క‌నుమ‌రుగైపోలేదు రాజ‌న్న‌!

వైఎస్సార్ అనే పేరు లేకుండా ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు లేవంటే, ఆయ‌న ఎంత బ‌ల‌మైన ముద్ర వేశారో అర్థం చేసుకోవ‌చ్చు.

జీవించిన కాలంలో కంటే, చ‌నిపోయిన త‌ర్వాతే కొంద‌రి విలువ స‌మాజానికి ఎక్కువ‌గా తెలుస్తుంది. ఈ స‌మ‌యంలో ఆ నాయ‌కుడు బ‌తికే వుంటే, ప‌రిస్థితులు ఇంత అధ్వానంగా వుండేవి కావ‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటూ వుంటారు. భౌతికంగా మ‌న నుంచి దూర‌మ‌య్యాక‌, ఆయ‌న లేనిలోటు గురించి నిత్యం స్మ‌రించుకునే గొప్ప నాయ‌కుడు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.

వైఎస్సార్ అనేది పేరు కాదు… కొంద‌రి పాలిట సింహ‌స్వ‌ప్నం, మ‌రికొంద‌రికి ప్రేమ పంచిన, కొత్త జీవితాన్ని ఇచ్చిన అమృత హృద‌యం. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలుగు రాజ‌కీయాల్లో వైఎస్సార్ కేంద్రంగా ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ రాజ‌కీయ చ‌ర్చ‌, ర‌చ్చ న‌డుస్తూనే వుంటుంది. ఇది స‌త్యం. అంతెందుకు రెండు రోజుల క్రితం ప్ర‌కాశం జిల్లాలో వెలికొండ ప్రాజెక్ట్‌కు తానే శంకుస్థాప‌న చేసి, పూర్తి చేసినట్టు సీఎం చంద్ర‌బాబు గొప్పలు చెప్పుకోగానే, చాల్లే బ‌డాయి ఇది వైఎస్సార్ ఘ‌న‌త అని వామ‌ప‌క్షాల‌తో పాటు అనేక మంది త‌ట‌స్థ మేధావులు వాస్త‌వాలు చెప్పారు. ఇదీ వైఎస్సార్ అంటే.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వైఎస్సార్ గ‌ట్టిగా పాలించింది ఐదేళ్లే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజంపై శాశ్వ‌త ముద్ర‌వేసే అనేక‌ సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు రూప‌శిల్పి, నిర్మాణ క‌ర్త ఆయ‌నే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, వైఎస్సార్ ప్ర‌మేయం లేనిదంటూ ఏదీ వుండ‌దు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌నే తీసుకుంటే, దానికి అనుమ‌తులు, తీసుకొచ్చింది వైఎస్సారే. అలాగే ఎంతో ముందు చూపుతో కాలువ‌లు తీయించింది ఆయ‌నే.

ఆ త‌ర్వాత వ‌చ్చిన పాల‌కులు ఏం చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏం జ‌రుగుతున్న‌దో ప్ర‌త్య‌క్షంగా అంద‌రూ చూస్తున్నారు. వెనుక‌టికి ఎవ‌రో వ‌స్తువుల్ని మ‌న భార‌తీయులు తయారు చేస్తే, మేడిన్ అంటూ త‌మ దేశం పేరు రాసుకున్నార‌ట‌! అలా వుంది మ‌న ఘ‌న‌త వ‌హించిన పాల‌కుల తీరు.

మ‌రీ ముఖ్యంగా వైఎస్సార్ బ‌తికే వుంటే అని నిత్యం అనుకునే విష‌యం ఒక‌టుంది. అదే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌. వైఎస్సార్ 2009, సెప్లెంబ‌ర్ 2న ఆక‌స్మిక మ‌ర‌ణం చెందారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మం ఏ రీతిలో సాగిందో తెలిసిందే. చివ‌రికి 2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేవ‌లం వైఎస్సార్ అనే బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం వ‌ల్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయింద‌ని ఇటు తెలంగాణ‌, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు, నాయ‌కులు ఈ రోజుకీ అనుకుంటున్నారు.

