దర్శకరత్న దాసరి నారాయణరావు ఈతరం ప్రేక్షకుల్ని మెప్పించడంలో చాలా కాలంగా విఫలమవుతున్నారు. ‘ఒసేయ్ రాములమ్మ’ తర్వాత దాసరికి దర్శకుడిగా, రచయితగా హిట్ లేదు. ఆయన డైరెక్ట్ చేసిన మోస్ట్ రీసెంట్ ఫిలింస్ పరమవీరచక్ర, యంగ్ ఇండియా డిజాస్టర్స్ అయ్యాయి. కాస్త ముందుకి వెళితే ఫూల్స్, కొండవీటి సింహాసనం లాంటి భారీ ఫ్లాపులున్నాయి.
గత పదిహేనేళ్లలో దాసరి తీసిన సినిమాల్లో ఏదీ విజయవంతం కాలేదు. అయినా కానీ ‘ఎర్రబస్సు’తో ట్రెండ్ సృష్టిస్తానని ఈ దిగ్గజ దర్శకుడు నమ్మకంగా చెబుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘మంజ పయ్’ చిత్రానికి రీమేక్ అయిన ‘ఎర్రబస్సు’లో టైటిల్ రోల్ దాసరే చేసారు. శుక్రవారం విడుదలవుతోన్న ఈ చిత్రానికి పబ్లిసిటీ ఘనంగానే చేస్తున్నారు.
అయితే ఇన్నేళ్లలో ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయలేక ఇబ్బంది పడుతోన్న దాసరి నారాయణరావు సడన్‌గా ఫామ్‌లోకి వచ్చి ట్రెండ్ సృష్టించే సినిమా తీయడం జరిగే పనేనా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.