సినిమా కోసం బాలయ్య స్లిమ్

బాలయ్య బాబు కొత్త సినిమా 29న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతోంది. ఇందుకోసం బాలయ్య గెటప్ మొత్తం మార్చే పనిలో పడ్డాడట దర్శకుడు శ్రీవాస్. ఇందుకోసం ముంబాయి, మరి కొన్ని చోట్ల మంచి మంచి మంచి…

బాలయ్య బాబు కొత్త సినిమా 29న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతోంది. ఇందుకోసం బాలయ్య గెటప్ మొత్తం మార్చే పనిలో పడ్డాడట దర్శకుడు శ్రీవాస్. ఇందుకోసం ముంబాయి, మరి కొన్ని చోట్ల మంచి మంచి మంచి కాస్ట్యూమ్స్ తెప్పిస్తున్నట్లు వినికిడి. 

బాలయ్య కూడా జిమ్ లో చెమటోడుస్తున్నారు స్లిమ్ కావడం కోసం. ఈరోస్ నిర్మిస్తున్న సినిమాకు మొత్తానికి నిన్న కథ ఫైనల్ అయిందట. కోనవెంకట్, గోపీ మోహన్, సీపాన శ్రీధర్, రత్నం వంటి రచయితలు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసారు. థమన్ సంగీతం అందించే ఈ సినిమాను ఈరోస్ సంస్థ శ్రీవాస్ తో కలిసి నిర్మిస్తోంది. 

ఎలాగైనా హిట్ కొట్టాలన్నది దర్శకుడు శ్రీవాస్ ప్రయత్నం. అందుకోసం టాప్ టెక్నీషియన్లను, రచయితలను కూడదీసుకుని కిందామీదా అవుతున్నాడు.