వైఎస్సార్ ఎంత బ‌ల‌మైన నాయ‌కుడో, విడిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి వైఎస్సార్ పాల‌న‌కు ముందు, ఆ త‌ర్వాత అని మాట్లాడుకోవాల్సి వుంటుంది. వైఎస్సార్ ఎంతో ద‌యార్ద హృద‌యుడ‌ని గుమ్మ‌డి న‌ర్స‌య్య‌, పాటూరి రామ‌య్య‌, కె.నారాయ‌ణ‌, రామ‌కృష్ణ , ప్ర‌స్తుత బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక‌న్న‌ లాంటి నాయ‌కుల మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది.

వైఎస్సార్ పాల‌న హృద‌యం ప్ర‌ధానంగా సాగింది. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ‌, 108, 104 లాంటి అనేక ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి, పేద కుటుంబాల‌కు అండ‌గా నిలిచారు. రోగ‌మొస్తే, ఖ‌రీదైన వైద్యాన్ని పొంద‌లేక ప్రాణాల్ని బ‌లిపెట్టుకునే దుస్థితి నుంచి వైఎస్సార్ విముక్తి క‌ల్పించారు. అందుకే వైఎస్సార్ పేద‌ల హృద‌యాల్లో శాశ్వ‌తంగా దేవుడ‌య్యారు.

అలాగే డ‌బ్బు లేక‌, ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించాల‌న్న కోరిక‌ను ఏ పేద విద్యార్థి చంపుకోకూడ‌ద‌నే ఉద్దేశంతో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని వైఎస్సార్ తీసుకొచ్చారు. తద్వారా ల‌క్ష‌లాది మంది పేద విద్యార్థులు ఉన్న‌త విద్య అభ్యసించి, దేశ‌విదేశాల్లో పెద్ద‌పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ్డారు. అలాగే ప్ర‌మాదానికి గురైతేనో, అనారోగ్య‌బారిన ప‌డితేనో ప‌ది లేదా 15 నిముషాల్లోనే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వ‌చ్చి ఉచితంగా తీసుకెళ్లే అద్భుత సౌక‌ర్యాన్ని వైఎస్సార్ క‌ల్పించారు.

ఇదీ పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల విష‌యంలో వైఎస్సార్ నిబ‌ద్ధ‌త‌. పేద‌ల‌పై ఆయ‌నకు అపార‌మైన ప్రేమాభిమానాలు వుండ‌డం వ‌ల్లే, ఆయ‌న్ను స‌మాజం జాగ్ర‌త్త‌గా గుర్తు పెట్టుకుంది. వైఎస్సార్ భౌతికంగా లేక‌పోయినా, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసేయ‌డానికి ఆయ‌నంటే గిట్టని పాల‌కులు కూడా సాహ‌సించ‌లేక‌పోతున్నారు.

వైఎస్సార్ లేని లోటు అంతాఇంతా కాదు. కొన్ని మీడియా సంస్థ‌లు, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు పేట్రేగిపోతున్నారు. అలాంటి వాళ్ల‌ను చూస్తున్న స‌మాజం… ఈ స‌మ‌యంలో వైఎస్సార్ జీవించి వుంటే అని అనుకోని క్ష‌ణం లేదంటే అతిశ‌యోక్తి కాదు. వైఎస్సార్ లేక‌పోవ‌డం వ‌ల్లే కొంద‌రు చెల‌రేగిపోతున్నార‌నే ఆవేద‌న మన స‌మాజంలో వుంది. ఆయనే బ‌తికి వుండి వుంటే, ఫ‌లానా నాయ‌కులు, మీడియా యాజ‌మానులు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని వుండేవార‌నే మాట నిత్యం వింటూనే వుంటుంటాం.

