జ‌న‌సేన‌ను ఆడుకుంటున్న టీడీపీ సోష‌ల్ మీడియా

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పుణ్య‌మా అని టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పుణ్య‌మా అని టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. జ‌న‌సేన‌ను టీడీపీ సోష‌ల్ మీడియా ఫుట్‌బాల్ ఆడుకుంటోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

తిరుప‌తి కార్పొరేష‌న్‌లో పోటీ చేయాల‌ని జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి కీర్త‌న భావించారు. అయితే జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త రాజ‌కీయాల కార‌ణంగా ఆమెకు మొద‌ట్లో టికెట్ దొర‌క‌లేదు.

ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. చివ‌రికి సొంత డివిజ‌న్‌లో కాకుండా, ఇంకో చోట ఆమెకు టికెట్ ఖ‌రారైంది.

40వ డివిజ‌న్ నుంచి నామినేష‌న్ వేశారు. అంతా సుఖాంతం అనుకుంటున్న త‌రుణంలో ఆమెకు గ‌ట్టి షాక్ త‌గిలింది. కీర్త‌న నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

కీర్త‌న పోటీ చేస్తున్న 40వ డివిజ‌న్ ఓట‌ర్‌కు బ‌దులు, ఇంకొక‌రు ప్ర‌తిపాదించ‌డంతో నామినేష‌న్‌ను అధికారులు తిర‌స్క‌రించారు. అయితే త‌మ వాళ్ల నామినేష‌న్ల‌ను టీడీపీ వాళ్లే ప‌నిగ‌ట్టుకుని, తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేలా చేస్తున్నారంటూ జ‌న‌సేన సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం మొద‌లు పెట్టింది.

ఈ సంద‌ర్భంగా ఇత‌ర చోట్ల తిరస్క‌ర‌ణ‌కు గురైన జ‌న‌సేన అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను కూడా ఉద్దేశ పూర్వ‌కంగా చేశారంటూ ఆ పార్టీ ప్ర‌చారం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎదురు దాడికి దిగింది. క‌నీసం నామినేష‌న్ ఎలా వేయాలో తెలియ‌కుండా, త‌మ‌పై ప‌డి ఏడిస్తే లాభం ఏంటంటూ టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. క‌నీసం ఒక మంచి లాయ‌ర్‌ను పెట్టుకుని నామినేష‌న్ వేయాల‌న్న ఇంగితం కూడా అధికార ప్ర‌తినిధికి లేక‌పోతే తామేం చేయాలంటూ టీడీపీ ఓ రేంజ్‌లో ఉతికి ఆరేస్తోంది.

టీవీ చానెల్స్‌లో త‌ప్ప‌, జ‌నంలో క‌నిపించ‌ని కీర్త‌న లాంటి వారిని అధికార ప్ర‌తినిధులుగా పెట్టుకుంటే ఇంత‌కంటే ఏం జ‌రుగుతుంద‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

మీ అజ్ఞానానికి త‌మ‌ను బాధ్యుల్ని చేసి, ఇష్టానుసారం సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకోమ‌ని టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు గ‌ట్టిగానే చుర‌క‌లు అంటిస్తున్నారు. త‌న నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌పై వీర మ‌హిళ‌న‌ని చెప్పుకునే కీర్త‌న మాత్రం కిక్కురుమ‌న‌డం లేదు.

5 Replies to “జ‌న‌సేన‌ను ఆడుకుంటున్న టీడీపీ సోష‌ల్ మీడియా”

  1. మా టీడీపీ నాయకుల కి తెలిసిందే ఎగబడటం. అది వైసీపీ పైనా లేక జనసేన పైనా లేక ఇండిపెండెంట్ పైనా అనేది సంబంధం లేదు – ఎమ్మెల్యే ఎగబడమని చెప్పడం, గొర్రెల్ల మాదిరి పడిపోవటమే, అందులో చదువుకున్నొడికి, చదువులేనొడికి తేడా ఉండదు.

Comments are closed.