బన్నీ సినిమాకు బడ్జెట్ పెరుగుతోంది

త్రివిక్రమ్..బన్నీ..సమంత..నిత్య..దేవీ..ఇంకా చాలా మంది…ఇదేమన్నాచిన్నాచితకా కాంబినేషనా? అక్కడికే పాతిక కోట్లకు లాగేస్తుంది..టోటల్ స్టార్ కాస్ట్. మరి సినిమాకు? మరో పది నుంచి పదిహేను కలిపేసుకున్నా..నలభై అయిపోతుందేమో? త్రివిక్రమ్-బన్నీకాంబినేషన్ క్రేజ్ అయితే వుంది. Advertisement కానీ జులాయి…

త్రివిక్రమ్..బన్నీ..సమంత..నిత్య..దేవీ..ఇంకా చాలా మంది…ఇదేమన్నాచిన్నాచితకా కాంబినేషనా? అక్కడికే పాతిక కోట్లకు లాగేస్తుంది..టోటల్ స్టార్ కాస్ట్. మరి సినిమాకు? మరో పది నుంచి పదిహేను కలిపేసుకున్నా..నలభై అయిపోతుందేమో? త్రివిక్రమ్-బన్నీకాంబినేషన్ క్రేజ్ అయితే వుంది.

కానీ జులాయి కలెక్షన్లు నలభై దగ్గర ఆగాయి. అయితే రేసుగుర్రం కలెక్షన్ల తెచ్చిన భరోసా వుంది. దానికి దాదాపు అన్నీ కలిపి అరవై దగ్గర వరకు వచ్చింది.  అందుకే నిర్మాతలు ధైర్యంగా వున్నారట. అయితే వీలయినంత జాగ్రత్తగా ఖర్చు చేయాలని బన్నీ, త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. వీలయినంత వరకు మఫై అయిదు దగ్గర ఆపాలనుకుంటున్నారు. 

కానీ పబ్లిసిటీ వగైరా వ్యవహారాలు అన్నీ కలిపి మరో మూడు వరకు ఖర్చు తప్పదంటున్నారు. బన్నీ-త్రివిక్రమ్ లాంటి కాంబినేషన్ సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా నలభై దాటేస్తుంది. అదో భరోసా వుండనే వుంది. అందుకే బడ్జెట్ కు ఆలోచించకుండా ముందుకెళ్లమని నిర్మాతలు అంటున్నారట తమ హీరో డైరక్టర్లతో.