వైఎస్సార్ జీవించి వుంటే, ప‌చ్చి అబ‌ద్ధాలు వ‌ల్లె వేసే నాయ‌కుల అంతు చూసేవాళ్ల‌ని అనుకోని క్ష‌ణం వుండ‌దు. అందుకే వైఎస్సార్ లేని లోటును ఏ నాయ‌కుడూ పూడ్చ‌లేనిది, తీర్చ‌లేనిది. వైఎస్సార్ అంటే ఒక ధైర్యం, న‌మ్మ‌కం, అన్నింటికీ మించి ప్రేమించే హృద‌యం. అనాథ‌లు, అభాగ్యుల్ని అక్కున చేర్చుకునే కొండంత గుండె. రాజ‌న్నా అని పిలిస్తే, నేను ఉన్నా, నేను విన్నా అని భ‌రోసా ఇచ్చిన జ‌న‌హృద‌యం. ఇప్పుడా హృద‌యం ఒక జ్ఞాప‌కం, స్ఫూర్తిగా మిగిలాయి. వైఎస్సార్ భౌతికంగా మ‌న నుంచి దూర‌మ‌య్యారు. కానీ చాలా ర‌కాలుగా రోజురోజుకూ ప‌త‌నం అవుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం, అలాంటి నాయ‌కుడు మ‌ళ్లీ ఎప్పుడు పుడ‌తారా? అని ఎదురు చూస్తోంది.

ప్ర‌స్తుత నాయ‌కుల‌తో విసిగి, వేసారి పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం వైఎస్సార్ లాంటి నాయ‌క‌త్వం కోసం ఆక‌లిగొంది. రాజ‌కీయంగా వైఎస్సార్ అంటే గిట్టని వాళ్లు ఆయ‌న గురించి ఎన్నైనా విమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ వైఎస్సార్ అనే పేరు లేకుండా ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు లేవంటే, ఆయ‌న ఎంత బ‌ల‌మైన ముద్ర వేశారో అర్థం చేసుకోవ‌చ్చు.

129 Replies to “క‌నుమ‌రుగైపోలేదు రాజ‌న్న‌!”

      1. ఇంత దిగజారి పోయారు రా?? నీ లాంటి బోకు ఎదవ బాస్ వాడెంత బోకు ఏదవో అర్థం అవుతుంది !! అందుకే కు*క్క చావు చచ్చాడు ఎదవ!!

  1. మా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మ దిన  శుభాకాంక్షలు 🎉🎊🎈🎂

          1. ఇంత దిగజారి పోయారు రా?? నీ లాంటి బోకు ఎదవ బాస్ వాడెంత బోకు ఏదవో అర్థం అవుతుంది !! అందుకే కు*క్క చావు చచ్చాడు ఎదవ!!

  2. Give credit to NDA govt also Anna.

    chaka Chaka projects complete chesthunnaru.

    mana Anna okka project kuda complte chailedu.

    CBN KI CREDIT VASTHUNDHI ANUKONI anni projects ni nashanam chesadu.

    jagan Anna could have completed Amaravathi,polavaram,venugondla projects and could have won in 24.

    Anna ado type lo unnadu.

    manam entha etthina next elections lo chala kantamma.

  3. కనుమరుగు అవ్వకుండా చూడానికే కదా మన అన్న అక్రమ సొత్తు కేసులలో YSR నీ కూడా ఇరికించింది

      1. ఇంత దిగజారి పోయారు రా?? నీ లాంటి బోకు ఎదవ బాస్ వాడెంత బోకు ఏదవో అర్థం అవుతుంది !! అందుకే కు*క్క చావు చచ్చాడు ఎదవ!!

  4. చూసావా విచిత్రం…కనుమరుగు అవ్వొద్దు అనే కోర్టు కూడా నిన్న నే నిమ్మగడ్డ ప్రసాద్ కి vanpic కుం””భకోణం లో 200 కో*ట్లు డిపాజిట్ చెయ్యమని చెప్పింది. చేసిన గబ్బు పనులు మాములువు కావు…కనుమరుగు అయ్యే ఛాన్స్ లేదు

  5. నిన్న నే నిమ్మగడ్డ ప్రసాద్ కు vanpic సంబంధించిన డబ్బులు డిపాజిట్ చెయ్యమని చెప్పింది కోర్టు. చేసిన పనులు మామూల్వి కావుగా…అంత తేలికగా కనుమరుగు అయ్యే ఛాన్స్ లేదు

  6. ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉండడం విశేషం..

