Advertisement

Advertisement


Home > Politics - National

హత్యకు దారితీసిన ట్రాన్స్ జెండర్ ప్రేమకథ

హత్యకు దారితీసిన ట్రాన్స్ జెండర్ ప్రేమకథ

చిన్నప్పట్నుంచి అతడితో కలిసి పెరిగింది. ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత దూరం పెట్టింది. దీన్ని అతడు భరించలేకపోయాడు. దారుణంగా హత్య చేసి చంపేశాడు.

నందిని, మహేశ్వరి చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. మధురైలో బాలికల హైస్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం వేర్వేరు కాలేజీలకు మారారు. కాలేజీకి మారినా నందిని, మహేశ్వరి టచ్ లోనే ఉంటూ వచ్చారు.

ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని నందినికి చెప్పింది మహేశ్వరి. తను ఆడపిల్లను కాదనేది ఆ సీక్రెట్. ఈ క్రమంలో మహేశ్వరి కాస్తా వెట్రిమారన్ గా మారింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం రావడంతో నందిని, చెన్నైకి వచ్చింది. వెట్రిమారన్ బెంగళూరు వెళ్లి రకరకాల పనులు చేసి డబ్బులు సంపాదించాడు.

కొన్నాళ్లకు లింగ నిర్థారణ కోసం చెన్నై వచ్చాడు. తనకు చెందిన ప్రతి విషయాన్ని నందినికి చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టాడు. అయితే నందిని అందుకు అంగీకరించలేదు. అదే టైమ్ లో తన ఆఫీస్ లోని రాహుల్ అనే అబ్బాయికి దగ్గరైంది.

ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా నందినిని అంతం చేయాలనుకున్నాడు. పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఉదయం నుంచి రకరకాల ప్రదేశాలు తిప్పాడు. కలిసి గుడికి కూడా వెళ్లారు.

సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, గిఫ్ట్ ఇస్తా కళ్లుమూసుకోమని చెప్పాడు. ఆ వెంటనే నందిని కాళ్లు చేతులు గొలుసులతో కట్టేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో కత్తి, కిరోసిన్ దాచిపెట్టాడు. కత్తితో నందినిని గాయపరిచాడు. ఆమె బతికుండగానే నిప్పుపెట్టి పారిపోయాడు.

నందిని అరుపులు విని చుట్టుపక్కలవాళ్లు ఆమెను హాస్పిటల్ లో చేర్చారు. పోలీసులకు జరిగిన విషయం చెప్పిన నందిని, ఆదివారం చనిపోయింది. గంటల వ్యవథిలో వెట్రిమారన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?