Advertisement

Advertisement


Home > Sports - Cricket

మార్టిన్ గుప్తిల్ ది వైశ్య సామాజికవర్గమా?!

మార్టిన్ గుప్తిల్ ది వైశ్య సామాజికవర్గమా?!

రూట్స్.. వీటి గురించి పరిశీలిస్తూ వెళ్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా సంబంధాలు కనిపిస్తాయి. మానవ పరిణామ క్రమంలో పేర్లు అనేవి మూలాలను ఇండికేట్ చేస్తూ ఉంటాయి. మతాలు, దేశాలు, ఖండాలు వేరైనా.. వీటన్నింటికీ ఎక్కడో సంబంధాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చెప్పబడే మూలాల్లో వాస్తవాలు ఉన్నా లేకపోయినా.. ఆసక్తికరంగా అయితే ఉంటాయి.

ఉదాహరణకు పాకిస్తాన్ క్రికెటర్ ఒకతని పేరు సల్మాన్ భట్. ఈ మధ్య జట్టులో కనిపించడం లేదు కానీ.. ఈ మాజీ ఓపెనర్ గతంలో ఇండియాపై ఒకటీ రెండు ఇన్నింగ్స్ బాగా ఆడాడు. ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఇతడి ఇంటి పేరు.. చాలా మంది హిందువుల ఇంటి పేర్లలో ఉంటుంది. మహేశ్ భట్.. విక్రమ్ భట్.. వీళ్ల ఇంటి పేరు, పాకిస్తానీ క్రికెటర్ ఇంటి పేరు ఒకటే! వీరి మూలాల పరంగా చూస్తే.. వీళ్లంతా ప్రస్తుతం పాక్ లో ఉన్న పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్లు! దేశ విభజన సమయంలో ఇండియాకు వచ్చిన వారు హింధూ 'భట్'లుగా ఉంటే.. పాక్ లోనే ఉన్న వారు ముస్లింలయ్యారు. అయితే వారి ఇంటి పేరులోని 'భట్' మాత్రం చెరిగిపోలేదు!

ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ గురించి ఇలాంటి వాదనే ఒకటి వినిపిస్తోంది. మొన్న విండీస్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చెలరేగి డబుల్ సెంచరీ కొట్టి వార్తల్లోకి వచ్చిన గుప్తిల్ గురించి ఆసక్తికరమైన వాదన వినిపిస్తున్నాడు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. 

'గుప్తిల్' అనే ఈ పేరుకు మూలం 'గుప్తా' అని అంటున్నాడాయన. గుప్తా అనే పేరే న్యూజిలాండ్ లో గుప్తిల్ అయ్యిందనే థియరీని బట్టి  ఖురానా ఈ వాదన వినిపిస్తున్నాడు. ఈ లెక్కన గుప్తిల్ ఫ్యామిలీ ఎన్నో తరాల కిందట ఇండియా నుంచి న్యూజిలాండ్ తరలి వెళ్లి ఉండాలి. అక్కడి సంస్కృతిలో వారు భాగమైపోయి గుప్తాలు కాస్తా గుప్తిల్ అయ్యుండాలి! మరి మన దేశంలో "గుప్తా'' అనే పేరును వైశ్యులు పెట్టుకొంటారు. దీన్ని బట్టి.. గుప్తిల్ వైశ్యుడని అనుకోవచ్చని ఈ థియరీ చెబుతోంది. విశ్వసనీయమా కాదా.. అనేది పక్కనపెడితే వినడానికి అయితే ఈ రూట్స్ ఆసక్తికరంగా ఉంటాయి! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?