    లక్ష కోట్లు ఖర్చు చేసారు 5 ఏళ్లలో.. కనీసం ఒక చిన్న ప్రాజెక్ట్ అవలేదు ఆయన హయాంలో..

    అనుమతులు ఏమి లేకుండా పని మొదలు పెట్టడం. తన సన్నిహితులకి గ్రౌండ్ వర్క్ ఇవ్వడం… డబ్బులు నొక్కేయడం తో సరిపోయింది..

    పోలవరం అసలు ఒక్క అనుమతి కూడా లేకుండా కాలువలు పని మొదలు పెట్టారు.  కానీ అవి ఒక్కటి కూడా 25% మించి అవలేదు.. దీనివల్ల ఉపయోగం లేదు.. ప్రజా ధనం వృధా తప్ప.. కాలువలు 75% పనులు టీడీపీ హయాంలో అయ్యాయి.. జగన్ చేసింది కేవలం 3%.

    పురుషోత్తపట్నం ఎత్తిపోతల కూడా టీడీపీ పూర్తి చేసిందే.. ఇప్పుడు అక్కడ నుంచే పోలవరం నీళ్లు ఉత్తరాంధ్ర కి వెళుతున్నాయి..

    అలాగే పట్టిసీమ కూడా బాబు చేసిందే… 

    జలయజ్ఞం లో సగం పైన కేలవం తవ్వకాలు మీద మాత్రమే ఖర్చు పెట్టారు… అసలు ప్రాజెక్ట్ construction మీద పెట్టింది తక్కువ..

    ఇంక వెలిగొండ కూడా అంతే గ్రౌండ్ వర్క్ చేసారు.. TBM అందుబాటులోకి వచ్చింది 2.0.0.7-0.8

    అసలు రెండో టన్నెల్ మొదలు పెట్టింది 2.0.0.9 లో.. వీళ్ళు భజన చేసినట్టు 20 కిలోమీటర్లు వైస్సార్ ఆత్మ తవ్విందా?

    అన్నీ తప్పుడు వార్తలు 

    గాలోడికి కట్టబెట్టిన వేల ఎకరాలు తిరిగి వెనక్కి తీసు కున్నారు 

    1.0.8 మంచి పధకం అయినా అది అతి పెద్ద స్కాం (చూసాము కదా సత్యం ఇరుక్కున్నది  వాళ్ళకే ఇచ్చాడు ఇది )

      1. ఒక అమ్మ కి అయ్యకి పుట్టి ఉంటే నా పోస్ట్ కి నీ దగ్గర వున్న వాస్తవాలు చెప్పు 

      2. ఇంత దిగజారి పోయారు రా??  నీ  లాంటి బోకు ఎదవ బాస్ వాడెంత బోకు ఏదవో అర్థం అవుతుంది !! అందుకే కు*క్క చావు చచ్చాడు ఎదవ!!

      1. జగన్ గెలుస్తాడు ముందు మీ బాబు కొడుకు MLA అవ్వమని చెప్పు ఒంటరిగా పొతే మీ బతుకు ఆలోచన చేసుకో 

  7. కనుమరుగు కాలేదు..నిమ్మగడ్డని ఆయన వర్ధంతి సందర్భం గా 200 కోట్లు డిపాజిట్ చెయ్యమన్నాడు.

  8. పది రూపాయలు ప్రజలకు ఇచ్చి లక్షల కోట్లు కొడుకుకి దోచి పెట్టటం మరచి పోకుండా గుర్తుకు వస్తుంది.

    నీ కుల గజ్జి ఆలా రాయించింది .

    కోట్లు నష్టం లో వున్న హాస్పిటల్స్ కొద్దీ టైములోనే కోట్లకి పడగ లెట్టాయి

    జలయగ్యం అంటే కాలువలలు తవ్వడం ఇచ్చిన మొబైలిసాషన్ అడ్వాన్సలు దొబ్బేసి మాయం ఐపోయారు కాంట్ర్రాక్టర్స్

    ఫీజు రియింబుర్సు్మెంట్ అంతా దగా స్కీమ్ ఇంకొకటి ఉండదు. అప్పటి కాంగ్రెస్ మ్మెల్యే లు అందరూ కాలేజెస్ కట్టెమని షెడ్లు వేసి స్టూడెంట్స్ నంబర్స్ మాయ చేసి వందల కోట్లు తినేశారు. ఇప్పుడు ఆ కాలేజెస్ లేవు

    ఎలక్షన్స్ ముందు ఇల్లు తాకట్టు పెట్టిన రాజన్న , సీఎం ఐన తరువాత వేల కోట్లు సంపాదించేడు, కొడుకు చేత లక్ష కోట్లు మింగావా బెటడు మహా మేత. ఇప్పుడు మహా నేత అంటున్న వాళ్ళందరూ మహా మేత గాళ్ళే..

