‘బాహుబలి’.. ‘భళ్ళాలదేవ’ వచ్చేశాడు

‘బాహుబలి’.. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ ‘బాహుబలి’ రిలీజ్‌ కోసం అక్కడి ప్రముఖులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కారణం, రాజమౌళి గత చిత్రం ‘ఈగ’ అన్ని భాషల్లోనూ సాధించిన…

‘బాహుబలి’.. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ ‘బాహుబలి’ రిలీజ్‌ కోసం అక్కడి ప్రముఖులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కారణం, రాజమౌళి గత చిత్రం ‘ఈగ’ అన్ని భాషల్లోనూ సాధించిన విజయమే. 

ప్రభాస్‌, రాణా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, సుదీప్‌, రమ్యకృష్ణ, నాజర్‌.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రెండు పార్టులుగా సినిమా విడుదల కానుండగా, తొలి పార్ట్‌ జులైలో విడుదలవుతుంది. సినిమాపై హైప్‌ పెంచడానికో, ఆడియన్స్‌కి హింట్‌ ఇవ్వడానికో రాజమౌళి పక్యా వ్యూహంతో పబ్లిసిటీ చేస్తున్నాడు.

ఫస్ట్‌ లుక్‌.. అంటూ సినిమాకి సంబంధించిన వివిధ క్యారెక్టర్స్‌ని రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌లో రిలీజ్‌ చేస్తూ ఆడియన్స్‌లో సినిమాపై హై టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. తాజాగా ‘భళ్ళాలదేవ’గా రాణా లుక్‌ని రాజమౌళి రిలీజ్‌ చేశాడు. ప్రభాస్‌, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్‌, తమన్నా, సుదీప్‌, సత్యరాజ్‌ తదితరుల పాత్రలతో ఇప్పటికే పలు లుక్స్‌ని రాజమౌళి విడుదల చేసిన విషయం విదితమే.

ఇప్పటిదాకా వచ్చిన లుక్స్‌తో పోల్చితే ‘భళ్ళాలదేవ’ లుక్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ అనే చెప్పాలి. సినిమాలో హీరోకి ధీటుగా రాణా క్యారెక్టర్‌ వుండనుంది.