ఆ ఇద్దరి మీద అనుమానాలు

వైసీపీలో ఉత్తరాంధ్ర మొత్తానికి గెలిచింది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి శాసనసభ్యులు అయ్యారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఉన్నారు. ఈ…

వైసీపీలో ఉత్తరాంధ్ర మొత్తానికి గెలిచింది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి శాసనసభ్యులు అయ్యారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఉన్నారు. ఈ ఇద్దరూ వైసీపీకి నిబద్ధత కలిగిన వారుగా విధేయులుగా కొనసాగుతున్నారు..ప్రతిపక్షంలో ఉన్నా తమ నియోజకవర్గంలో సమస్యల విషయంలో వీరు పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ అన్ని విధాలుగా మమేకం అవుతున్నారు.

అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్తారు అంటూ తరచూ ప్రచారం సాగుతోంది. అందులో ఉత్తరాంధ్ర నుంచి ఒకరు జంప్‌ అని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మరి గెలిచిన ఈ ఇద్దరిలో ఎవరు అన్నది వైసీపీ కేడర్‌లో అనుమానం పెంచేలా చేస్తున్నారు.

అయితే తాము వైసీపీని వీడేది లేదని వీరు ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. పైగా వైసీపీని వీడిన వారు ఎన్నికలలో ఓటమిపాలు అవుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు.

గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత పార్టీ మారి మళ్లీ గెలవలేదు, అలాగే పాడేరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయిన గిడ్డి ఈశ్వరి కూడా గత రెండు ఎన్నికలలోనూ ఓటమి పాలు అయ్యారు. ఇవన్నీ తెలిసి కూడా పార్టీ మారేది లేదు అన్నది వైసీపీ వర్గాల మాట. కానీ ప్రచారం మాత్రం అలా చేస్తూనే ఉన్నారు.

8 Replies to “ఆ ఇద్దరి మీద అనుమానాలు”

  1. వెనకబడిన వర్గాల ప్రతినిధి ఎమ్మెల్యే ల మీదే నీ అనుమానం..

    .

    గెలిచిన 11 లో ఆరు రెడ్డి ఎమ్మెల్యే ల మీద అస్సలు అనుమానం లేదు కదా..

  2. లోకేశ్ టార్గెట్ నుంచి త‌ప్పించుకోవడానికి చంద్ర‌బాబుని మెప్పించ‌డానికి తెగ తాప‌త్ర‌య ప‌డుతున్నావు. కానీ ఒక లాజిక్ మిస్ అవుతున్నావు.. ఏంటో చెప్పుకో చూద్దాం

Comments are closed.