    పేదలకు మెతుకులు వేసి కడుపులో పుట్టిన పిల్లలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ది క్కు  లేని చా వు చ చ్చా డు.

  9. పది రూపాయలు ప్రజలకు ఇచ్చి లక్షల కోట్లు కొడుకుకి దోచి పెట్టటం మరచి పోకుండా గుర్తుకు వస్తుంది.

    నీ కు ల  గ జ్జి ఆలా రాయించింది .

    కోట్లు నష్టం లో వున్న హాస్పిటల్స్ కొద్దీ టైములోనే కోట్లకి పడగ లెట్టాయి

    జలయగ్యం అంటే కాలువలలు తవ్వడం ఇచ్చిన మొబైలిసాషన్ అడ్వాన్సలు దొబ్బేసి మాయం ఐపోయారు కాంట్ర్రాక్టర్స్

    ఫీజు రియింబుర్సు్మెంట్ అంతా దగా స్కీమ్ ఇంకొకటి ఉండదు. అప్పటి కాంగ్రెస్ మ్మెల్యే లు అందరూ కాలేజెస్ కట్టెమని షెడ్లు వేసి స్టూడెంట్స్ నంబర్స్ మాయ చేసి వందల కోట్లు తినేశారు. ఇప్పుడు ఆ కాలేజెస్ లేవు

    ఎలక్షన్స్ ముందు ఇల్లు తాకట్టు పెట్టిన రాజన్న , సీ ఎం ఐన తరువాత వేల కోట్లు సంపాదించేడు, కొడుకు చేత లక్ష కోట్లు మింగావా బెటడు మ హా మే త. ఇప్పుడు  మహా నేత అంటున్న వాళ్ళందరూ మ హా మే త గాళ్ళే..

    పేదలకు మెతుకులు వేసి కడుపులో పుట్టిన పిల్లలకు వేల కోట్ల రూపాయలు అ క్ర మం గా  సంపాదించి   ది క్కు  లే ని   చా వు  చ చ్చా డు.

  10. బయ్యారం వయ్యారాలు,రింగు రోడ్డు గింగిరాలు, లేపాక్షి లు,vanpinc లు,బ్రహ్మణి స్టీల్ లు, ప్రాజెక్టు లకి అనుమతులు లేకుండా కాలవులు త్రవ్వటాలు..అబ్బో ఇలా చెప్తే పంచె కట్టు పెద్దాయన ఘన కార్యాలు ఎన్నో..ఎన్నెన్నో…

    1. సర్లే పోయినోళ్ళు గురించి చెడుగా మాట్లాడకూడదు అని పోయి బతికి పోయాడు లేదంటే ఈయన గారు చేసిన పనులకి కొడుకు బదులు లోపలకి వెళ్ళేవాడు

    2. అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన

      దొడ్డవారి నెల్లఁ దొలఁగఁ జేయుఁ

      చెప్పుఁ దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా

      విశ్వదాభిరామ వినుర వేమ!

    3. అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన

      దొడ్డవారి నెల్లఁ దొలఁగఁ జేయుఁ

      చె.ప్పుఁ దినెడి కు.క్క చెఱకు తీపెఱుగునా

      విశ్వదాభిరామ వినుర వేమ!

  11. పది రూపాయలు ప్రజలకు ఇచ్చి లక్షల కోట్లు కొడుకుకి దోచి పెట్టటం మరచి పోకుండా గుర్తుకు వస్తుంది.

