చంద్ర‌బాబుకు ఇష్టం లేని ఎన్నిక‌లు.. ఇలానే ఉంటాయ్!

ఏతావాతా ఏపీకి దాదాపుగా 20 యేళ్ల సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇవి రెండో స్థానిక ఎన్నిక‌లు!

స్థానిక ఎన్నిక‌లు అనేవి తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏనాడూ ఇష్టం ఉండ‌వంటారు!

ఏపీకి సుదీర్ఘ‌కాలం సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో స్థానిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ది ఇది కేవ‌లం రెండోసారి మాత్ర‌మే అంటే ప‌రిస్థితిని సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు!

ఎప్పుడో 2001 స‌మ‌యంలో చంద్ర‌బాబు స్థానిక ఎన్నిక‌లు పెట్టారు. అప్పుడు కూడా బెదిరింపులు, హెచ్చ‌రిక‌లు, నామినేష‌న్ల విత్ డ్రాలకు లోటు లేదు!

అందుకు ఉదాహ‌ర‌ణ అప్ప‌టి అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం జ‌డ్పీటీసీ ఎన్నిక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఎన్నిక‌ల్లో అనంత‌పురం జ‌డ్పీ పీఠాన్ని గెల‌వ‌డానికి కూడా తెలుగుదేశం చాలా క‌ష్ట‌ప‌డింది!

ఎంత‌లా అంటే.. ధ‌ర్మ‌వ‌రం నుంచి జ‌డ్పీటీసీగా బ‌రిలోకి దిగిన ముక్తాపురం రామ‌కృష్ణారెడ్డికి ప‌రిటాల ర‌వి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడంటారు. దీంతో ఆయ‌న నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో కాంగ్రెస్ కు గ‌ట్టి ఝ‌ల‌క్ త‌గిలింది.

చివ‌ర‌కు బొటాబోటీ సీట్ల మెజారిటీతో అనంత‌పురం జ‌డ్పీ చైర్మ‌న్ పీఠాన్ని తెలుగుదేశం నెగ్గింది! ఒక‌వేళ ధ‌ర్మ‌వ‌రం విత్ డ్రా, మిగ‌తా చోట్ల ప‌రిటాల ర‌వి మార్కు రాజ‌కీయంతో.. ఆ గెలుపు ద‌క్కింది!

అనంత‌పురం అప్ప‌టికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. అలాంటి చోట నెగ్గ‌డానికి అన్ని పాట్లు ప‌డాల్సి వ‌చ్చింది.

ఒక పంచాయ‌తీల్లో అయితే.. ఆ స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సానుభూతి ప‌రుల‌కు బంప‌ర్ విజ‌యాలు ద‌క్కాయి! పైకి ఎంత మేనేజ్ చేసినా.. 2001 స‌మ‌యంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లే చంద్ర‌బాబుకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాయి. అయినా అర్థం చేసుకోలేక‌పోయారు.

ఆ త‌ర్వాత ఏపీలో 2006 స‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌ళ్లీ కిర‌ణ్ కుమార్ రెడ్డి హ‌యాంలో పెట్టారు. మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌చ్చి ఐదేళ్ల కింద‌ట ఎన్నిక‌లు నిర్వ‌హించే వ‌ర‌కూ .. స్థానిక ఎన్నిక‌ల ఊసు లేదు ఏపీలో!

ఏతావాతా ఏపీకి దాదాపుగా 20 యేళ్ల సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇవి రెండో స్థానిక ఎన్నిక‌లు!

మ‌రి చంద్ర‌బాబు న‌చ్చ‌ని ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఎలా ఉంటుందో.. ప‌రిస్థితి తేట‌తెల్లం అవుతోంది! ఏపీలో 90ల నాటి రాజ‌కీయ రౌడీయిజాన్ని ఆవిష్క‌రించాయి స్థానిక ఎన్నిక‌లు.

నామినేష‌న్ల‌ను అడ్డుకోవ‌డానికి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, ఆఖ‌రికి ఎన్నిక‌ల అధికారులు కూడా పోటీప‌డ్డారు!

ఆపై పోలీసుల‌కూ, ఎన్నిక‌ల అధికారుల‌కు కూడా.. తెలుగుదేశం నుంచి రౌడీ స‌త్కారం త‌ప్ప‌డం లేదు, ఫైల్ అయిన నామినేష‌న్ల‌ను కూడా నామినేష‌న్ల కేంద్రం నుంచి తీసుకుని త‌మ్ముళ్లు పారిపోతున్నారంటే.. ప్ర‌జాస్వామ్యం ఏ స్థాయిలో వ‌ర్ధిల్లుతోందో.. అర్థం చేసుకోవ‌చ్చు!

ఇక నామినేష‌న్ల ప‌రిశీల‌న‌ల్లో కూడా.. కొన్ని చోట్ల బెదిరింపుల‌కు లొంగి, మ‌రి కొన్ని చోట్ల లంచాల‌కు లొంగి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రిస్తున్నార‌నే మాటా వినిపిస్తూ ఉంది!

