరుస్తున్నారు తప్ప సామాన్యుడి సమస్యని వినిపించేంత విశాలంగా అయితే లేరు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాక ఏమౌతారు? సమస్య రానంత వరకు అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది.

ఏలుతున్నది మన కులం వాడే కాదా, మన మతం వాడే కదా అనుకుంటూ కొందరు.. అంతా బాగానే ఉందిగా, దేశం, రాష్ట్రం పురోగతి చెందుతోందని టీవీల్లో చెబుతున్నారు.. లక్షల కోట్ల పెట్టుబడులొస్తున్నాయని పేపర్లో రాస్తున్నారు.. ఇంతకంటే ఏం కావాలి అనుకుంటూ కాలక్షేపం చేసేస్తున్న ప్రజలే నూటికి 99 మంది.

కానీ నిజంగా సమస్య వచ్చినప్పుడు “సొంతవాడు” అనుకున్న ఎవ్వడూ ఏమీ చెయ్యడు. ఉదాహరణకి భూమి కబ్జా చేసారనుకుందాం.

పోలీసులు, న్యాయవ్యవస్థలు, మీడియా అందరూ మొహం చాటేస్తే ఎక్కడ చెప్పుకోవాలి? ఏడ్చి గుండెలు బాదుకున్నా వినేవాడు ఉండడు. చుట్టూ జనం మధ్యలో ఏడుస్తున్నా అరణ్యరోదనే అవుతుంది.

సామాన్యుడి ఇంట్లో ఏ ఆడపిల్లకో అన్యాయం జరిగిందనుకోండి. ఆ అన్యాయం చేసినవాడు ప్రభుత్వంతో లింక్ ఉన్నవాడు అనుకోండి… చేసేదేమీ లేక మౌనంగా ఉండాల్సిన పరిస్థితి.

దర్శిలో స్థానిక ఎన్నికల్లో నిలబడాలని నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థిని రూలింగ్ పార్టీ వాళ్లు అడ్డుకుంటే తాసీల్దార్ కాళ్ల మీద పడి వేడుకుంటున్నాడు. ఆ తాసీల్దార్ కనీసం పట్టించుకోవడంలేదు. ఇది వైరల్ అవుతున్న క్లిప్. కానీ మెయిన్ మీడియాలో ఎక్కడా రాలేదు.

పుంగనూరులో మహిళా అభ్యర్థిని నామినేషన్ వేయకుండా వెళ్లకొట్టారు. ఇది కూడా సోషల్ మీడియా క్లిపింగే. కానీ మెయిన్ స్ట్రీం మీడియాలో రాలేదు.

రాయచోటి లో సి.ఐ సక్రమంగా డ్యూటీ చేస్తున్నందుకు రూలింగ్ పార్టీ మనుషులు తోసేసారు. అది కూడా ఏ టీవీలోనూ రాలేదు.

లోకల్ చానల్స్ అన్నీ తెదేపా వశం. జనాదరణ ఉన్న జాతీయ చానల్స్ లో దాదాపు అన్నీ బీజేపీ వశం అయిపోయాయి. ఇంకెక్కడ వినిపిస్తుంది ఎగస్పార్టీ గోడు, సామాన్యుడి వేదన?

ఈ సఫొకేషనే రేపు కట్టలు తెంచుకుని ప్రజా తిరుగుబాటు ఉద్యమంగా మారవచ్చు. పారిస్ లోనూ, లండన్ లోనూ, అమెరికాలోనూ ఇదే పరిస్థితి. అసహనం కట్టలు తెచ్చుకుంటే అరాచకవాదం ప్రజ్వరిల్లుతుంది.

ఓట్లు వేసిన ప్రజల్నే ప్రభుత్వం లాఠీలతో కొట్టిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్నది కేవలం పుస్తకంలో వాక్యంగానే పరిమితమవుతుంది.

అప్పుడు ఆకులు పట్టుకునే కన్నా మీడియా అనే కిటికీని సామాన్యుడి కోసం తెరిచి ఉంచడం మంచిది. దాని వల్ల నష్టమేమీ లేదు. మీడియా చానల్సన్నీ కొమ్ము కాసినా కూడా గతంలో ఓటమి చవిచూసిన తెదేపా ఉంది.

కనుక కేవలం మీడియాని వశం చేసేసుకుంటే గెలుపు గ్యారంటీ అనేది లేదు. అలాంటప్పుడు అరచాకవాదానికి బీజాలు వేస్తూ మరీ ఇంతిలా మీడియా నోరు నొక్కేయడం ఎందుకు?