    కోట్లు నష్టం లో వున్న హాస్పిటల్స్ కొద్దీ టైములోనే కోట్లకి పడగ లెట్టాయి

    జలయగ్యం అంటే కాలువలలు తవ్వడం ఇచ్చిన మొబైలిసాషన్ అడ్వాన్సలు దొబ్బేసి మాయం ఐపోయారు కాంట్ర్రాక్టర్స్

    ఫీజు రియింబుర్సు్మెంట్ అంతా దగా స్కీమ్ ఇంకొకటి ఉండదు. అప్పటి కాంగ్రెస్ మ్మెల్యే లు అందరూ కాలేజెస్ కట్టెమని షెడ్లు వేసి స్టూడెంట్స్ నంబర్స్ మాయ చేసి వందల కోట్లు తినేశారు. ఇప్పుడు ఆ కాలేజెస్ లేవు

    ఎలక్షన్స్ ముందు ఇల్లు తాకట్టు పెట్టిన రాజన్న , సీఎం ఐన తరువాత వేల కోట్లు సంపాదించేడు, కొడుకు చేత లక్ష కోట్లు మింగావా బెటడు మహా మేత. ఇప్పుడు మహా నేత అంటున్న వాళ్ళందరూ మహా మేత గాళ్ళే..

    పేదలకు మెతుకులు వేసి కడుపులో పుట్టిన పిల్లలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి దిక్కుమొక్కు లేని చా వు చ చ్చా డు.

  12. పేదలకు మెతుకులు వేసి కడుపులో పుట్టిన పిల్లలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి దిక్కుమొక్కు లేని చా వు చ చ్చా డు.

  13. పేదలకు మెతుకులు వేసి కడుపులో పుట్టిన పిల్లలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ది క్కు మొ క్కు లేని చా వు చ చ్చా డు.

  14. సర్లే పోయినోళ్ళు గురించి చెడుగా మాట్లాడకూడదు అని పోయి బతికి పోయాడు లేదంటే ఈయన గారు చేసిన పనులకి కొడుకు బదులు లోపలకి వెళ్ళేవాడు (కొడుకు అవన్నీ చేసింది మా అయ్యా నాకు సంబంధం లేదు అని తప్పించుకుంటున్నాడు) 

  15. మ*హామేత గాడు అప్పుడే ఎలా కనుమరుగు అవుతాడు, వాడు వాడి సై*కో కొడుకు రాష్ట్ర ప్రజల సొమ్ము దొ*బ్బి తిన్న కేసులో శిక్ష పడకుండా ఎలా వదిలేస్తారు ప్రజలు ఎలా మర్చిపోతారు?? వాడు చేసిన పా*పాలకి, ఘో*రాలకి చివరకి కుక్క చావు చచ్చినా ప్రజలు సై*కో గాడికి శిక్ష పడే వరకు వదిలి పెట్టరు!!

  16. మ*హామేత గాడు అప్పుడే ఎలా కనుమరుగు అవుతాడు, వాడు వాడి సై*కో కొడుకు రాష్ట్ర ప్రజల సొమ్ము దొ*బ్బి తిన్న కే*సులో శి*క్ష పడకుండా ఎలా వదిలేస్తారు ప్రజలు ఎలా మర్చిపోతారు?? వాడు చేసిన పా*పాలకి, ఘో*రాలకి చివరకి కు*క్క చా*వు చ*చ్చినా ప్రజలు సై*కో గాడికి శి*క్ష పడే వరకు వదిలి పెట్టరు!!

  17. మ*హామేత గాడు అప్పుడే ఎలా కనుమరుగు అవుతాడు, వాడు వాడి సై*కో కొ*డుకు రాష్ట్ర ప్రజల సొ*మ్ము దొ*బ్బి తిన్న కే*సులో శి*క్ష పడకుండా ఎలా వదిలేస్తారు ప్రజలు ఎలా మర్చిపోతారు?? వాడు చేసిన పా*పాలకి, ఘో*రాలకి చివరకి కు*క్క చా*వు చ*చ్చినా ప్రజలు సై*కో గాడికి శి*క్ష పడే వరకు వదిలి పెట్టరు!!