ఇది సోష‌ల్ మీడియా యుగం, స్మార్ట్ ఫోన్ల యుగం కావ‌డంతో.. త‌మ్ముళ్ల అకృత్యాలు అన్నీ వైర‌ల్ గా మారాయి! వాటి నుంచి చూపు మర‌ల్చ‌డానికి ప‌చ్చ‌మీడియా ఎంత ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఆ దాష్టీకాల‌కు జాతీయ స్థాయి క‌వ‌రేజ్ వ‌స్తోంది!

చంద్ర‌బాబు సీఎం హోదాలో ఉండ‌గా.. ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఏ స్థాయిలో వ‌ర్ధిల్లుతోందో.. జాతి మొత్తానికీ అర్థం అవుతోంది!

38 Replies to “చంద్ర‌బాబుకు ఇష్టం లేని ఎన్నిక‌లు.. ఇలానే ఉంటాయ్!”

  1. అసలు జగనన్న ఉన్నంత కాలం….

    జరిగింది పాలన కాదు, ఒక అద్భుత మాయాజాలం!

    ప్రజాస్వామ్యం పులకించిపోయింది, 

    ధర్మం నాలుగు పాదాలా పరిగెత్తింది,

    మానవ హక్కులు పూల జల్లులా కురిసాయి.

    సత్యం వెలుగులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచమంతటా ప్రకాశించాయి.

    శాంతి ఎంతలా తాండవించిందో చెప్పడానికి మాటలు చాలవు

    ప్రతి ఇల్లూ ఒక దేవాలయమైపోయింది,

    ప్రతి మనిషీ ఒక సాధువైపోయాడు!

    .

    నమ్మండి. జగన్ మీద ఒట్టు!!

    1. జగన్ విలువ మీలాటి పేమెంట్ గానికి ఏమి తెలుసు లే ఇక్కడ కామెంట్ చేసినంతా కాదు మీకు జగన్ అంటే భయం బటం లేకుంటే ఇలా చేసే వాళ్ళు కాదు జగన్ దెబ్బ కొట్టినప్పుడు పేరు మార్చ కుండా ఇక్కడే పోస్ట్ పెట్టు చూద్దాం 

  2. 5000000000

    అసలు జగనన్న ఉన్నంత కాలం….

    జరిగింది పాలన కాదు, ఒక అద్భుత మాయాజాలం!

    ప్రజాస్వామ్యం పులకించిపోయింది, 

    ధర్మం నాలుగు పాదాలా పరిగెత్తింది,

    మానవ హక్కులు పూల జల్లులా కురిసాయి.

    సత్యం వెలుగులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచమంతటా ప్రకాశించాయి.

    శాంతి ఎంతలా తాండవించిందో చెప్పడానికి మాటలు చాలవు

    ప్రతి ఇల్లూ ఒక దేవాలయమైపోయింది,

    ప్రతి మనిషీ ఒక సాధువైపోయాడు!

    .

    నమ్మండి. జగన్ మీద ఒట్టు!!

    1. నత్తి పకోడీ గాడు పోయాడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది

  3. వీడికి ఏమి చేతకాదు అని తెలుగు ప్రజలు లకి తెలుసు ఎలక్షన్ అంతే భయం పొత్తు కనీసం మాధవ హే లోకేష్ కూడా నా 

  4. Its just not andhra, but local elections are actually true reflection if we are a democracy.  A citizen if I can not freely nominate myself or vote for my candidate, and have a say in how my tax money is put to use, it aint a democracy.  Its another thing that some leaders at state or central level do bring about change. But thats pure luck. The best leaders, that we had so far have enjoyed or ousted out of power through non-democratic ways. PVNR and Vajpayee at the center. PVNR, Vijay Bhaskar Reddy, CBN at state level.  Banan Repulblic we are! 

    1. చూసుకో… ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే పక్కనోడు తర్వాత…మొదటికే మోసం వస్తుంది

  5. ధర్మవరం బెస్ట్ ఎక్సంపుల్ అంటావ్…కానీ పరిటాల రవి వార్నింగ్ ఇచ్చాడంటారు…అని ప్రూఫ్ లేని గాలి సొళ్ళు…

  6. ఈ ఎన్నికల వలన జరిగిన ప్రధాన మార్పు:

    జగన్ & పెద్దిరెడ్డి అంటే భయం పోవడం. Y C P వాళ్లలోనే “మనవాళ్ళు మనమనుకున్నంత తోపుగాళ్ళు” కాదేమో అనే అనుమానం రావడం

    పుంగనూరు లో మిదున్ రెడ్డి ని కొట్టారంటే . . తెలుగుదేశం కార్యకర్తలను స్వేచ్ఛగా వదిలేస్తే .. ఏమి జరుగుద్దో ఊహించుకోవచ్చు

    చంద్రబాబు గారు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు  ఆయన బిడ్డ బాబుగారి అంత మంచి వాడు కాదు అని తెలుసుకున్నారు..

Comments are closed.