రెండేళ్లు.. 2 సినిమాలు.. సేమ్ మిస్టేక్

2023.. స్పై మూవీ. 2024.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ రెండు సినిమాలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియదు చాలామంది ప్రేక్షకులకి. అలా రెండేళ్లలో 2 ఫ్లాపులిచ్చాడు నిఖిల్. ఈ క్రమంలో అతడు…

2023.. స్పై మూవీ. 2024.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ రెండు సినిమాలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియదు చాలామంది ప్రేక్షకులకి. అలా రెండేళ్లలో 2 ఫ్లాపులిచ్చాడు నిఖిల్. ఈ క్రమంలో అతడు చేసిన తప్పే మళ్లీ చేశాడు.

కార్తికేయ-2 పెద్ద హిట్టయింది. ఆ సినిమా తర్వాత వస్తున్న స్పై మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ హీరోకు, నిర్మాతకు మధ్య చిన్న చిన్న అభిప్రాయబేధాలొచ్చాయి. మొత్తానికి నిర్మాత అనుకున్న తేదీకి సినిమా లాక్ అయింది.

ప్రారంభంలో మొరాయించినప్పటికీ, ఆ తర్వాత కాస్త చురుగ్గానే ప్రచారంలో పాల్గొన్నాడు నిఖిల్. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్పై సినిమా ఫ్లాప్ అయింది.

2024.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ సినిమా విషయంలో కూడా అదే మిస్టేక్ రిపీట్ చేశాడు నిఖిల్. ఇక్కడ కూడా రిలీజ్ డేట్ సడెన్ గా ఊడిపడింది. బహుశా నిఖిల్ కు ఇది నచ్చలేదేమో. స్పై సినిమాకు చేసినట్టే, ఈ సినిమాకు కూడా ప్రారంభంలో ప్రచారం చేయలేదు.

ఆ తర్వాత లేట్ గా సీన్ లోకి వచ్చాడు. గ్రౌండ్ ఈవెంట్స్ చేయకపోయినా ఇంటర్వ్యూలిచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా రిలీజైనట్టు కూడా చాలామందికి తెలియదు. కార్తికేయ-2 తర్వాత నిఖిల్ కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ఇది నిలిచింది.

ఇలా ఒకే తప్పును రెండేళ్ల పాటు, రెండు సార్లు రిపీట్ చేసి, రెండు ఫ్లాపులు తెచ్చుకున్నాడు నిఖిల్. అతడు కాస్త గట్టిగా ప్రచారం చేసినట్టయితే, కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చి ఉండేవి. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ స్వయంభూ సినిమాపైనే ఉన్నాయి.

6 Replies to “రెండేళ్లు.. 2 సినిమాలు.. సేమ్ మిస్టేక్”

Comments are closed.