  18. సొంత కొడుకు మా నాన్న పెద్ద దొం*గ నా కొ ** అని కో*ర్ట్ లో అ*ఫిడవిట్ వేసిన గొప్ప కుటుంబం మ*హామేత గాడిది!! దొ*బ్బిన ప్రజల సొమ్ము కోసం త*ల్లి షె*ల్లీ ని కో*ర్ట్ కి లాగిన గొప్ప కుటుంబం!! రాష్ట్రానికి పట్టిన చీ*డ మ*హామేత గాడి ఫ్యా*మిలీ!!

  19. సొం?*త కొ*డుకు మా నాన్న పె*ద్ద దొం*గ నా కొ ** అని కో*ర్ట్ లో అ*ఫిడవిట్ వేసిన గొప్ప కుటుంబం మ*హామేత గాడిది!! దొ*బ్బిన ప్రజల సొ*మ్ము కోసం త*ల్లి షె*ల్లీ ని కో*ర్ట్ కి లాగిన గొప్ప కుటుంబం!! రాష్ట్రానికి పట్టిన చీ*డ మ*హామేత గాడి ఫ్యా*మిలీ!!

  20. ప్రాజెక్టులకు అనుమతులు రాకముందే కమిషన్ల కోసం కాలువలు త్రవ్వించిన ఘనుడు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా పూర్తి చేయలేదు. ప్రాజెక్టు నిర్మించిన ఐదేళ్లకే పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. అదే దాదాపు 80 ఏళ్లు గడిచినా నాగార్జునసాగర్ గేట్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.

  21. GA, కొ.-.డు.-.కుకి బాకా ఊదితె ఎవ్వరూ నమ్మటం లెదు అనుకున్నాడొ ఎమో, అయ్యకు బాకా ఊదటం మొదలు పెట్టడు! అలా అన్న కొ.-.డు.-.కు కి కలవస్తుంది ఏమొ అన్న చిన్న ఆశ కాబొలు!

    .

    అసలు రాజశెకర్ రెడ్డి అంత అవినీతి పరుడు ఈ రాష్ట్రం లొ మరెవ్వరూ లేరు! ఆయన చనిపొయాక కూడా అయన పిల్లలు ఆ పాపిష్టి సొమ్ము కొసమె కొట్టుకుంట్టున్నారు!

  22. ఇక జగన్ పని అయిపొయింది అని అందరూ ఒక నిర్ణయనికి వచ్చేసారు! జగన్ మూర్గుడు అన్న మాగుంట వ్యఖ్యతొనె అది అర్ధం అవుతుంది.

    .

    దీనికి కారణం కూడా జగనె అంటున్నారు! రాజదాని, DSC విషయం లొ నేను పట్తిన కుందెలుకు మూడె కాలు అన్నట్తు వ్యవహరిచం, కూటమి చెస్తున్న ప్రతి అబిరుద్దిని, కంపనీని నెనె తెచ్చాను అని సిగ్గు విడిచి చెప్పుకుంటూ అదె నిజం ని బులుగు మీడియా చేత ప్రచారం చెయించి నవ్వుల పాలు అవ్వటం.

    ఇక లిక్కర్ అవినీతి, కల్తీ తిరుపతి లడ్డు అవినీతిలొ దొరికిపొవటం, A-2 రం.-.కు మొగుడుగా తయారు అవ్వటం, జగన్ తల్లి చెల్లి నుండి ఎ సపొర్ట్ లెకపోవటం తొ Y.-.C.-.P కి దిక్కుతొచటం లెదు!

    .

    గత అనుభవాలతొ కుటమి సముక్యం గా పనిచెయటం, సంగ్షెమం తొ పాటు అబిరుద్ది కూడా చూపించటం, రాజదాని పొలవరం లొ పనులు మొదలు అయ్యి ఒక ఒడ్దున పడతాము అన్న నమ్మకం రావటం, బారీగా రాష్ట్రనికి పెట్టుబడులు రావాటం, నలుగొ సారి కూడా మోడినె వస్తాడు అన్న సంకెతాలు రావటం, ఇన్ని ప్రతికూలతల మద్య ఇక జగన్ రావటం సాద్యంకాని పనిగానె నాయకులు నమ్ముతున్నారు!

