Advertisement

Advertisement


Home > Politics - National

అయోధ్య అక్షింతలు తీసుకోండి కానీ..?

అయోధ్య అక్షింతలు తీసుకోండి కానీ..?

దేశవ్యాప్తంగా అయోధ్య  అక్షింతల పంపిణీ కార్యక్రమం సాగుతోంది. జనవరి 1న మొదలైన ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు సాగుతుంది. కార్యక్రమంలో భాగంగా అక్షింతలు, శ్రీరాముని చిత్రపటాన్ని అందిస్తారు.

జనవరి 22న అయోధ్య గర్భాలయంలో బాలరాముని విగ్రహా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించి శ్రీరామ అక్షింతలు తలపై చల్లుకొని స్వామి వారి ఆశీర్వాదం పొందాలని, ఆరోజు రాత్రి ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి పండుగ చేసుకోవాలని  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పిలుపునిచ్చింది.

ఇప్పుడు దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. భక్తి ముసుగులో మోసానికి తెరతీశారు. ఊరూవాడా అక్షింతల పంపిణీ పేరిట కొంతమంది మోసగాళ్లు హుండీ కూడా ఏర్పాటుచేస్తున్నారు. అక్షింతలు అందుకున్న భక్తులు, అయోధ్య కోసం ఏర్పాటుచేసిన హుండీ అనుకొని అందులో డబ్బులు వేస్తున్నారు.

అయోధ్య రామాలయం పేరిట ఇలాంటి దందా గతంలో కూడా జరిగింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి సహకరించాలంటూ చాలామంది కరపత్రాలు, హుండీలతో ప్రత్యక్షమయ్యారు. చాలా రోజుల పాటు ఈ వ్యవహారం నడిచిన తర్వాత, విరాళాలు ఇవ్వొద్దని ట్రస్ట్ ప్రకటన చేసింది. అప్పటికే జరగాల్సిన తంతు జరిగిపోయింది.

ఇప్పుడు అలాంటిదే అయోధ్య అక్షింతల పేరిట మొదలైంది. భక్తి ఉంటే అయోధ్య అక్షింతలు తీసుకోండి, అంతే తప్ప ఎవరైనా హుండీ తీసుకొని వస్తే అందులో డబ్బులు, బంగారం వేయొద్దని చెబుతున్నారు ట్రస్ట్ సభ్యులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?