Advertisement

Advertisement


Home > Politics - National

భక్తుల్ని రానివ్వకుండా.. దీపాలు వెలిగించమంటారా?

భక్తుల్ని రానివ్వకుండా.. దీపాలు వెలిగించమంటారా?

రామజన్మభూమిగా భావిస్తున్న చోట ఇవాళ ఒక అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నదంటే.. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ చాలా గర్వంగా ప్రారంభిస్తున్నారంటే.. ఆ క్రెడిట్ ఏ ఒక్కరిదో అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజు ఎవరెవరైతే ఆ క్రెడిట్ ను క్లెయిం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో.. ఘనత వారిది మాత్రమే కాదు.

అప్పట్లో బాబ్రీ కట్టడాన్ని కూల్చివేయడానికి ‘కరసేవ’కు పిలుపు ఇచ్చి సారథ్యం వహించి.. కొన్ని దశాబ్దాల పాటు కోర్టు కేసులను ఎదుర్కొన్న ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి పెద్దలది మాత్రమే అని కూడా చెప్పడానికి వీల్లేదు. అక్కడ కరన్యాస్ చేయాలంటే.. దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది కరసేవకులకే ఆ ఘనత దక్కుతుంది.

వారిని అప్పట్లో మతం నడిపించిందా? భక్తి నడిపించిందా? ఉన్మాదం నడిపించిందా? రాజకీయ భావజాలం నడిపించిందా? ఇదంతా వేరే చర్చ. కానీ.. అన్ని లక్షల మంది ఆరోజు అయోధ్యకు పోటెత్తివెళ్లారు. అక్కడ పాల్గొన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అయోధ్యను చేరుకునే అన్ని మార్గాలను అప్పట్లో పోలీసులు మూసివేసేసి ఆంక్షలు పెట్టినప్పటికీ.. లక్షల మంది కాలి నడకన.. దొంగచాటుగా నానా అవస్థలు పడి బాబ్రీ కట్టడం వద్దకు వెళ్లి.. ఇవాళ నిర్మాణం పూర్తవుతున్న ఆలయానికి అప్పట్లో తొలి అంకాన్ని తమ స్వేదంతో, పట్టుదలతో లిఖించారు.

కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి..? దేశం నలుమూలల నుంచి భక్తులు ఎవ్వరూ 22న అయోధ్యకు రావొద్దు అని అక్కడి నిర్మాణ ట్రస్టు పిలుపు ఇస్తోంది. ఇప్పుడు వారికి సెలబ్రిటీలు మాత్రమే ఆలయం వద్దకు ఆరోజున రావాలనే కోరిక ఉంది.  ఇప్పుడు వారికి సామాన్య భక్తులు కానివారు, పనికిరానివారు అయిపోయారు.

అయోధ్యలో 22వ తేదీన ఒక్కో హోటలు గది అద్దె లక్ష ధర పలుకుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ వాటిని కూడా భక్తులు బుక్ చేసుకోకుండా ఆంక్షలు పెడుతున్నారట. బుకింగ్స్ ను కూడా క్యాన్సిల్ చేస్తున్నారట. భక్తులు ఎవ్వరూ రావొద్దని చెబుతున్నారట.

మరోవైపు ప్రధాని.. ఆరోజున దేశమంతి ప్రతి ఒక్కరూ ఇళ్లలో దీపాలు వెలిగించండి అని పిలుపు ఇస్తున్నారు. అది ఓకే. అదొక రకమైన ఉద్వేగాన్ని ప్రజల్లో కలిగించవచ్చు. కానీ భక్తులు అయోధ్య రావొద్దని అనడం ఎంతవరకూ సబబు అనేది ఇప్పుడు చర్చ. లక్షల మంది కరసేవలో పాల్గొనక పోతే ఇవాళ ఈ ఘట్టమే లేదు. కానీ.. వారిని కించపరిచేలా, అవమానించేలా.. రాముడిని ఇవాళ సెలబ్రిటీ పరం చేసేస్తున్నారు.

ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చిన.. భద్రత ఏర్పాట్లు వారికి వసతి , భోజన సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పవలసిన వారు.. అసలు రానేవద్దని చెప్పడం చాలా దారుణం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?