తిరుమల అంటే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. ఏడుకొండలపై గోవింద నామస్మరణ తప్ప, మరే నినాదం వినిపించకూడదు. కానీ కొన్ని నెలలుగా ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏవైతే జరగకూడదో, అవన్నీ జరుగుతున్నాయి. దీంతో హిందువుల మనోభావాలు తెబ్బతింటున్నాయి. నిత్యం భక్తుల మనసుల్ని గాయపరిచే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సరిదిద్దుకోకపోగా, ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని నింద వైసీపీపై వేసి రాజకీయం చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది.
రెండు రోజుల క్రితం తిరుమలలో తమిళనాడుకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం కలకలం సృష్టించింది. ఇదేందయ్యా అని పౌర సమాజం ప్రశ్నిస్తే, ఇదంతా వైసీపీ చేయిస్తోందని స్థానిక టీటీడీ బోర్డు సభ్యుడు నోరు పారేసుకున్నాడు. ఆ మరుసటి రోజే ఏకంగా ముగ్గురు ఏఆర్ పోలీసులు తప్పతాగి, తిరుమలలో నానాయాగీ చేశారు. ఇష్టానుసారం కొండపై వాహనాన్ని నడుపుతూ, ఇతర వాహనాలను ఢీకొట్టారు.
కనురెప్పే కాటు వేసిన చందంగా ఈ వ్యవహారం వుంది. ముగ్గురిని సస్పెండ్ చేశారు. దెబ్బతిన్న భక్తుల మనోభావాల సంగతేంటనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం వుంది. తిరుమలలో ఒకట్రెండు అపశ్రుతులు చోటు చేసుకుంటే, పొరపాటైందని సరిపెట్టుకోవచ్చు. కానీ రూపం మార్చుకుంటూ అపశ్రుతులు పదేపదే దొర్లుతుంటే, వాటిని క్షమించరాని తప్పులుగా పరిగణించాల్సి వుంటుంది.
వీటన్నింటికి కారణం… తిరుమలలో పాలనా వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడమే అనే విమర్శ వెల్లువెత్తుతోంది. తిరుమలలో అధికారిక వ్యవస్థ ఏం చేస్తున్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కేవలం వీవీఐపీలు, వీఐపీలకు దర్శనాలు చేయించడం ఒక్కటే తమ కర్తవ్యంగా భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవుడంటే భయభక్తులుంటే ఇలా అపశ్రుతులు జరిగేవి కాదని భక్తులు అంటున్నారు. తిరుమల వ్యవహారంలో అధికార యంత్రాంగం, పాలక మండలి అనుసరిస్తున్న తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది.

భూమన ను పట్టుకొంటే అన్నీ అపచారాలు ఆగిపోతాయి
ఇలాంటి అపశృతులు ఆగాలంటే అన్న రావాల్సిందే.. అంతేనా GA గారూ
If you are hearing something first time in ycheap channel, then its staged…why would a muslim offer namaz in tirumala unless he is living there?
“దెబ్బతిన్న భక్తుల మనోభావాల సంగతేంటనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం వుంది.”..wait and watch..IVR, telakapalli, Mundavalli, snakeswar will come out and demanding explanation..:-p
టీటీడీ ఉద్యోగ ల్లోఇంకా వాటికన్ గొర్రె బిడ్డలు ఉన్నారు.