  23. ఇక జగన్ పని అయిపొయింది అని అందరూ ఒక నిర్ణయనికి వచ్చేసారు! జగన్ మూర్గుడు అన్న మాగుంట వ్యఖ్యతొనె అది అర్ధం అవుతుంది.

    .

    దీనికి కారణం కూడా జగనె అంటున్నారు! రాజదాని, DSC విషయం లొ నేను పట్తిన కుందెలుకు మూడె కాలు అన్నట్తు వ్యవహరిచం, కూటమి చెస్తున్న ప్రతి అబిరుద్దిని, కంపనీని నెనె తెచ్చాను అని సిగ్గు విడిచి చెప్పుకుంటూ అదె నిజం ని బులుగు మీడియా చేత ప్రచారం చెయించి నవ్వుల పాలు అవ్వటం.

    ఇక లిక్కర్ అవినీతి, కల్తీ తిరుపతి లడ్డు అవినీతిలొ దొరికిపొవటం, A-2 రం.-.కు మొగుడుగా తయారు అవ్వటం, జగన్ తల్లి చెల్లి నుండి ఎ సపొర్ట్ లెకపోవటం తొ Y.-.C.-.P కి దిక్కుతొచటం లెదు!

    .

    గత అనుభవాలతొ కుటమి సముక్యం గా పనిచెయటం, సంగ్షెమం తొ పాటు అబిరుద్ది కూడా చూపించటం, రాజదాని పొలవరం లొ పనులు మొదలు అయ్యి ఒక ఒడ్దున పడతాము అన్న నమ్మకం రావటం, బారీగా రాష్ట్రనికి పెట్టుబడులు రావాటం, నలుగొ సారి కూడా మోడినె వస్తాడు అన్న సంకెతాలు రావటం, ఇన్ని ప్రతికూలతల మద్య ఇక జగన్ రావటం సాద్యంకాని పనిగానె నాయకులు నమ్ముతున్నారు!

  24. కనీసం నువ్వు రాసినంత ఆర్టికల్ కూడా సాక్షి పేపర్ లో రాయలేదు. మొదటి పేజీ నుంచి రెండవ పేజీ లో సింపుల్ గా సింగల్ కాలంలో రాసారు.

  25. వైఎస్ఆర్ లేకపోవడమే జగన్‌కి ఉన్న బ్యాడ్ క్వాలిటీ, అదే కాకుండా విపరీతమైన డబ్బు పిచ్చి, అదే వైఎస్ఆర్ ఉంటే షర్మిలని, విజయమ్మని అలా వదిలేసేవాడా? అదే వైఎస్ఆర్ ఉంటే వివేకానంద రెడ్డి హత్య చేయబడేవాడా? అదే వైఎస్ఆర్ ఉంటే కేసీఆర్, జగన్, రేవంత్, మళ్లీ చంద్రబాబు నాయుడు ఎవరూ సీఎంలు అయ్యేవారు కాదు, జనసేన పార్టీ వచ్చేదే కాదు. అందుకే జగన్‌ని వైఎస్ఆర్‌తో పోల్చకండి, వైఎస్ఆర్ స్థాయే వేరు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి నాయకులు మళ్లీ పుట్టరు.

  26. రాష్ట్ర విభజనకి కారణమైన వైస్సార్ ని మరచిపోలేము. 2001 లో తెలంగానా కి అనుకూలంగా సోనియా గాంధీకి ఉత్తరం రాయడం నుండి 2004 లో తెరాస తో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీచేయడం అలాగే 2009 లో ఆంధ్రా ఎంపీ/ఎంఎల్యే సీట్ ల గురించి కాంగ్రెస్ అధిష్టానానికే ఆదేశాలు ఇవ్వడం దాని వలన కాంగ్రెస్ అధిష్టానానికే కోపం వచ్చి రాష్ట్ర విభజనకు పచ్చ జెండా ఊపడం. ఇవన్నీ కలిసి రాష్ట్ర విభజనకి దారి తీయడం. అందుకేగా అనేది చెడపకురా చెడేవు అని. ఆయన పోయారు మనం అనుభవిస్తున్నాము.

Comments are closed.