Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అయితే కీరవాణి లేకుంటే ఇళయరాజా?

అయితే కీరవాణి లేకుంటే ఇళయరాజా?

స్మూత్ గా సాగిపోతోందనుకున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా సమస్యల్లో పడింది. సంగీత దర్శకుడు దేవీ తప్పుకున్నాడు. గడచిన కొన్ని రోజులుగా దీనిపై మల్ల గుల్లాలు పడుతున్నారు. కాస్త ఎక్కువ సమయం కావాలని క్రిష్, అంత సమయం తనకు లేదని దేవీ. దీంతో నిర్మాతలు రాజీవ్ రెడ్డి తదితరులు కలుగ చేసుకుని, స్మూత్ గా బ్రేకప్ కానిచ్చేసారు. సో..? ఇప్పుడు తరువాత ఎవరు? క్రిష్ కు కావాల్సింనంత ఎక్కువ టైమ్ కేటాయించేవాళ్లు ఎవరు? కీరవాణి, ఇళయరాజా ల పేర్లు వినిపిస్తున్నాయి.

కానీ కీరవాణి బహుబలి బిజీలో వున్నారు. అందువల్ల ఓకె అంటారా? అన్నది అనుమానం. అలాగే ఇళయరాజా పేరు కూడా వినిపిస్తోంది.  సమస్య ఏమిటంటే టైమ్ కన్నా, ఇక్కడ అసలు విషయం, మేధావులు మేధావులు ఒకంతట రాజీ పడరు. క్రిష్ వాళ్ల బాటలోకి వెళ్లాలి కానీ, వాళ్లు ఈయన బాటలోకి అంత సులువుగా రారు. కీరవాణి వేదం సినిమాకు క్రిష్ తో కలిసి పనిచేసారు. 

అందువల్ల సెట్ అయ్యే అవకాశం వుంది కానీ బాహుబలే అడ్డంకిగా కనిపిస్తోంది. బాలయ్యకు ఇష్టమైన మణిశర్మ వున్నారు, ఆయన క్రిష్ తో కృష్ణం వందే జగద్గురుం సినిమాకు పనిచేసారు కానీ, ఇప్పుడు ఫామ్ లో లేరు. ప్రాజెక్ట్ కు క్రేజ్ రాదు. కంచెకు చేసిన చిరంతన్ భట్ అయితే ఎలా వుంటుంది అన్న ఆలోచన కూడా వుంది. కొద్ది రోజుల్లో మ్యూజిక్ డైరక్టర్ ను ఫైనల్ చేస్తారని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?