సుధీర్ బాబు సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌

వైవిధ్య‌మైన సబ్జెక్ట్‌లు ఎన్నుకుని సినిమాలు చేస్తున్న హీరో సుధీర్ బాబు. కొత్తగా ఓ సినిమాకు ఓకె చెప్పాడు. ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంత‌కు…

వైవిధ్య‌మైన సబ్జెక్ట్‌లు ఎన్నుకుని సినిమాలు చేస్తున్న హీరో సుధీర్ బాబు. కొత్తగా ఓ సినిమాకు ఓకె చెప్పాడు. ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌బోతోందీ సినిమా. ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యాన‌త ఉంది. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయాలన్నది నిర్మాతల ఆలోచన.

ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.