అబ్బా… వ‌ర్మకూ ప్రాంతీయాభిమానం ఉందే…

మెగా ఫ్యామిలీని దుయ్యబ‌ట్టడానికి వీలున్నప్పుడ‌ల్లా త‌న‌దైన శైలిలో ప్రయ‌త్నం చేస్తూనే ఉన్నాడు ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. కొన్ని రోజుల క్రితం దాకా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తో కెలుక్కున్న రాము… ఇప్పుడు ఏకంగా చిరంజీవి మీదే…

మెగా ఫ్యామిలీని దుయ్యబ‌ట్టడానికి వీలున్నప్పుడ‌ల్లా త‌న‌దైన శైలిలో ప్రయ‌త్నం చేస్తూనే ఉన్నాడు ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. కొన్ని రోజుల క్రితం దాకా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తో కెలుక్కున్న రాము… ఇప్పుడు ఏకంగా చిరంజీవి మీదే ప‌డ్డాడు. మెగాస్టార్‌కు పెద్ద అభిమానిని అంటూనే చిరుపై త‌న ట్వీట్లతో విమ‌ర్శలు గుప్పించాడు. 

బ్రూస్‌లీ చిరంజీవి 150వ సినిమా అంటూ వ‌ర్మ ప్రక‌టించేశాడు. త‌ర్వాత చిరంజీవి చేయ‌బోయేది 151 సినిమాయే అవుతుంది త‌ప్ప అది 150వ‌ది కాబోద‌న్నాడు. ఇక బ్రూస్‌లీ అనే సినిమాలో చేయ‌డం చిరంజీవి చేసిన పెద్ద త‌ప్పు అంటూ దానిని ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అనే త‌ప్పుతో పోల్చాడు. చిరంజీవి త‌ర్వాత సినిమా చేస్తే ఎంట‌ర్ ది డ్రాగ‌న్ చేయాలంటూ వ్యంగ్యోక్తులు విసిరాడు. 

చిరు ఫ్యామిలీకి, రాజ‌మౌళికి కూడా ఫిట్టింగ్ పెట్టాల‌నుకుంటున్నాడా వ‌ర్మ అన్నట్టు దీనిలోకి రాజ‌మౌళిని కూడా లాక్కొచ్చేశాడు. టాలీవుడ్‌కి బ్రూస్‌లీ అంటే రాజ‌మౌళి మాత్రమే న‌న్నాడు. చిరంజీవి త‌న త‌దుపరి సినిమా బాహుబ‌లికి మించిన రేంజ్‌లోఉండేలా తీయాలంటూ చిరంజీవిపై ఒత్తిడి  పెంచే య‌త్నం చేశాడు. 

వీట‌న్నింటితో పాటు, ఎప్పుడూ రామ్‌గోపాల్ వ‌ర్మ నోట విన‌ని, ప్రాంతీయాభిమానం విన‌ప‌డింది.  చిరంజీవిని విమ‌ర్శించ‌డానికి ఆయుధంగా వాడుకున్నాడో లేక నిజంగానే తెలుగువారి మీద వ‌ర్మకు బోలెడంత ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందో తెలీదు కాని, 150 వ సినిమా చేయ‌డానికి త‌మిళ రీమేక్‌ని చిరంజీవి ఎంచుకోవ‌డాన్ని వ‌ర్మ త‌ప్పుప‌ట్టాడు. ఇది తెలుగువారిని అవ‌మానించ‌డ‌మే అన్నాడు. అచ్చమైన తెలుగు సినిమా మాత్రమే చేయాలంటూ చిరంజీవికి సూచించాడు. 

అత్త మీద కోపం దుత్త మీద చూపిన‌ట్టు సెన్సార్ మీద కోపంతో ఇక‌పై తెలుగు సినిమాలు తీయ‌బోన‌ని ప్రక‌టించి హిందీకి వెళ్లిపోయిన వ‌ర్మ.. ఆ త‌ర్వాత ఆ శ‌ప‌ధాన్ని వెన‌క్కు తీసుకుని ఇటొచ్చాడు. అదేంటంటే… త‌న మాట మీద త‌నే నిల‌బ‌డ‌న‌ని బ‌య‌ట‌కే చెప్పే వ‌ర్మ… అక‌స్మాత్తుగా ఇలా ప్రాంతీయ‌త‌ను నెత్తికెత్తుకోవ‌డం విశేషమే. అయితే ఇదెంత‌కాల‌మో చూడాలి.