Advertisement

Advertisement


Home > Politics - National

మోడీ ఛాతీ కంటె అయోధ్యరాముడు చిన్నవాడే!

మోడీ ఛాతీ కంటె అయోధ్యరాముడు చిన్నవాడే!

అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహం ఏర్పాటుచేసి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఇందుకోసం దేశవిదేశాల అనుంచి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. ఆరోజున అయోధ్య రాముడిని దర్శించుకోవాలని తహతహలాడే సామాన్య భక్తులు అక్కడకు రావడం గురించి అనేక ఆంక్షలున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు కాగా, రామాలయంలో ప్రతిష్ఠించడానికి ప్రత్యేకంగా తయారుచేయించిన మూడు విగ్రహాలలో ఒకదానిని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు.

మొత్తానికి ట్రస్ట్ నిర్వాహకులు 51 అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో ఉండే రాముడి విగ్రహాన్ని అయోధ్య గర్భాలయంలో ప్రతిష్ఠించడానికి తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయోధ్య రాముడి ఎత్తు.. ప్రధాని మోడీ ఛాతీ కంటె తక్కువే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధాని మోడీ చాలా సందర్భాల్లో తనది 56 అంగుళాల ఛాతీ అని, తనను ఎవ్వరూ బెదిరించలేరని అంటూ ఉంటారు. ఆయన వందిమాగధులంతా కూడా.. తమ నాయకుడి ఛాతీ 56 అంగుళాలని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు.. అయోధ్య రాముడి గర్భాలయంలో ప్రతిష్ఠించే విగ్రహం కేవలం 51 అంగుళాల ఎత్తు అనే సంగతి రాగానే.. మోడీ ఛాతీ కంటె తక్కువే అనే మాట కూడా వినిపిస్తోంది.

కాగా మరో వివరం ఏంటంటే.. అయోధ్యలో ప్రతిష్టించబోయేది.. బాలరాముడి విగ్రహం అట. అయిదేళ్ల వయసులోని బాలుడిగా రాముడు పద్మంపై కూర్చుని ఉన్నట్టుగా ఈ విగ్రహం ఉంటుందిట. ఈ బాలరాముడు విల్లంబులు కూడా ధరించి ఉంటాడుట. ముగ్గురు శిల్పులతో వేర్వేరుగా మూడు విగ్రహాలను తయారు చేయించిన ఈ ట్రస్ట్ నిర్వాహకులు అంతిమంగా ఒకదానిని ఎంపిక చేశారు.

జనవరి 17 నుంచి విగ్రహప్రతిష్ఠాపన పనులు మొదలవుతాయి. 21న విగ్రహం సంప్రోక్షణ చేస్తారు.22 ఉదయం విగ్రహ ప్రాణప్రతిష్ఠం ఉంటుంది. అయోధ్య రామాలయం ఎంతో సుందరంగా రూపుదిద్దుకుంటోంది. బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వరకు ఓకే. కానీ, ఆ చిన్న విగ్రహాన్ని భక్తులు 36 అడుగుల దూరం నుంచి మాత్రమే చూడాలన్నట్టుగా నిర్ణయించడం విమర్శలకు గురవుతోంది. ఆలయ ట్రస్ట్ పెద్దలు కనీసం భక్తులకు మంచి దర్శనం కల్పించే దిశగా పునరాలోచన చేయగలరేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?