మీడియాని ఒక్కదాన్నీ స్వేచ్ఛగా వదిలేయండి. ఇదే ప్రభుత్వాలని కోరేది. ఏదో ఒక వర్గం కోసమో, పార్టీ కోసమో కాదు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి, ప్రజలకి, శాంతికి, స్థిరత్వానికి మంచిది కాదు.

జాతీయ మీడియాలు కూడా స్థానిక ఎన్నికల వేళ జరిగే అకృత్యాలని చెప్పకుండా ఎక్కడో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో రేట్లు పెరిగాయని, జనం గగ్గోలు పెడుతున్నరని వాళ్ల వాయిస్ వినిపిస్తున్నాయి. ఇదేం చోద్యం? పక్క దేశంలో దుస్థితిని చూసి మన కష్టాలు మర్చిపోవాలా? ఇదేమి జర్నలిజం?

ఇవన్నీ చూసి కాలక్షేపం చేస్తూ జనం చైతన్యం లేకుండా పడి ఉంటారనుకోవడం సరికాదు. ఎప్పుడో అప్పుడు కంట్రోల్ చేయలేనంతగా బెడిసి కొడుతుంది. ఆ పరిస్థితి రాకముందే, జనానికి మీడియా అనే కిటికీని తెరిచి ఉంచాలి.

– హరగోపాల్ సూరపనేని

20 Replies to “అయ్యా! మీడియాని వదిలేయండి”

  1. హర హర… కుంభకర్ణ నిద్ర తర్వాత నీ ఘోష సూపర్…దసరా పేమెంట్ కి నీ కష్టం నీది

  2. ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఇదేదో గత ఎన్నికల్లో చెప్పి ఉంటే బాగుండేది అప్పట్లో ఆహా ఓహో అంటూ కీర్తనలు, ఇప్పుడు ఏమో ప్రజాస్వామ్యం అంటూ గగ్గోలు.

  3. ‘2’0’2’1′ లొ GA

    జగన్ తొ పెట్టుకుంటె అంతె! మామూలుగా ఉండదు!!

    రాజషెకర్ రెడ్డి లా సాఫ్ట్ కాదు జగన్

    RRR అయ్యొ! అమ్మొ! అని వెడుకున్నా పొలీసులు వినలెదు అంట! భలె!!

    ఇక TDP పని అయ్యిపొయింది! పొటీ చెసెవారు లెక ఎకగ్రీవాలు అవుతునాయి!

    .

    ‘2’0’2’6′ లొ GA

    అయ్యొ!.. ఇది ప్రజాస్వామ్య మానభంగం కాదా?

    మానవ విలువలు, మానవ హక్కులు, అరిటాకుకట్టలు ఎక్కడా?

    మేదావులారా (మొన్నటి వరకూ తిట్టిన) వచ్చి రక్షించండి!

    జగన్ ఆర్తనదాలు వినెవారె లెరా? ఇంత దారుణమా?

  4. ///ఏలుతున్నది మన కులం వాడే కాదా, మన మతం వాడే కదా అనుకుంటూ కొందరు///

    .

    అలా అనుకొబట్టె, జగన్ లాంటి వాడు CM పదవి ఎలగబెట్టదు! లెక పొతె అసలు CM అయ్యె చరిత్రెనా వాడిది.

    1. …..డు రాసినట్లు అసహనం కట్టలు తెంచుకోబట్టే 2024 లో ప్రభుత్వం మారింది

  5. ఈయన ఇప్పుడే కళ్లు తెరిచి మొదటి రెండు పేరాలు రాసేరు. అది ఎప్పుడో తెలుసుకున్న మేము చదువుకుని దేశం దాటి పోయాము. హాయిగా బ్రతుకు ఇండియా ని చూస్తూ కాలక్షేపం కబుర్లు రాస్తున్నాము..

  6. Nenu adhe congress time lo chesina thappu le ippudu adhe chesthunnaru,aendhukala ante, janalu one sided judgement ichesariki ,memu chesina right ani feel avuthunnaru 

  7. ఇప్పుడు ఏపీలో  జరుగుతున్నాయి. ఇంతకుముందు తెలంగాణాలో జరిగాయి. ప్రజల్లో మార్పు రావాలి అంతే.

  8. అవును ఇష్టమొచ్చినట్లు కదా 🫢😷 శెభాష్ శెభాష్ పులి అనుకున్నది 😼 ఇదైంది, కానీ కు…. లకు ఎందుకో ఆ‌ దేవుడు ?????

Comments are closed.