సీనియర్లకు సమస్య తప్పదా?

మొన్నటిదాకా బాలయ్య బాబుకే హీరోయిన్ల సమస్య. సీనియర్ల పక్కన నటిస్తే, యంగ్ హీరోలు అవకాశాలు ఇవ్వరేమో అని భయం. ఇప్పుడు ఇదే సమస్య నాగ్ కు కూడా ఎదురవుతోందట,. కళ్యాణ్ దర్శకత్వంలో తయారవుతున్న సోగ్గాడు…

మొన్నటిదాకా బాలయ్య బాబుకే హీరోయిన్ల సమస్య. సీనియర్ల పక్కన నటిస్తే, యంగ్ హీరోలు అవకాశాలు ఇవ్వరేమో అని భయం. ఇప్పుడు ఇదే సమస్య నాగ్ కు కూడా ఎదురవుతోందట,. కళ్యాణ్ దర్శకత్వంలో తయారవుతున్న సోగ్గాడు సినిమాలో నాగ్ పక్కన నటించడానికి ప్రణీత నో చెప్పిందట. 

తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. కానీ కన్నడం లో బిజీ అన్న సాకు చెప్పి, తప్పించుకుందట. నిజానికి అసలు సంగతి తను నటించాల్సిన యంగ్ హీరోలు ఇంకా తెలుగులో చాలా మంది వున్నారని, ఇప్పుడు నాగ్ పక్కన నటిస్తే వారి పక్కన నటించే అవకాశం రాదేమో అన్న భయమేనట.