విభజన ‘సాక్షి’గా విబేధాలు

సాక్షి దినపత్రికది చాలా వైవిధ్యమైన వ్యవహారం. అసలు పత్రిక పుట్టడమే పూర్తిగా కార్పొరేట్ స్టయిల్ లో పుట్టింది. ఏ తెలుగుపత్రికకు లేని విధంగా ఎడిటోరియల్ డైరక్టర్ వున్నారు దానికి. సాక్షి మిగతా వ్యవహారాలు ఎలా…

సాక్షి దినపత్రికది చాలా వైవిధ్యమైన వ్యవహారం. అసలు పత్రిక పుట్టడమే పూర్తిగా కార్పొరేట్ స్టయిల్ లో పుట్టింది. ఏ తెలుగుపత్రికకు లేని విధంగా ఎడిటోరియల్ డైరక్టర్ వున్నారు దానికి. సాక్షి మిగతా వ్యవహారాలు ఎలా వున్నా ఆది నుంచీ పాఠకులను ఆకట్టుకోవడంలో మాత్రం బాగానే వుంటోంది. దానికి కారణం దాని ఫ్యామిలీ విభాగం సక్సెస్ అని అందరికీ తెలుసు. సాక్షి వైకాపా పార్టీకి అనుబంధం కాకున్నా, దీని మూలాలు దాంట్లో దాని అవసరాలు దీంట్లో వున్నాయి. అందువల్లే ఓ రాజకీయ పార్టీకి అనుబంధ విభాగాల మాదిరిగానే సాక్షిలోనూ కాస్త స్వతంత్ర రాజ్యాలు ఎక్కువని జర్నలిస్ట్ సర్కిళ్లలో వినిపిస్తూ వుంటుంది. ఇప్పుడు ఇటీవల ఈ విభాగాలకు మరోటి తోడయిందని, అది విభజన తెచ్చిన సమస్య అని తెలుస్తోంది.

సాక్షి ఆరంభం నుంచీ కూడా మెయిన్ పేపర్, ఫ్యామిలీ అనే రెండు అటామనస్ బాడీలు నడుస్తున్నాయని వినికిడి. ఫ్యామిలీని రామ్ చూసేవారు. దాని వైనం దానిదే. ఎక్కడ చూసినా రామ్..నామ సంకీర్తన వుండేది.తరువాత రామ్ బయటకు వెళ్లి,  ఖదీర్ బాబు వచ్చారు. ఎక్కడ చూసినా ఆయన పేరు కనిపించేది. ఇంతలో ఆయన పక్కకు వెళ్లిన తరువాత ఒక్కొక్కరు మారుతూ ఇప్పుడు జయదేవ్ వచ్చారు. వీళ్లందరిపైనా ఇందిరా పరిమి వుంటున్నారు. మెయిన్ పేపర్ వ్యవహారాలు వేరు,.ఫ్యామిలీ వ్యవహారాలు వేరు అన్నట్లుగానే ఇన్నాళ్లు నడుస్తూ వస్తున్నాయి. సాక్షిలో ఇలా జరుగుతూ వస్తున్నమార్పులు ఇన్నీ అన్నీ కావు. వాటిలో రామ్ వెళ్లిపోవడం, సజ్జలను పంపేయడం కూడా వున్నాయి.
సాక్షి, ఫ్యామిలీ, టీవీ, ఇంటర్ నెట్, ఇలా దేనికవి వాటి వాటి పాలసీలతో నడుస్తున్నట్లు కనిపిస్తాయి గతంలో చాలా సార్లు సాక్షి నెట్ లో సినిమాపై ఓ తరహా సమీక్ష వస్తే, డైలీలో ఇంకో తరహా సమీక్ష వచ్చేది. దేని దారి దానిదే.

రచయితలకు కూడా అక్కడి నాధుడిని బట్టి మారిపోతారు. ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చాక, ఆయన చాలా మందిని తెచ్చారు..‘నా రచన వేయడానికి అక్కడ కొంతమందికి ఇబ్బందేమో తెలియదు..కానీ అంత ఆసక్తి మాత్రం లేదని నాకు అనిపిస్తుంది..’ అన్నారు ఓ రచయిత. అందుకే గతంలో ఆపేసాను..అన్నారాయన…రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరక్టర్ అయ్యాక ఆయన మళ్లీ సాక్షి కి రచనలు చేస్తున్నారు. 

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనే కోత్త గీతలు కూడా సాక్షిలో వచ్చాయని గుసగుసలు వినిపిస్తునాయి. పైకి తేలకున్నా లోలోపల ఇవి మెలమెల్లగా రాజుకుంటున్నాయని వినికిడి. సాక్షిని స్వంతంత్ర దినపత్రికగా మార్చాలని, పార్టీ పత్రిక అన్న ఇమేజ్ తుడిచేయాలని ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. వాటివల్ల ఇప్పుడు పత్రిక ఇది వరకు కన్నా కాస్త బాగుందని అంటున్నారు. అయితే సాక్షిలో తెలంగాణ ప్రాంతం వారు ఎక్కువగా వుండడం వల్ల ఆ ప్రాంత వార్తలపై ఎక్కువ ఫోకస్ వస్తోందని, అందులోని ఆంధ్ర జనాలు చెవులు కొరుక్కుంటున్నారట.

సమర్థుడైన వ్యక్తి కాబట్టి రామచంద్రమూర్తి హయాంలో ఈ స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాలు అంతరించి, మంచి పత్రికగా సాక్షి నిలబడతుందని ఆశిద్దాం.