Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆర్ఆర్ఆర్ తో పోటీ వద్దు.. ఆచార్యతో పోటీ ముద్దు..!

ఆర్ఆర్ఆర్ తో పోటీ వద్దు.. ఆచార్యతో పోటీ ముద్దు..!

సరిగ్గా కొన్ని రోజుల కిందటి సంగతి. ఆర్ఆర్ఆర్ కోసం తన ఎఫ్3 సినిమాను ఎన్ని సార్లయినా వాయిదా వేసుకోవడానికి సిద్ధమని ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా కోసం, టాలీవుడ్ అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగమైనా చేయాల్సిందే అన్నట్టు మాట్లాడాడు. అలా ఆర్ఆర్ఆర్ కోసం దారిచ్చిన దిల్ రాజు.. ఇప్పుడు ఆచార్యతో పెట్టుకున్నారు.

ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25కు రావడంతో, ఏప్రిల్ 1న రావాల్సిన ఆచార్య సినిమాను అనివార్యంగా వాయిదా వేశారు. ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే అప్పటికే ఎఫ్3 సినిమాను ఆ తేదీకి లాక్ చేసి పెట్టారు. ఆచార్య కూడా చిన్న సినిమా కాదు. చిరంజీవి లాంటి స్టార్ హీరో నటించిన సినిమా. పైగా రామ్ చరణ్ కూడా ఉన్నాడు. కొరటాల దర్శకుడు. కాబట్టి తన లాజిక్ ప్రకారం చూసుకుంటే, టాలీవుడ్ బాగు కోసం దిల్ రాజు ఎఫ్3 సినిమాను వాయిదా వేసుకోవాలి.

కానీ ఇవేవీ దిల్ రాజు పట్టించుకోలేదు. ఇంతకుముందు ప్రకటించిన ఏప్రిల్ 29 తేదీ కంటే, ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 28న ఎఫ్3ను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో ఎఫ్3, ఆచార్య మధ్య పోటీ ఏర్పడింది.

"రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండకూడదు, థియేటర్ల సమస్య ఎదురుకాకూడదు, అందుకే ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో చర్చించి రిలీజ్ డేట్స్ సర్దుబాటు చేసుకుంటామని" పదే పదే చెబుతుంటారు దిల్ రాజు. ఇప్పుడు అదే నిర్మాత ఆచార్య కోసం తన సినిమాను మరోసారి వాయిదా వేసుకోవడానికి ఇష్టపడలేదు. నిజానికి ఎఫ్3 షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇంకో పాట తీయాల్సి ఉంది. ఆచార్య మాత్రం దాదాపు రెడీ అయింది.

ఆచార్య సినిమాను నైజాంలో వరంగల్ శ్రీను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజును దాటి మంచి రేటు ఆఫర్ చేసి ఆచార్య హక్కులు దక్కించుకున్నారు వరంగల్ శ్రీను. పైగా ఈయనకు, దిల్ రాజుకు మధ్య చిన్న చిన్న అభిప్రాయబేధాలున్నాయి. క్రాక్ సినిమా టైమ్ లో దిల్ రాజుపై శ్రీను దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. 

ఇవన్నీ మనసులో పెట్టుకొని, ఆచార్యకు పోటీగా, ఆ సినిమా కంటే ఒక రోజు ముందు ఎఫ్3ని దిల్ రాజు షెడ్యూల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?