ఉత్తరాంధ్రలోని సీట్లు అన్నీ గుత్తమొత్తంగా టీడీపీ కూటమి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సొంతం చేసుకుంది. ఏకంగా ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లకు గానూ ముప్పయి రెండును దక్కించుకుంది. అయిదు ఎంపీ సీట్లు ఉంటే నాలుగు కూటమికే లభించాయి. మెజారిటీలు చూస్తే భారీ స్ధాయిలో కట్టబెట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కూటమిని అధికారంలోకి తెచ్చారు. అయిదు నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఆ ప్రాంతానికి చేసినది ఏమిటి అన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతోంది.
హామీలతో కాలం గడుపుతున్నారు తప్ప ఆచరణలో ఏమీ నోచుకోవడంలేదని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు సాగు తాగు నీరు కోసం పోలవరం ఎడమ కాలువను మలుపు తిప్పి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఎందుకు పట్టాలెక్కించరన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు స్ధాపనకు సహజ సిద్ధమైన వనరులు మానవ వనరులు ఎన్నో ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోవడంలేదని కూడా విమర్శలు ఉన్నాయి.
ఇటీవల రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఆయన శ్రీకాకుళం, అనకాపల్లి విశాఖ జిల్లాల పర్యటనలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవన్నీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇచ్చినవే అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగవళి బహుదా నదులను అనుసంధానం చేయడం ద్వారా సాగు తాగు నీటికి కొరత లేకుండా చేయవచ్చును. కానీ ఈ విషయంలో అడుగు ముందుకు పడడంలేదు అన్నది ప్రజల ఆవేదన.
అలాగే జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. దేశంలోనే కాదు గల్ఫ్ దేశాలలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లావాసులే ఉపాధి కోసం వెళ్లిన వారు కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమల స్ధాపన చేస్తామని గతంలోనూ టీడీపీ పెద్దలు చెప్పారు. కానీ ఏదీ జరగడంలేదు. ఇపుడు చూస్తే మూలపేటలో పదివేల ఎకరాలలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ కారిడార్ వల్ల బడా పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టడం వారు వాటిని బ్యాంకులలో తాకట్టు పెట్టి రుణాలు పొందడం తప్ప పరిశ్రమలు ఎవరూ ఏర్పాటుచేసింది లేదని అంటున్నారు. ఇందుకు అనకాపల్లి, కాకినాడ పారిశ్రామిక కారిడార్‌లు ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు వేల ఎకరాలలో విమానాశ్రయం ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పట్ల కూడా చర్చ సాగుతోంది. దీనివల్ల సామాన్యులకు ఒనగూడేది ఏమీ లేదని పైగా రైతుల భూములను పెద్ద ఎత్తున సేకరించడం ద్వారా వారి ఉపాధి కూడా పోతుందని అంటున్నారు. ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టకుండా పెద్దల కోసం ఎయిర్‌పోర్టుల నిర్మాణం వల్ల వలసలు పోయేవారికి లభించేది ఏమీ లేదని అంటున్నారు.
విశాఖ జిల్లాలోనూ ఇవే హామీలు ముఖ్యమంత్రి ఇచ్చారు. విశాఖ విజయనగరం అనకాపల్లిలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. మెట్రో రైలు ప్రాజెక్టు అన్నది కూడా ఆయన నోటి వెంట వచ్చింది. ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మెట్రో రైలు ప్రాజెక్టు దివంగత వైఎస్సార్ సమయం నుంచి ఉన్నదే. అది ఇప్పటికీ కాగితాల మీదనే ఉంది. అలాగే ఉత్తరాంధ్రలోని జిల్లాలను కలుపుతామని హైదరాబాద్‌కు సరిసాటిగా విశాఖను చేస్తామని ముఖ్యమంత్రి మరో మాటచెప్పారు. తనకు ఇష్టమైన నగరం విశాఖ అన్నారు. ఇలా ముఖ్యమంత్రి పర్యటనలో హామీలకే పరిమితం అవుతున్నారన్న మాట ఉంది.
అదే సమయంలో విశాఖలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తే దానిని అమరావతికి తరలించుకుపోవడాన్ని కూడా ఉత్తరాంధ్ర వాసులు తప్పుపడుతున్నారు. విశాఖ ఈ రోజుకూ ఆంధ్రలో పెద్ద నగరమని చాలాకాలం క్రితమే రిజర్వు బ్యాంకు విశాఖను తన కార్యాలయానికి ఎంచుకుందని దానిని మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం వద్ద సరైన కార్యాచరణ ప్రణాళిక ఉందా అని ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకునే ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి.
అనకాపల్లి వద్ద మిట్టల్ సంస్ధ ఆధ్వర్వంలో ప్రైవేటుగా స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారని పేర్కొంటున్నారు. మరో స్టీల్ ప్లాంట్ విశాఖ జిల్లాకు వస్తే మంచిదే కానీ భారీ కర్మాగారంగా ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పష్టమైన ప్రకటన టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు అతి పెద్ద ఉపాధి కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ఉందని, అది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్లనే అనుబంధ పరిశ్రమలు అనేకం ఏర్పాటై వేలాదిగా ప్రజలకు ఉపాధి దక్కుతోందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలో గట్టిగా చెప్పి ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకున్నట్లుగా ప్రకటన ఇప్పించాలని డిమాండు చేస్తున్నారు.
ఇక విశాఖను ఆర్ధిక రాజధాని అని పర్యాటక రాజధాని, సీనీ హబ్ అని అనేక రకాలుగా కీర్తిస్తూ గతం నుంచి ఇప్పటిదాకా ప్రకటనలే ఇచ్చారు తప్ప ఆచరణలో ఏదీ జరగలేదని కూడా గుర్తు చేస్తున్నారు. ఐటి రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని చెబుతున్నా అది కూడా పెద్దగా సాకారం కావడంలేదని పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా పెద్దగా జనంలో ఆశలను పెంచలేకపోయారన్నది వాస్తవం అన్న విశ్లేషణలు ఉన్నాయి.
Call boy jobs available 9989793850
relaince energy 63000 cr investements planned in next coming years
వైసిపిలాగా దోపిడీ చెయ్యకుండా వుంటే ఉత్తరాంధ్ర అదే డవలప్ అవుతుంది మీ దొంగ ఏడుపులు,దగుల్బాజీ రాజకీయాలు పట్టిచ్చుకునే వారు ఎవరూ లేరు
మీలా దోపిడీ చెయ్యకుండా వుంటే అదే డావలప్ అవుతుంది
vc available 9380537747
దమ్ముంటే ఉత్తరాంధ్ర ఐక్య పోరాటం చెయ్యాలి.అవసరమైతే కే జీ హెచ్ లో చేరి పులి నోట్లో తల పెట్టాలి..ఏ నాయకుడికైనా దమ్ముందా?