Advertisement

Advertisement


Home > Politics - National

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ చెత్త

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ చెత్త

ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇనస్టాగ్రామ్.. ఇలా మాధ్యమం ఏదైనా చెత్త మాత్రం కామన్ అయిపోయింది. ప్రతి నెల లక్షల్లో చెత్త (బ్యాడ్ కంటెంట్)ను డిలీట్ చేస్తోంది మెటా సంస్థ. తాజాగా మరోసారి మిలియన్ల కొద్దీ బ్యాడ్ కంటెంట్ ను తొలిగించింది.

నవంబర్ నెలకు సంబంధించి తన నివేదికను బయటపెట్టిన మెటా సంస్థ.. ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్ నుంచి 23 మిలియన్ కంటెంట్ (క్లిప్పింగ్స్, పోస్టింగ్స్ కలిపి)ను తొలిగించినట్టు ప్రకటించింది. భారతదేశ చట్టాలకు అనుగుణంగా, కంపెనీ నిర్దేశించిన ప్రమాణాలను పాటించని కంటెంట్ ను నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తోంది మెటా.

ఫేస్ బుక్ కు సంబంధించి 13 పాలసీలు, ఇనస్టాగ్రామ్ కు సంబంధించి 12 పాలసీలు పెట్టుకుంది మెటా. వీటికి అనుగుణంగా ఉన్న వీడియోలు, పోస్టింగ్స్ ను మాత్రమే అనుమతిస్తోంది. వీటిలో ఏ ఒక్క పాలసీని అతిక్రమించినా డిలీట్ చేస్తోంది.

నివేదిక ప్రకారం, ఫేస్ బుక్ నుంచి 18.3 మిలియన్ కంటెంట్ ను, ఇనస్టాగ్రామ్ నుంచి 4.7 మిలియన్ కంటెంట్ ను తొలిగించింది మెటా. దీని కోసం ప్రత్యేకమైన మెకానిజంతో కూడిన టూల్స్ ను ఉపయోగిస్తోంది. వీటిలో 4538 రిపోర్ట్స్ ను మాత్రం సునిశితంగా పరిశీలించి మరీ తొలిగించినట్టు వెల్లడించింది. దీనికి స్పెషలైజ్డ్ రివ్యూ అని పేరు పెట్టింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి లోబడి, భారత్ లోని ప్రతి సోషల్ మీడియా సంస్థ.. తన నెలవారీ నివేదికను, పాలసీను వెల్లడించాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?